పాన్ ఇండియా స్టార్ తో హరీష్‌ శంకర్ మూవీ..?

Vijay Devarakonda And Harish Shankar Movie: హరీష్ శంకర్ అనగానే ఠక్కున గబ్బర్ సింగ్ మూవీ గుర్తొస్తుంటుంది. ఆ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ ను అభిమానులు ఎలా చూడాలి అనుకున్నారో అలా చూపించడంతో బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అయ్యింది. దీంతో మరోసారి పవన్, హరీష్ శంకర్ కలిసి సినిమా చేస్తే చూడాలి అనుకున్నారు అభిమానులు. ఇప్పుడు ఫ్యాన్స్ కోరుకున్నట్టుగానే ఈ క్రేజీ కాంబోలో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రూపొందుతుండడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇదిలా ఉంటే.. హరీష్ శంకర్ నెక్ట్స్ మూవీ గురించి ఓ న్యూస్ ప్రచారంలోకి వచ్చింది. ఇంతకీ.. ఉస్తాద్ వచ్చేది ఎప్పుడు..? హరీష్ శంకర్ నెక్ట్స్ మూవీ ఎవరితో…?

షాక్ మూవీతో డైరెక్టర్ గా పరిచయమై.. మిరపకాయ్ మూవీతో సక్సెస్ సాధించి.. గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ సాధించాడు డైరెక్టర్ హరీష్ శంకర్. ఆతర్వాత రామయ్య వస్తావయ్యా, సుబ్రమణ్యం ఫర్ సేల్, దువ్వాడ జగన్నాథమ్, గద్దలకొండ గణేష్‌, మిస్టర్ బచ్చన్ చిత్రాలు తెరకెక్కించాడు. అయితే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ తో ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా స్టార్ట్ చేసి రెండు షెడ్యూల్స్ అయిన తర్వాత ఆగిపోయింది. దీంతో ఈ ప్రాజెక్ట్ ఉందా..? లేదా..? అనేది సస్పెన్స్ గా ఉండేది. ఆఖరికి పవన్ కళ్యాణ్‌ ఈ మూవీ షూటింగ్ లో జాయిన్ అవ్వడంతో ఫ్యాన్స్ ఈగర్ గా ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ ను పవర్ స్టార్ కంప్లీట్ చేశారు. పవన్ లేకుండా తీయాల్సిన సీన్స్ కొన్ని బ్యాలెన్స్ ఉన్నాయి. త్వరలోనే షూటింగ్ కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ సినిమా రూపొందుతోంది. దీనికి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని.. కుదరకపోతే సమ్మర్ లో రిలీజ్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ డేట్ పై మేకర్స్ క్లారిటీ ఇవ్వనున్నారని సమాచారం. Vijay Devarakonda And Harish Shankar Movie.

ఇక అసలు విషయానికి వస్తే.. హరీష్ శంకర్ నెక్ట్స్ మూవీ ఎవరితో అంటే ఆమధ్య రామ్ పేరు వినిపించింది. ఆతర్వాత బాలయ్య పేరు వినిపించింది. అయితే.. ఈ ఇద్దరితో కాకుండా పాన్ ఇండియా స్టార్ తో హరీష్ శంకర్ సినిమా చేయబోతున్నాడని తెలిసింది. ఈ సినిమాని సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తారని సమాచారం. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని టాక్ వినిపిస్తోంది. ఈ వార్త లీకైనప్పటి నుంచి ఆ పాన్ ఇండియా స్టార్ ఎవరు అనేది హాట్ టాపిక్ అయ్యింది. విజయ్ దేవరకొండతో అంటూ ప్రచారం జరుగుతుంది. మరి.. త్వరరో క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

Also Read: https://www.mega9tv.com/cinema/super-star-mahesh-babu-birthday-special-fans-celebrated-maheshs-birthday-in-a-grand-manner/