
Lokesh Kanagaraj’s Telugu Multi Starrer: లోకేష్ కనకరాజ్.. సౌత్ లో బాగా వినిపిస్తున్న డైరెక్టర్ పేరు ఇది. ఇంకా చెప్పాలంటే.. కూలీతో నార్త్ లో కూడా బాగా వినిపించే పేరు ఇది. భారీ తారాగణంతో సినిమా తీయడమే కాదు.. అనుకున్న టైమ్ కి.. పూర్తి చేయడం.. అది కూడా తక్కువ రోజుల్లోనే సినిమాని పూర్తి చేయడం అనేది లోకేష్ స్టైల్. లోకేష్ ను రజినీకాంత్.. రాజమౌళితో పోల్చారంటే… ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. కూలీ మూవీతో లోకేష్.. బ్లాక్ బస్టర్ సాధించడం ఖాయమని గట్టి నమ్మకంతో ఉన్నారు సినీ జనాలు. కూలీతో తెలుగు హీరో నాగార్జునను డైరెక్ట్ చేసిన లోకేష్.. నెక్ట్స్ తెలుగులో ఏ హీరోతో సినిమా చేయనున్నాడు అనేది ఆసక్తిగా మారింది. ఇంతకీ.. లోకేష్ ప్లాన్ ఏంటి..?
లోకేష్ కనకరాజ్.. కూలీ తర్వాత పెద్ద లైనపే ఉంది. ఖైదీ 2 చేయాలి.. విక్రమ్ 2 చేయాలి.. ఈ రెండు సినిమాలు కాకుండా లోకేష్ కనకరాజ్ హీరోగా మారి ఓ సినిమా చేయడానికి ఓకే చెప్పాడు. దీనికి సంబంధించిన వర్క్ కూడా జరుగుతుంది. అలాగే సూర్య హీరోగా అలెక్స్ పాత్రతో ఓ భారీ సినిమా చేయాలి. ఇలా ఏమాత్రం గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేసేందుకు పక్కా ప్లాన్ రెడీ చేశాడు లోకేష్. అలాగే బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ తో కూడా లోకేష్ ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ విషయాన్ని అమీర్ ఖాన్ కూడా కన్ ఫర్మ్ చేశాడు.
ఇదిలా ఉంటే.. లోకేష్ కనకరాజ్ తెలుగులో సినిమా చేసేందుకు గతంలో ప్రయత్నించినట్టుగా వార్తలు వచ్చాయి. ఆమధ్య పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ఓ భారీ పాన్ ఇండియా మూవీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా టాక్ వచ్చింది. అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కూడా ఓ మూవీ చేసేందుకు ప్లానింగ్ జరిగిందని న్యూస్ లీకైంది. ఏమాత్రం ఫెయిల్యూర్ లేకుండా వరుసగా సక్సెస్ సాధిస్తున్న లోకేష్ తో సినిమాలు చేసేందుకు టాలీవుడ్ హీరోలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీంతో లోకేష్ కనకరాజ్ తెలుగు హీరోల్లో ఏ హీరోతో మూవీ చేస్తాడు అనేది ఆసక్తిగా మారింది. Lokesh Kanagaraj’s Telugu Multi Starrer.
ఇదే విషయం గురించి లోకేష్ ను అడిగితే.. అదిరిపోయే ఆన్సర్ ఇచ్చాడు. ఏం చెప్పాడంటే.. తనకు తెలుగులో ఉన్న హీరోలందరితో వర్క్ చేయాలని వుందన్నాడు. ఆతర్వాత తెలుగులో ఉన్న యాక్షన్ హీరోలతో సినిమాలు చేయాలి అనుకుంటున్నట్టుగా చెప్పాడు. అంతే కాకుండా మరో హింట్ ఏంటంటే.. మల్టీస్టారర్ సినిమా చేయాలి అనుకుంటున్నారా అంటే.. అవును.. తెలుగులో యాక్షన్ హీరోలతో మల్టీస్టారర్ చేస్తానని చెప్పాడు. దీంతో తెలుగులో ఏ ఏ హీరోలను కలిపి యాక్షన్ మూవీ చేస్తాడా..? అనే క్యూరియాసిటీ ఇప్పటి నుంచి పెరిగింది. అయితే.. లోకేష్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి మరింతగా క్లారిటీ రావాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.
Also Read: https://www.mega9tv.com/cinema/peddi-makers-are-planning-a-special-song-with-pooja-hegde/