శ్రీవాణి టికెట్ల కేటాయింపులలో ఇకపై భక్తులకు డిజిటల్ కంకణాలు..!

Tirupati Srivani Trust Tickets: తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన శ్రీ వేంకటేశ్వర ఆలయ నిర్మాణం (శ్రీవాణి) ట్రస్ట్‌కు భక్తుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. సనాతన ధర్మప్రచారంలో భాగంగా మారుమూల ప్రాంతాలలో శ్రీవారి ఆలయాలు నిర్మించడం, మతమార్పిడులను అరికట్టడం, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అర్చక శిక్షణ లాంటి కార్యక్రమాల కోసం టీటీడీ ఈ ట్రస్ట్‌ను ప్రారంభించింది. అయితే ట్రస్ట్ ప్రారంభించిన నాలుగు సంవత్సరాల కాలంలోనే వెయ్యి కోట్లుకు చేరుకున్నాయి భక్తుల విరాళాలు.. 2018 ఆగస్టులో శ్రీవాణి ట్రస్ట్ ను ప్రారంభించారు.. 2019 అక్టోబర్ నుంచి భక్తులకు అందుబాటులోకి వచ్చింది శ్రీవాణి ట్రస్ట్..ఇలా నాలుగేళ్ల కాలంలోనే వెయ్యి కోట్లు పైగా విరాళంగా వచ్చాయి చేరాయి. శ్రీవాణి ట్రస్ట్ నిధులతో 176 పురాతన ఆలయాల పునఃరుద్ధరణ చర్యలను చేసారు.ఇక, 500 లకు పైగా ఆలయాలకు ధూపధీప నైవేథ్యం కింద ప్రతి నెల 5 వేల చొప్పున చెల్లిస్తూ వస్తుంది టీటీడీ. ఈ విధంగా రోజు రోజుకి శ్రీవాణి ట్రస్టు ద్వారా స్వామివారికి ఆదాయం పెరుగుతుంది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పదివేల 500 కట్టి, డొనేషన్ ఇచ్చి దర్శనానికి వెళ్లే భక్తులకు మెరుగైన సేవలు అందించాలని భావించండి. దీనికి టిటిడి చైర్మన్ బి.ఆర్. నాయుడు ప్రతిరోజు శ్రీవాణి ట్రస్ట్టు ద్వారా 10వేల500 కట్టి వెళ్లే వారికి మెరుగైన సేవలు అందించాలని సూచించారు. దీంతో అదనపు ఈవో వెంకయ్య చౌదరి శ్రీవాణి ట్రస్ట్ భక్తులకు సులువుగా శ్రీవాణి టికట్లు పొందే ఆలోచనకు శ్రీకారం చుట్టాలు.

తిరుమల శ్రీవారి దర్శనం కోసం ప్రత్యేకంగా వీఐపీల కోసం అమలు చేస్తున్న శ్రీవాణి టిక్కెట్ల కేటాయింపులను భక్తులకు మరింత మరింత సులువుగా తొందరగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కట్లను తీసుకునే విధంగా మెరుగైన సౌకర్యాలను అందించేందుకు టీటీడీ ఆధునిక పద్ధతులను ఉపయోగించాలని నిర్ణయించింది. ఆఫ్లైన్ ద్వారా ప్రతిరోజు 800 టికెట్లను తిరుమలలో కేటాయిస్తున్న పద్ధతిని భక్తులకు విశాలవంతమైన ప్రాంతాన్ని ఏర్పాటు చేసి కొద్దిరోజుల క్రితం మార్పులు చేర్పులు చేశారు.10.500 రూపాయలు చెల్లిస్తున్న భక్తులు తెల్లవారుజామున క్యూ లైన్ వద్దకు వెళ్లి క్యూలో వేచి ఉండి తరువాత ఇక్కట్టు తీసుకునేవారు. వెంకయ్య చౌదరి నేరుగా భక్తుల ఇబ్బందులను పరిశీలించి వారికి ఇంకా మెరుగైన సేవలు అందించాలని భావించారు.ఇకపై శ్రీవాణి టికెట్లను క్యూ లైన్ లో గంటలు తరబడి వేచి ఉండి ఇబ్బందులు పడకుండా భక్తులకు సుదర్శనం టోకెన్ల కంకణాల తరహాలో భక్తులకు డిజిటల్ టోకెన్లను కట్టేలాగా నిర్ణయం తీసుకున్నారు.

వేకువచ్చామనే ఈ టోకెన్లు పొందిన భక్తులు గంటల తరబడి వేచి ఉండే అవసరం లేకుండా… తిరుమలలో మరిన్ని ఆలయాలను చూసే వెసులుబాటుతో పాటు, వారు వేరే పనులు చూసుకుని దర్శనానికి వెళ్లే సమయంలోపు ఏ సమయంలోనైనా టికెట్లు పొందే అవకాశాన్ని కల్పిస్తారు. ఇందుకోసం ఉదయాన్నే క్యూలైన్లో వచ్చిన వారికి మొదట వచ్చిన వారికీ మొదట టికెట్ లు కేటాయించే పద్ధతిలో 800 మంది భక్తులకు టోకెన్ తరహాలో డిజిటల్ కంకణాన్ని చేతికి కడతారు. అందులో సీరియల్ నెంబర్ తో పాటు భక్తుల వివరాలు కూడా సిస్టంలో నమోదు చేసిన అనంతరం పంపిణీ చేస్తారు. మరో కొన్ని రోజులు లోపు ఈ తాజా నిర్ణయాన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అధికారులతో అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సమీక్షిస్తున్నారు.‌ప్రస్తుతం శ్రీవాణి టికెట్లను తీసుకునేందుకు తిరుమలలోని హెచ్ వి డి సి ప్రాంతంలో ప్రత్యేకంగా ఆధునికరించిన కార్యాలయాన్ని కూడా కొద్ది రోజుల క్రితమే ప్రారంభించారు. ఇక్కడ శ్రీవాణి టికెట్లను తీసుకున్న రోజు కాకుండా మరుసటి రోజున శ్రీవారి దర్శనాన్ని కల్పించే పద్ధతికి స్వస్తి పలికి ఏ రోజు కా రోజు ఉదయం టికెట్లు తీసుకుంటే సాయంత్రం నాలుగున్నర గంటలకు శ్రీవారి దర్శనానికి అనుమతించే విధంగా ఇటీవలే మార్పులు చేసారు. Tirupati Srivani Trust Tickets.

రోజు రోజుకి శ్రీవాణి ట్రస్ట్ టికెట్లకు భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది‌. ఈ టికెట్లను పొందేందుకు తెల్లవారుజామున 5 గంటల నుండి భక్తులు క్యూ కడుతున్నారు.కానీ టీటీడీ మాత్రం ఉదయం 10 గంటలకు టికెట్ల పంపిణీ ప్రారంభిస్తోంది.శ్రీవాణి టికెట్లు కేటాయింపు కార్యాలయంలో ఆధునిక సౌకర్యాలు ఏర్పాటు చేశారు.కానీ భక్తుల తాకిడి అధికం కావడం చివరకు ఎనిమిది వందల టికెట్లు కేటాయింపు పూర్తయి మిగిలిన వారికి టికెట్లు రాకపోవడంతో టీటీడీ అధికారులకు ఒక విధంగా ఒత్తిడి ఏర్పడుతోంది.‌ ఒత్తిడి మాట ఆలా పెడితే భక్తులు గంటలు..గంటలు వేచి ఉండాల్సిన పరిస్థితి లేకుండా శ్రీవాణి టిక్కెట్ల కేటాయింపుల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించి పది నిమిషాల్లో టికెట్లు పొంది సౌకర్యంగా శ్రీవారి దర్శనానికి వెళ్లే విధంగా అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి ఏర్పాట్లు చేపట్టారు. ఈ కంకణాలు విధానం అమలులోకి వస్తే ఎక్కువసేపు శ్రీవాణి టోకెన్లు పొందే ప్రాంతంలో భక్తులు వేచి ఉండే పరిస్థితి ఉండదు. ఇది అమలు అయితే శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు తీసుకునే భక్తుల కష్టాలు తీరినట్లే. దీనిని వీలైనంత త్వరగా అమలు చేసే విధంగా సాఫ్ట్వేర్ను అప్డేట్ చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకు రావడానికి అదనపు ఈవో వెంకయ్య చౌదరి కార్యాచరణ ప్రారంభించారు.

Also Read: https://www.mega9tv.com/andhara-pradesh/kovur-constituency-vemireddy-prashanthi-reddy-standing-with-the-people/