నాని, ఎన్టీఆర్ వద్దంటే కార్తీ ఓకే అన్నాడా..?

Hero Karthi Telugu Movie: నేచురల్ స్టార్ నాని నటించిన హాయ్ నాన్న మంచి విజయం సాధించింది. ఈ సినిమాతో శౌర్యువ్ డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు. క్లాస్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన హాయ్ నాన్న విమర్శకుల ప్రశంసలు అందుకుంది. నానికి మంచి విజయాన్ని అందించింది. అయితే.. హాయ్ నాన్న తర్వాత నాని సరిపోదా శనివారం అనే సినిమా చేశాడు కానీ.. డైరెక్టర్ శౌర్యువ్ మాత్రం ఇంత వరకు కొత్త సినిమాని ప్రకటించలేదు. ఇంత వరకు ఎవరెవరికి కథ చెప్పాడు..? నాని, ఎన్టీఆర్ ఎందుకు నో చెప్పారు..? కార్తీ అయినా ఓకే చెప్పేనా..?

హాయ్ నాన్న సినిమా తర్వాత శౌర్యువ్ రామ్ చరణ్ కోసం కథ రాస్తున్నాడని.. కథ చెప్పడం కూడా జరిగిందని ప్రచారం జరిగింది. నిజమే కాదా అంటే.. అది నిజమే కానీ.. ఆ ప్రాజెక్ట్ సెట్ కాలేదని తెలిసింది. ఆతర్వాత ఎన్టీఆర్ కోసం శౌర్యువ్ స్టోరీ రాయడం.. నెరేట్ చేయడం జరిగింది కానీ.. అక్కడ కూడా వర్కవుట్ కాలేదట. ఆతర్వాత తనకు డైరెక్టర్ గా అవకాశం ఇచ్చిన నానితోనే సినిమా చేయాలి అనుకున్నాడు. నానికి చెబితే కథ రెడీ చేయ్ చేద్దామని చెప్పాడట. నానిని హాయ్ నాన్నలో క్లాస్ గా చూపించాడు.. ఈసారి మాస్ గా చూపించే ప్రయత్నం చేస్తూ కథ రాసాడట.

నానికి కథ చెబితే చేస్తానన్నాడట. అయితే.. నాని ప్రస్తుతం ప్యారడైజ్ మూవీ చేస్తున్నాడు. దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తోన్న ఈ సినిమా మార్చి 26న రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ సినిమా తర్వాత ఓజీ డైరెక్టర్ సుజిత్ తో సినిమా చేయాలి. ఆతర్వాత శేఖర్ కమ్ములతో మూవీ చేయాలి. ఇవి కాకుండా ఒకటి రెండు ప్రాజెక్టులు డిస్కస్స్ లో ఉన్నాయి. ఇవన్నీ కంప్లీట్ అవ్వడానికి టైమ్ పడుతుంది. అందుచేత శౌర్యువ్ తో నాని సినిమా ఇప్పట్లో సెట్ అవ్వడం కుదరదు. అందుకనే ఈ గ్యాప్ లో మరో సినిమా చేసి రమ్మన్నాడట. Hero Karthi Telugu Movie.

అందుకనే శౌర్యువ్ కనిపించిన ప్రతి హీరోకి కథ చెబుతున్నాడని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. కోలీవుడ్ హీరో కార్తీకి కథ చెప్పాడట. కార్తీ కూడా తెలుగులో సినిమా చేయాలి అనుకుంటున్నాడట. ఊపిరి తర్వాత తెలుగులో స్ట్రైయిట్ గా మూవీ చేయలేదు. మంచి కథ కుదిరితే సినిమా చేయడానికి కార్తీ రెడీగా ఉన్నాడు. అయితే.. కథ సెట్ అవ్వాలి. పైగా ఈమధ్య తమిళ హీరోలు తెలుగు దర్శకులు, తెలుగు నిర్మాతలతో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పుడు శౌర్యువ్ చెప్పిన స్టోరీ నచ్చడంతో ఈ కాంబో మూవీ సెట్ అవుతుందని టాక్ వినిపిస్తుంది. కార్తీ ఇంకా ఏ నిర్ణయం చెప్పలేదట. మరి.. కార్తీ ఎస్ అంటాడో నో అంటాడో చూడాలి.

Also Read: https://www.mega9tv.com/cinema/prabhas-and-sandeep-reddy-combo-movie-spirit-will-he-say-such-dialogues-with-prabhas/