
Avoid searching 4 things on google:నేటి ఆధునిక ప్రపంచంలో, ఇంటర్నెట్ అనేది ఒక నిత్యవసరంగా మారిపోయింది. ఒక పూట తిండి లేకపోయినా పర్వాలేదు గాని.. ఇంటర్నెట్ లేకపోతే కష్టమే అనేంత పరిస్థితికి చేరింది. రోజువారి అవసరాలు కూడా అలాగే ఉన్నాయి మరి. ఇంటర్నెట్ ద్వారా మనం అనేక యాప్స్ ను యాక్సెస్ చేయవచ్చు. వీటితో ముఖ్యంగా వాడేది గూగుల్ . మనకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారంటే.. అది గూగుల్ సెర్చ్ ఇంజిన్. ఇంటర్నెట్ తో పాటు.. గూగుల్ ఉంటే చాలు ప్రపంచమంతా మన అరచేతిలో ఉన్నట్లే లెక్క. కానీ ఇవి సెర్చ్ చేస్తే మీరు జైలుకు పోవడం ఖాయం. ఇంతకీ గూగుల్ లో ఎలాంటి సెర్చ్ చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
గూగుల్ అనేది కేవలం ఎంటర్టేయిన్మెంట్ కోసమో కాదు.. జనరల్ నాలెడ్జ్ పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. Googleలో సెర్చ్ చేస్తూ గంటల తరబడి సమయం గడుపుతుంటారు. ఐతే జనరల్ నాలెజ్డ్ పెంచుకోవాలని అనుకునే వారు, పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులు, నిరుద్యోగుల కోసం కూడా గూగుల్ ఉపయోగపడుతుంది. గూగుల్ వాడే వారు కచ్చితంగా ఈ విషయాలను తెలుసుకోవాలి.
ఇంటర్నెట్ మానవుల జీవితంలోకి ప్రవేశించినప్పటి నుంచి అంతా మారిపోయింది. ఎలాంటి అర్థం కాని సమాచారం కనిపించినా.. జస్ట్ గూగుల్ చేస్తే ఫుల్ ఇన్ ఫర్ మేషన్ ఇచ్చేస్తుంది. అయితే, గూగుల్‌లో సెర్చ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. లేదంటే కచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుంది. అలా కాదని మీరు సెర్చ్ చేస్తే, మీ ఐపీ అడ్రస్‌ను ట్రాక్ చేస్తారు. అలాగే, నిఘా సంస్థలు, పోలీసులు డైరెక్ట్‌గా మీ ఇంటికి చేరుకుంటారు. దీంతో ఏకంగా జైలుకు కూడా వెళ్లాల్సి రావొచ్చు. అయితే, గూగుల్‌లో ఎలాంటివి సెర్చ చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
- బాంబులు లేదా ఆయుధాలను తయారు చేసే పద్ధతి గురించి మీరు Googleలో ఎప్పుడూ సెర్చ్ చేయకూడదు. దేశంలోని నిఘా సంస్థలు ఇటువంటి కదలికలపై నిరంతరం నిఘా ఉంచుతాయి. బాంబులు తయారు చేసే పద్ధతి లేదా పేలుడు పదార్థాలను తయారు చేసే పద్ధతి గురించి సెర్చ్ చేస్తే, అనుమానాస్పద కార్యకలాపాలుగా పరిగణనలోకి తీసుకుంటారు. దీంతో మీపై యాక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంది. ఇటువంటి సందర్భంలో, పోలీసులు మిమ్మల్ని ప్రశ్నించడంతోపాటు అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. ఏదైనా అనుమానాస్పద కేసులో మీ ప్రమేయం ఉన్నట్లు తేలితే అరెస్టు కూడా చేయవచ్చు.
- ఇక రెండో విషయానికి వస్తే ప్రస్తుతం OTT లేదా థియేటర్‌లకు వెళ్లే బదులు, ప్రజలు Googleలో ఉచిత సినిమాల కోసం వెతుకుతున్నారు. ఇక్కడ సినిమా పైరేటెడ్ వెర్షన్‌ను చూడొచ్చు. కానీ అలా చేయడం చట్ట ప్రకారం నేరం. మీరు Googleలో పైరేటెడ్ సినిమాను డౌన్‌లోడ్ చేసుకుంటే లేదా సెర్చ్ చేస్తే, మీకు జరిమానా లేదా జైలు శిక్ష కూడా పడే ఛాన్స్ ఉంటుంది. భారతదేశంలో కాపీరైట్ చట్టం ప్రకారం పైరసీ నేరం కిందకు వస్తుంది.
- ఇక మూడో విషయం గూగుల్‌లో డివైస్‌ని ఎలా హ్యాక్ చేయాలి, పాస్ వర్డ్‌ని ఎలా హ్యాక్ చేయాలి లేదా హ్యాకింగ్ టూల్స్ డౌన్‌లోడ్ ఎలా చేసుకోవాలి అని సెర్చ్ చేయకూడదు. సైబర్ క్రైమ్ యూనిట్‌లో ఉన్న వ్యక్తుల దృష్టికి ఈ విషయం చేరితే, హ్యాకింగ్ చట్ట ప్రకారం నేరం, కాబట్టి అనుమానాస్పద కార్యకలాపాలుగా తేల్చి పోలీసులు మిమ్మల్ని ప్రశ్నించడానికి వచ్చేస్తారు. హ్యాకింగ్ చేసి ఉంటే మిమ్మల్ని అరెస్టు కూడా చేస్తారు.
లాస్ట్ గా Google లో పిల్లల అశ్లీల కంటెంట్ కోసం సెర్చ్ చేస్తే నేరం చేస్తున్నట్లే. ఇలా చేయడం నేరంగా పరిగణిస్తున్నారు. మీపై కఠిన చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంటుంది. POCSO అంటే లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం కింద మీపై కేసు నమోదు చేయవచ్చు. ఈ క్రమంలో లాంగ్ పిరేడ్ జైలు శిక్ష, జరిమానా విధించే ఛాన్స్ ఉంది. Avoid searching 4 things on google.
సో ఇదండీ…ఒక్కసారి ఆలోచించి, చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవడం మంచిది. కాసేపటి సరదా కోసం జీవితాంతం బాధపడే పరిస్థితి తెచ్చుకోకండి.