
The 7 deaths ఎన్ఏ ఫిల్మ్స్ వరల్డ్ బ్యానర్‌పై రూపొందుతున్న చిత్రం ‘ది 7 డెత్స్’. అజయ్ కుమార్ దర్శకుడిగా పరిచయం కాబోతున్న ఈ చిత్రాన్ని ఎన్ శర్మ, లవ్ శర్మ నిర్మిస్తున్నారు. కన్నడ, తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా నీతాశర్మ దక్షిణాది సినీ పరిశ్రమకు పరిచయం కాబోతోంది. ఓ యువతి అనుకోని పరిస్థితుల్లో సైకో కిల్లర్‌గా మారితే ఎలా ఉంటుందో ఈ చిత్రంలో చూపించబోతున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం నుంచి ఇటీవల టీజర్ విడుదలైంది. టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోందని, సినిమాను ఈ ఏడాదిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని చిత్ర యూనిట్ చెబుతోంది. చిత్రీకరణ మొత్తం పూర్తి అయిందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని టీమ్ తెలిపింది. The 7 deaths