
Modi’s first lady bodyguard: దేశాన్ని నడిపించే అత్యున్నత హోదాలో ఉన్న వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ. ఆయన ఒక్క అడుగేయాలంటే అంతకంటే ముందు ఓ అరడజను మంది అడుగులు కదలాలి. ప్రధాని బయలుదేరిన దగ్గరి నుంచి గమ్యస్థానానికి చేరే వరకు ఒళ్లంతా కళ్లు చేసుకోవాలి. ప్రతి ఒక్కరి కదలికను కనిపెట్టాలి. అడుగడుగునా ఆంక్షలు..ముందస్తు ప్రణాళికలు..ఇలా స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ మొత్తం పక్కా ప్లాన్ తో అడుగేయాల్సి ఉంటుంది. ఆయన్ని అనుక్షణం కంటికిరెప్పలా కాపాడుతుంది. ప్రధాని పర్యటన ముగిసిన తర్వాతనే భద్రతా దళాలు ఊపిరిపీల్చుకుంటాయి. అందుకే ప్రధాని పర్యటన అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. అయితే ఇటీవల బ్రిటన్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఫోటో వైరల్ అయ్యింది. ప్రధాన వెనుక నిలబడి ఉన్న మహిళ ఎవరనేది హాట్ టాపిక్ అయ్యింది. ఆమె ప్రధాని మోదీ ఫస్ట్ విమెన్ బాడీగార్డ్. పేరు అదాసో కపేసా. ఇప్పుడు ఈమె గురించే సోషల్ మీడియాలో తెగ చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఈమె బ్యాక్ గ్రౌండ్ ఏంటీ? ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా మోదీ సెక్యూరిటీ టీమ్ లో చేరిందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇన్‌స్పెక్టర్ అదాసో కపేసా..ఈమె ప్రధాని ఫస్ట్ లేడీ బాడీగార్డ్. మణిపుర్ సేనాపతి జిల్లాలోని కైబీ గ్రామం ఈమె స్వస్థలం. ప్రస్తుతం అదాసో కేసా హైయెస్ట్ లెవెల్ సెక్యూరిటీ ఫోర్స్ అయిన స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ లో ఎలైట్ కమాండో . ఈ టీమ్ ప్రధాని, ఆయన కుటుంబసభ్యులకు హై సెక్యూరిటీని అందిస్తుంది.ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారిణి అయిన ఆమె SPGలో డిప్యుటేషన్‌పై విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ టీమ్ లోకి ఎంటర్ అవ్వడం అంత ఆషామాషీ విషయం కాదు. అందుకు చాలా క్వాలిటీస్ అవసరం. కఠినమైన శిక్షణ, సామర్థ్యం ఉన్నవారికి మాత్రమే SPGలో చోటు లభిస్తుంది. ఇవన్నీ అదాసో కపేసాలో పుష్కలంగా ఉన్నాయి కాబట్టే ఆమె SPG లో భాగం అయ్యారు. ఇండియన్ సెక్యూరిటీ సిస్టమ్ లో ఈమె ఎంపిక మహిళల పాత్రకు పెరుగుతున్న ప్రాముఖ్యతకు నిదర్శనంగా నిలుస్తుందని అనడంలో ఎలాంటి సందేహం లేదు. SPGలో పనిచేస్తున్న ఫస్ట్ విమెన్ గా అదాసో కపేసా హిస్టరీ క్రియేట్ చేశారు. అంతేకాదు మణిపూర్ నుంచి ప్రధాని మోదీ సెక్యూరిటీ టీమ్ లో ఉన్న తొలి మహిళగా ఆమె రికార్డ్ సృష్టించారు.
హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్స్ సశస్త్ర సీమా బల్ లో కపేసా ప్రయాణం మొదలైంది. ప్రెజెంట్ ఆమె ఉత్తరాఖండ్‌లోని పిథోరగఢ్‌లో ఉన్న 55వ బెటాలియన్‌లో పని చేస్తున్నారు. యుద్ధ మెలకువల్లో నైపుణ్యత. వ్యూహాత్మక నిఘా,హై సెక్యూరిటీ ప్రొటోకాల్స్ ను ఎలా నిర్వహించాలి, ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో ఎలా స్పందించాలి వంటి అంశాల్లో కపేసాకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. అందకే ఆమెను ఏరికోరి మరీ SPGలోకి తీసుకున్నారు. ప్రధానమంత్రి భద్రతా బృందంలో కపేసా నియామకం పర్సనల్ విక్టరీ కంటే ఎక్కువనే చెప్పాలి. ఇండియన్ డిఫెన్స్, పారామిలిటరీ సర్వీసుల్లో జెండర్ ఈక్వాలిటీకి ఇది నిదర్శనంగా గా నిలుస్తోంది. Modi’s first lady bodyguard.
ప్రపంచంలోనే మోస్ట్ పవర్ ఫుల్ సెక్యూరిటీ ఫోర్స్ గా పేరుపొందిన SPG టీమ్ లో కపేసా ఎంట్రీ వ్యూహాత్మకం, చరిత్రాత్మకంగానూ భావిస్తున్నారు.మరీ ముఖ్యంగా భద్రతా బలగాల్లో స్త్రీ, పురుషుడు అనే భేదం లేదని నిరూపించే ప్రయత్నం చేశారు. 1985లో ఎస్‌పీజీ ఏర్పాటైంది. అప్పటి నుంచి ఒక్క మహిళా అధికారి కూడా ఈ టీమ్ లో చోటు సంపాదించుకోలేదు. అలాంటిది కపేసా SPGలో విధులు నిర్వర్తించే తొలి అధికారిగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ప్రధాని బ్రిటన్ టూర్ లో కపేసా ఆన్ డ్యూటీలో ఉండటంతో ఆమెపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిసింది. ఆమె సరికొత్త ఘనత సాధించారని, శక్తికి ప్రతిరూపంగా, ఎంతో మందికి రోల్ మోడల్ అని నెటిజన్లు కీర్తిస్తున్నారు. సంకల్పం, క్రమశిక్షణ, నైపుణ్యం ఉంటే ఏ రంగంలో అయిన రాణించవచ్చు అనడానికి అదాసో కపేసా బెస్ట్ ఎగ్జాంపుల్ అంటూ అభివర్ణిస్తున్నారు. మణిపూర్ మహిళలు ఆమెను చూసి మురిసిపోతున్నారు.