శివాజీ మహారాజ్ స్ఫూర్తి కేంద్రం!

Shivaji Maharaj Spoorthy Kendram: శ్రీశైలం, ఒక ప్రసిద్ధ శైవ క్షేత్రం, ఆధ్యాత్మిక కేంద్రంగా పేరుగాంచింది. ఇక్కడి ప్రత్యేకతలను అన్వేషించేందుకు సందర్శకులకు ఎన్నో ఆహ్వానాలు ఉన్నాయి. ఆ ప్రత్యేకతల్లో ఒకటి శివాజీ మహారాజ్ స్ఫూర్తి కేంద్రం. భారత వీరత్వానికి ప్రతీకగా నిలిచిన యోధుడు…మొఘల్ సామ్రాజ్యానికి పతనాన్ని శాసించి మరాఠా సామ్రాజ్యపు వెలుగుల్ని విస్తరింప చేసిన వీరుడు ఆయనే చత్రపతి శివాజీ.. చత్రపతి శివాజీ పాలన ఆయన చేసిన యుద్దాలు వంటి విషయాలు తెలుసుకోవాలని ఉందా.?

స్వరాజ్య కాంక్షను రగిలించి చరిత్ర పుటల్లో సువర్ణాధ్యాయంగా నిలిచిన మరాఠా యోధుడు. ఈ పేరు వింటే హిందూ మతం పులకించిపోతుంది. మొఘలుల దాడుల నుంచి హిందూమతాన్ని రక్షించిన ఘనత ఆ మరాఠా యోధుడికే దక్కుతుంది. భారతదేశంపై దండెత్తిన మొఘలు రాజులతో యుద్ధంలో ఓడిపోయి అందరూ చేతులెత్తేశారు. ఈ ఓటమితో మన దేశంలో హిందూ దేశం అంతరించిపోతుందని అంతా అనుకున్నారు. అయితే అప్పుడే కటిక చీకటి నుండి నిప్పుకణికలా ఛత్రపతి శివాజీ మహారాజ్ దూసుకొచ్చాడు. మొఘల్ రాజులతో వీరోచితంగా పోరాడి ఆ దాడిని సమర్థవంతగా ఎదుర్కొన్నాడు. గెరిల్లా యుద్ధాన్ని తొలిసారిగా ప్రపంచానికి పరిచయం చేశాడు. 17వ ఏటలోనే యుద్ధ భూమిలోకి అడుగు పెట్టి మరాఠా సామ్రాజ్యానికి నాంది పలికాడు. అంతటి వీరుడు మగధీరుడు చత్రపతి శివాజీ మహారాజ్ చరిత్రకు సంబంధించిన ఎన్నో లోతైన విషయాలను తెలుసుకోవాలంటే శ్రీశైలంలో ఉన్న శివాజీ స్ఫూర్తి కేంద్రంలో చరిత్ర.. ఇక్కడున్న కళా నైపుణ్యం కళ్ళకు కట్టినట్టుగా ఈ స్ఫూర్తి కేంద్రం పర్యాటకులను ఆశ్చర్యపరుస్తుంది.

శ్రీశైలం మహా క్షేత్రంలో శ్రీ శివాజీ స్ఫూర్తి కేంద్రం చాలా అద్భుతంగా నిర్మించారు. కేంద్రంలో అడుగు పెట్టగానే శివాజీ మహారాజ్ 12 అడుగుల ఎత్తైన కాంస్య విగ్రహం దర్శనమిస్తుంది. ఈ విగ్రహం ముందుగా, శివాజీ మహారాజ్ రాజ్యంలో జరిగే సభల మాదిరిగానే కోటలో ఒక సభ మండపం ఏర్పాటు చేశారు. శివాజీ పక్కన ఆయన తల్లి, తమ్ముడు, సేనాధిపతుల విగ్రహాలు కూడా ఉంటాయి. శివాజీ కోట పక్కన ధ్యాన మందిరం ప్రత్యేక ఆకర్షణ. శివాజీ మహారాజ్ భక్తి, ధ్యానానికి మెచ్చి భ్రమరాంబ దేవి అందజేసిన ఖడ్గం కూడా ఈ మందిరంలో ఉంచబడింది. ధ్యాన మందిరం ముందు భాగంలో శివాజీ ధ్యానం చేస్తున్న దృశ్యం, వెనుక పార్వతీ దేవి విగ్రహం చూపుతూ కనుల పండుగలా ఉంటుంది.

1677లో దక్షిణ భారత యాత్రలో భాగంగా శ్రీశైలానికి విచ్చేసిన చత్రపతి శివాజీ మహారాజ్ ఇక్కడ ధ్యానం చేశారు. ఈ సంఘటన స్మారకార్థం 1975లో శివాజీ మెమోరియల్ కమిటీ స్థాపించబడింది. కేంద్ర నిర్మాణం 1983లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి వసంత్ దాదా పాటిల్ ఆధ్వర్యంలో ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ నుండి 99 ఏళ్ల లీజు పద్దతిలో 10,233 చదరపు గజాల భూమి కేటాయించబడింది. ఈ కేంద్రంలో 12 అడుగుల శివాజీ మహారాజ్ విగ్రహం, ధ్యాన మందిరం, సమర్థ సభా మండపం అనే సమావేశ హాలును నిర్మించారు.

శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని పెద్ద పెద్ద స్తంభాలతో చాలా అద్భుతంగా కట్టడాలతో నిర్మించారు. క్రీస్తుపూర్వంలో రాజుల ఇండ్లు ఎలా ఉండేవో ఆ విధంగా పెద్ద పెద్ద కట్టడాలు కట్టబడ్డాయి. శివాజీ కోటను చూడగానే మనసులో ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది. కోట లోపల శివాజీ తన చిన్నతనం నుంచి చేసిన యుద్ధ సన్నివేశాలు వారితల్లి చేసిన మహా పూజ కార్యక్రమాలు అద్భుతమైన చిత్రాలు ఉన్నాయి. శివాజీ మహారాజు యుద్ధ సన్నివేశంలో వాడినటువంటి కత్తులు, గుర్రాలు అదేవిధంగా వారి యొక్క సైన్యం ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అద్భుతంగా ఆ రోజుల్లో యుద్ధసన్నివేశాలు కళ్ళకు కట్టినట్టుగా మన కళ్లెదురుగానే యుద్ధం జరుగుతుంది అన్నట్టుగా చిత్రాలు చిత్రీకరించబడ్డాయి.

1677 లో అప్పటి గోల్కొండ సుల్తాన్ అబుల్ హాసన్ కుతుబ్ షాకు ఛత్రపతి శివాజీకి మధ్య చక్కని సంబంధాలు ఉండేవి. ఈనేపథ్యంలో ఆయన శ్రీశైలం దర్శించడానికి అక్కడికి వచ్చారు. ఈ క్రమంలో గోల్కొండ మంత్రులైన అక్కన్న, మాదన్నలు శివాజీకి ఆహ్వానం పలకగా ఆ యాత్ర పూర్తయ్యే వరకు అయన అక్కడే ఉన్నారు. అయితే శ్రీశైలంలో భ్రమరాంబ ఆలయంలో శివాజీ తనను తాను దేవికి అర్పించాలనుకున్నారు.

అయితే దేవి వద్దని వారించి ఓ ఖడ్గాన్ని బహుమతిగా ఇచ్చారు. నువ్వు ఎంతమంది రాజులను అలవోకగా గెలుస్తావని చెప్పిందట. ఈ వరం వల్లనే శివాజీ ఎంతో మంది రాజులను ఓడించేవారని అప్పట్లో చెప్పుకునే వారు. ఆ దేవి శివాజీకి ఇచ్చే ఖడ్గం తాలూకు విగ్రహాలు మనం గుడిలో చూడొచ్చు. ఆ తరువాత తన సొంత ఖర్చు తో అప్పట్లో ఆలయాన్ని అభివృద్ధి చేశారు. భక్తుల కు సకల సౌకర్యాలు అందేలా చేశారు. కృష్ణ నది ఒడ్డున స్నానపు ఘాట్ లు నిర్మించారు. ఆలయానికి ఉత్తర గోపురాలు నిర్మించారు. ఆలయాన్ని పరిరక్షించేందుకు గానూ సొంత సైనికులు కొందరిని ఆయన శ్రీశైలంలోనే వదిలి వెళ్లేవారు. Shivaji Maharaj Spoorthy Kendram.

ఈ కేంద్రం చుట్టుపక్కల గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం వైద్య శిబిరాలు, విద్యా కార్యక్రమాలు, అన్నదాన సేవలు నిర్వహిస్తోంది. ఇది జాతి, మత స్ఫూర్తికి దోహదపడుతూ, శివాజీ మహారాజ్ ధైర్య స్ఫూర్తిని స్మరించుకునే ప్రాముఖ్యమైన కేంద్రంగా నిలిచింది.

Also Read: https://www.mega9tv.com/andhara-pradesh/a-tense-atmosphere-prevails-in-the-kadapa-zptc-by-elections/