కనిగిరి.. సోయగాల సిరీ..!

British Era’s Kanigiri Reservoir: నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం అంటే రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక స్థానం ఉంది. బెజవాడ గోపాల్ రెడ్డి, జక్కా వెంకయ్య,వెంకయ్య నాయుడు వంటి గొప్పవారు ఇక్కడనుండి విద్యను అభ్యసించి రాజకీయాలలో చరిత్ర సృష్టించారు. అంతేకాకుండా ఈ ప్రాంతంలో రైతులు అత్యధికంగా వ్యవసాయంపై ఆధారపడిజీవనం సాగిస్తుంటారు. అలాంటి ప్రాంతంలో ఉన్న కనిగిరి రిజర్వాయర్ పర్యాటక కేంద్రంగా అభివృద్ధికి నోచుకోవట్లేదు.

బుచ్చిరెడ్డిపాలెం గ్రామానికి ఎగువ వైపున బ్రిటిష్ వారు కాలంలో అప్పటి బ్రిటిష్ దొర సర్ ఆతర్ కాటన్ దొర అనే ఆంగ్లేయుడు 1890-98 సమయంలో రైతుల కోసం కనిగిరి రిజర్వాయర్ ను ఏర్పాటు చేశారు. సంఘం బ్యారేజీ నుండి కనిగిరి జలాశయానికి నీరు చేరుతుంది. సోమశిల ప్రాజెక్టు నిర్మాణానికి ముందు వరద నీటిని కనిగిరి మెయిన్ కెనాల్ ద్వారా కనిగిరి రిజర్వాయర్ కు తరలించి రిజర్వాయర్లో నీటిని నిల్వ చేసేవారు. అప్పట్లో దీని సామర్థ్యం నాలుగు టీఎంసీలుగా ఉండేది. కానీ కాలక్రమమైన దీనిని పట్టించుకోకపోవడంతో రెండు టీఎంసీలకు చేరింది.

కనిగిరి రిజర్వాయర్ లోని నీరు సంగం మండలం, బుచ్చిరెడ్డిపాలెం, కావలి, దగదర్తి, కొడవలూరు, విడవలూరు మీదుగా సముద్ర తీరం వరకు రైతులు లక్ష ఎకరాలకు ఈ నీటితోనే వ్యవసాయం కొనసాగిస్తున్నారు. అంటే ఇలాంటి కరపతరువు కనీసం ఇంతవరకు పూర్తిస్థాయిలో పూడికకు నోచుకోలేదు. దానికి తోడు ఈ జలాశయంలోని మత్స్య సంపద సైతం పక్కదారి పడుతుందని అపోహలు ఉన్నాయి.

ఈ రిజర్వాయర్ లో ఐలాండ్ ను తలపించేలా ఉన్నఅందమైన కురుగొండ ప్రత్యేకం. రిజర్వాయర్ లోని ఈ కురుగొండ సుమారు 20 ఎకరాల విస్తీర్ణం కలిగి ఉంటుంది.ఈ కురుగొండపై అప్పట్లో పురాతనమైన రాతి విగ్రహాలు, పురాతనమైన ఆలయం ,దట్టమైన చెట్లు ఉన్నట్లు పెద్దలు చెబుతున్నారు. అయితే ఇప్పుడు కొండపైకి వెళ్లాలంటే పడవ మార్గాన, లేకుంటే రిజర్వాయర్ లో నీరు ఇంకినప్పుడు మాత్రంవెళ్ళవచ్చు.

కనిగిరి రిజర్వాయర్ పరిసర ప్రాంతాలుకొండలు, కొబ్బరి తోటలు, అరటి తోటలతో ఎంతో ఆహ్లాదంగా పచ్చటి పొలాలతో కోనసీమను తలపెస్తుంది. గతంలో ఇక్కడ అప్పట్లో ప్రముఖ సినీ హీరోలు ఎన్టీఆర్ నటించిన యమగోల, చిరంజీవి నటించిన ఖైదీ, వీటితోపాటు పలు చిత్రాల షూటింగ్ ఇక్కడ నిర్వహించారు. ఇప్పటికీ పలు చిత్రాలు చిత్రీకరణ జరుగుతూనే ఉంది.

కనిగిరి రిజర్వాయర్ వద్ద కొండలలో కొండాలమ్మ గ్రామ దేవత గ్రామం ఏర్పడ్డ అప్పటినుండి గ్రామాన్ని కాపాడుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. భక్తులు నిత్యం అక్కడికి వచ్చి కోరిన కోర్కెలు తీర్చినందుకు పొంగళ్ళు పెట్టి తమ మొక్కలు తీర్చుకుంటుంటారు. అయితే సంతానం లేని మహిళలు , అనారోగ్యంతో బాధపడుతున్న వారు 9 వారాల వ్రతం ఆచరిస్తే తమ కోరికలు కచ్చితంగా సిద్ధిస్తాయని అపార నమ్మకం. అలా సిద్ధించినవారు తిరిగి ఆలయం వద్దకు వచ్చి వారి ముక్కులను చెల్లించుకుంటారు. British Era’s Kanigiri Reservoir.

అయితే విశేష దినాలు, ఆదివారాలలో అక్కడ అందాలు తిలకించేందుకు భక్తులు , స్వీయ చిత్రాలు దిగేందుకు యువత ఎగబడుతుంటారు. అందుచేత కనిగిరి రిజర్వాయర్ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా చేస్తే ఆ ప్రాంతమంతా ఎంతో అభివృద్ధి చెందే ఆస్కారం ఉంది. గత ప్రభుత్వంలో కూడా కనిగిరి రిజర్వాయర్ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా చేస్తామని చెప్పడంతో ఈ ప్రాంతంపై ప్రజలకు ఆశలు చిగురించాయి. కానీ ఆ దిశగా అడుగుడులు పడటం లేదు . పలుమార్లు దీనిపై నివేదికలు ఇచ్చినా అది కాగితాలకే పరిమితం అవుతున్నాయి.

Also Read: https://www.mega9tv.com/andhara-pradesh/ys-jagan-wants-meet-rahul-gandhi-regarding-evm-fake-voters-scam/