రాహుల్ తో భేటీకీ జగన్ ప్లాన్.!

Rahul Gandhi And YS Jagan: దేశ‌వ్యాప్తంగా స్వతంత్ర క్రాంతి పేరుతో కాంగ్రెస్ అగ్ర‌నేత‌, ఎంపీ రాహుల్ గాంధీ ఉద్య‌మించేందుకు రెడీ అయ్యారు. ఎన్నిక‌ల సంఘం-బీజేపీతో కుమ్మ‌క్క‌యింద‌ని, ఓట్ల‌ను తారుమారుచేసి బీజేపీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని ఆయ‌న ఆరోపిస్తున్నారు. ఈ క్ర‌మంలో రాహుల్ గాంధీతో జ‌గ‌న్ భేటీ అయ్యేందుకు, ఆయ‌న చేస్తున్న స్వ‌తంత్ర క్రాంతి ఉద్య‌మానికి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించేందుకు సిద్ధ‌మవుతున్న‌ట్టు.. తాడేప‌ల్లి వ‌ర్గాలు చెబుతున్నాయి. అయితే.. దీనిపై ప్ర‌స్తుతం చ‌ర్చ‌లు మాత్ర‌మే జ‌రుగుతున్నాయ‌ని.. ఇంకా తుది నిర్ణ‌యం తీసుకోలేద‌ని అంటున్నారు. ఒక‌వేళ కాంగ్రెస్ చేస్తున్న పోరాటానికి మ‌ద్ద‌తు ఇస్తే.. త‌మ‌కు ఎదుర‌య్యే స‌మ‌స్య‌లు కూడా ఉన్నాయ‌ని పార్టీ నాయ‌కులు అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల్లో చెబుతున్నారు.

ఇక‌, కేంద్ర ఎన్నిక‌ల సంఘంపై ఇప్ప‌టికే అనుమానాలు ఉన్న‌.. కొన్ని పార్టీలు కూడా కాంగ్రెస్‌కు సపోర్టుగా నిలిచాయి. మ‌రీ ముఖ్యంగా త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్ , ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ రాహుల్‌కు ఈ విష‌యంలో దోహ‌ద‌ప‌డేందుకు రెడీ అయ్యారు. ఉద్య‌మానికి స‌హ‌క‌రిస్తామంటూ ప్ర‌క‌టించారు. వ‌చ్చే ఏడాది త‌మ త‌మ రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఆయా పార్టీలు ముందుగానే అలర్ట్ అయినట్టు తెలుస్తోంది.

ఇక‌, ఏపీ విష‌యానికి వ‌స్తే.. వైసీపీ కూడా ఇదే మాట చెబుతున్న విష‌యం తెలిసిందే. ఈవీఎంల‌లో ఏదో జ‌రిగింద‌ని.. అందుకే తాము బ‌ల‌మైన నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ఓడిపోయామ‌ని చెబుతోంది. అయితే.. దీనిపై కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి రిప్ర‌జెంటేష‌న్ ఇచ్చి సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయింది. . కానీ… ఇటీవ‌ల రాహుల్ చేసిన ప‌వ‌ర్ పాయింట్ ప్రెజెంటేష‌న్‌.. అనంత‌రం.. జ‌రుగుతున్న చ‌ర్చ‌.. వంటి వాటిని ప‌రిగ‌ణ‌నలోకి తీసుకున్న వైసీపీ.. దేశ‌వ్యాప్తంగా జ‌రిగే కాంగ్రెస్ ఉద్య‌మానికి మ‌ద్ద‌తు ఇవ్వ‌డం ద్వారా ఏపీలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను దేశం దృష్టికి తీసుకువెళ్లాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు తెలుస్తోంది. Rahul Gandhi And YS Jagan.

ఇప్పుడు ఆ పార్టీకి ప‌రోక్షంగా లేదా ప్ర‌త్య‌క్షంగా మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తే.. మోడీకి ఆగ్ర‌హం తెప్పించిన‌ట్టు అవు తుంది. . అలాని.. మౌనంగా ఉంటే.. ఏపీలో అన్యాయం జ‌రిగింద‌ని చెబుతున్న వైసీపీ గ‌ళం వినిపించ‌క‌పోతే.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి మ‌రింత.. ఇబ్బందులు త‌ప్పే ప‌రిస్థితి ఉండ‌క‌పోవ‌చ్చ‌న్న‌ది మ‌రో చ‌ర్చ‌. సో ఎలా చూసుకున్నా.. అంశాల వారీగా బీజేపీకి గ‌తంలో మ‌ద్ద‌తు ఇచ్చిన‌ట్టుగానే.. ఇప్పుడు కాంగ్రెస్‌కు మ‌ద్ద‌తు ఇస్తే.. త‌ప్పులేద‌న్న చ‌ర్చ దిశ‌గా కూడా వైసీపీ ఆలోచ‌న చేస్తోంది. ఏదేమైనా.. రాహుల్‌తో భేటీ అయ్యే విష‌యంపై జ‌గ‌న్ దృష్టి పెట్టిన‌ట్టు స‌మాచారం.

సో.. మొత్తంగా కొన్ని ప్ర‌తిపాద‌న‌ల‌తో రాహుల్ ఉద్య‌మిస్తున్నారు. ప్ర‌ధానంగా బూత్‌ల‌లో రికార్డు చేసిన సీసీ టీవీ ఫుటేజీని ధ్వంసం చేయ‌డం, ఓట‌ర్ల జాబితాను డిజిట‌ల్ రూపంలో ఇవ్వ‌క‌పోవ‌డం.. వంటి వాటిని ఆయ‌న ప్ర‌శ్నిస్తున్నారు. ఈ అంశాల‌పైనే దేశ‌వ్యాప్తంగా ఉద్య‌మించేందుకు రాహుల్ ముందుకు వ‌చ్చారు. మరోవైపు ఈ విషయంపై సీనియ‌ర్ నేత జైరాం రమేష్ స్పందించారు. ఉద్య‌మం చేయ‌డం బాగానే ఉంటుంది. కానీ, ఇది చేస్తూ.. మ‌రోవైపు ప్ర‌జ‌ల‌ను ఈవీఎంల‌కు దూరంగా ప్రేరేపించాలి. అంటే.. బ్యాలెట్ విధానంలో ఎన్నిక‌లు నిర్వ‌హిస్తే.. తాము ఓటు వేసేందుకు వ‌చ్చేది లేద‌ని ప్ర‌జ‌ల‌ను ప్రిపేర్ చేయాలి. ఇది కీల‌కం. ఈ దిశ‌గా రాహుల్ ప్ర‌య‌త్నించాలి. అప్పుటు అవ‌క‌త‌వ‌క‌ల‌కు అవ‌కాశం త‌గ్గుతుంది.“ అని జైరాం రామేష్ చెప్పుకొచ్చారు.

ఇక మరోవైపు …ఒక‌వేళ జగన్ కాంగ్రెస్ చేస్తున్న పోరాటానికి పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా మద్దతు ఇస్తే తమకు ఎదురయ్యే సమస్యలు కూడా ఉన్నాయని పార్టీ నాయకులు అంతర్గత చర్చల్లో చెబుతున్నారు. అలాని మౌనంగా ఉంటే ఏపీలో వచ్చే ఎన్నికల నాటికి మరింత ఇబ్బందులు తప్పు పరిస్థితి ఉండకపోవచ్చన్నది మరో చర్చ. ఎలా చూసుకున్న అంశాల వారిగా బీజేపీకి గతంలో మద్దతు ఇచ్చినట్టుగానే…ఇప్పుడు కాంగ్రెస్ కు మద్దతు ఇస్తే తప్పులేదన్న చర్చ దిశగా వైసీపీ ఆలోచన చేస్తోంది. సో ఏది ఏమైనా రాహుల్ తో భేటీ అయ్యే విషయంలో జగన్ ఫోకస్ పెట్టినట్టు సమాచారం.

Also Read: https://www.mega9tv.com/national/haryana-government-key-decision-is-hidden-by-religion-it-will-be-a-disaster/