
Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్.. వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకుంది. విజయవంతమైన చిత్రాల్లో నటించింది. అయితే.. ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం రావడం లేదు. అనుపమ బాగా నటిస్తుంది.. చూడడానికి బాగుంటుంది.. మరి ఎందుకు ఎక్కువుగా సినిమాలు చేయడం లేదు అనే డౌట్ జనాల్లో ఉంది. అయితే.. తను కూడా ఈ విషయం గురించి బాధపడుతుందేమో మరి అసలు విషయం బయటపెట్టింది. తన మనసులో మాటలను ఉన్నది ఉన్నట్టుగా చెప్పేసింది. ఇంతకీ.. అనుపమ ఏం చెప్పింది..?
అ ఆ, ప్రేమమ్, శతమానం భవతి, రాక్షసుడు, ఉన్నది ఒక్కటే జిందగీ.. ఇలా సక్సెస్ ఫుల్ మూవీస్ లో నటించింది. అయితే.. రావాల్సిన క్రేజ్.. చేయాల్సిన పాత్రలు మాత్రం అనుపమకు రాలేదు అనేది వాస్తవం. ఇదే ఫీలింగ్ అనుపమలో కూడా ఉన్నట్టుంది. బయటపెట్టేసింది.. అంతే కాకుండా ఇండస్ట్రీలో కొన్ని అర్ధం కావు.. వాటిని కూడా చెప్పేసింది. ఇంతకీ.. మేటర్ ఏంటంటే.. అనుపమ నటించిన లేటెస్ట్ మూవ పరదా. ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాలి కానీ.. చాలా సార్లు వాయిదా పడింది. ఇప్పుడు ఆగష్టు 22న రిలీజ్ కి రెడీ అయ్యింది. ఈ మూవీ ప్రమోషన్స్ లో ఓపెన్ అయ్యింది.
ఇంతకీ అనుపమ ఏం చెప్పిందంటే.. చేతిలో హిట్స్ లేకపోయినా కొంత మందికి ఛాన్సులొస్తున్నాయని, అదే తనకు అర్థం కావడం లేదని అంటోంది. కొంత మంది హీరోయిన్లకు అవకాశాలు ఎలా వస్తాయో నాకు ఇప్పటికీ అర్థం కాదు. హీరోయిన్లకు మార్కెట్ వాల్యూ ఎలా ఆపాదిస్తారో తెలియదు. కొందరు హీరోయిన్లకు హిట్లు వస్తాయి.. కానీ అవకాశాలు రావు. మరికొందరు హీరోయిన్లకు అస్సలు హిట్స్ ఉండవు, కానీ వరుసగా అవకాశాలు వస్తుంటాయి. అదే నాకు అర్థం కావడం లేదు అంటూ తన ఆవేదనను వ్యక్తం చేసింది. Anupama Parameswaran.
పరదా ప్రమోషన్స్ కోసం విజయవాడ వెళ్లింది. అక్కడ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. ఎప్పటి నుంచో రిలీజ్ చేయాలని ట్రై చేస్తున్నాం కానీ.. ముందుకు వెళ్లడం లేదు అంటూ బోరున ఏడ్చేసింది. తర్వాత మాట్లాడే ప్రయత్నం చేసి మళ్లీ ఏడ్చేసింది. ఇదిలా ఉంటే.. అనుపమ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఏ హీరోయిన్ ని దృష్టిలో పెట్టుకుని ఈ కామెంట్స్ చేసిందనే విషయమై చర్చ మొదలైంది. మరి.. అనుపమ ఈ విషయం గురించి మరింత క్లారిటీ ఇస్తుందా..? లేక ఈ కామెంట్స్ గురించి ఇంకేమి మాట్లాడను అంటుందో.. తను ఆశించిన ఆఫర్స్ ఇక నుంచైనా వస్తాయేమో చూడాలి.
Also Read: https://www.mega9tv.com/cinema/why-samantha-is-missing-crazy-projects-what-is-the-real-reason/