
Fans complaining about Nagarjuna: టాలీవుడ్ కింగ్ నాగార్జున గత నలభై సంవత్సరాలుగా ఎన్నోసంచలన చిత్రాల్లో.. సక్సెస్ ఫుల్ మూవీస్ లో నటించారు. అలాగే ప్లాప్స్ కూడా ఇచ్చారు. అయితే.. ఎన్నో ప్రయోగాల చేసి ప్రయోగాల సర్థార్ గా, ట్రెండ్ సెట్టర్ గా నిపించుకున్నారు. అయితే.. ఇప్పుడు కూలీ సినిమాలో విలన్ గా నటించారు. నలభై ఏళ్ల కెరీర్ లో ఫస్ట్ టైమ్ విలన్ గా నటించడంతో క్యారెక్టర్ ఎలా ఉంటుందో.. అనే క్యూరియాసిటీ అందరిలో ఏర్పడింది. అయితే.. ఈ మూవీ రిలీజ్ తర్వాత నాగ్ పై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఎందుకు ఫైర్ అవుతున్నారు..? అసలు ఏం జరిగింది..?
కూలీ సినిమాకి అంత క్రేజ్ రావడానికి కారణాల్లో ఒకటి నాగ్ విలన్ క్యారెక్టర్ చేయడం. ఈ పాత్ర గురించి ఓ రేంజ్ లో బిల్డప్ ఇచ్చారు. దీంతో అంచనాలు మరింతగా పెరిగాయి. అయితే.. థియేటర్ కి వెళ్లి సినిమా చూసిన జనాలకు మాత్రం నాగ్ ఎందుకు ఈ సినిమా చేసాడా..? అనే డౌట్ రాక మానదు. ఎందుకంటే.. నాగార్జున పాత్రలో ఏదో గొప్పదనం ఉంటుంది..? వేరే లెవల్లో ఉంటుంది అనుకుంటే.. ఏమీ లేదు. ఇంకా చెప్పాలంటే.. సిగరెట్ కాల్చడం.. మందు కొట్టడం తప్పా.. పెద్దగా చేసింది ఏమీ లేదు. అందుకనే.. అభిమానులు ఫైర్ అవుతున్నారట.
అసలు ఈ క్యారెక్టర్ ని ఏ ప్రకాష్ రాజ్ తోనే చేయించాలి. అలాంటిది నాగార్జున చేయడం దేనికి..? అసలు ఏముందని ఈ పాత్ర చేయడానికి నాగ్ అంగీకరించారు అని ప్రశ్నిస్తున్నారు. అభిమానులే కాదు.. మీడియా జనాలు కూడా నాగ్ ఈ పాత్ర చేయకుండా ఉండాల్సింది అంటున్నారు. నాగ్ పాత్ర హైలెట్ అవుతుంది అనుకుంటే.. మలయాళ యాక్టర్ షోబిన్ క్యారెక్టర్ హైలెట్ అయ్యింది. మంజుమల్ బాయ్స్ సినిమాలో అమాయకంగా ఉన్న క్యారెక్టర్ చేసిన షోబిన్ ఈ సినిమాలో చలరేగిపోయాడు. యాక్షన్ చేయడమే కాదు.. డ్యాన్స్ కూడా అదరగొట్టేసాడు. Fans complaining about Nagarjuna.
ఇంకా చెప్పాలంటే.. షోబిన్ కోసమే ఈ సినిమా చేసారా..? అనిపిస్తుంది. అంతలా ఆ క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఇచ్చారు లోకేష్ కనకరాజ్. ఈ సినిమా తర్వాత షోబిన్ కెరీర్ లో మరిన్ని డిపరెంట్ క్యారెక్టర్స్ రావడం ఖాయం. అయితే.. నాగార్జున కోసం కూడా వెరైటీ విలన్ రోల్స్ ఆఫర్స్ వస్తాయి కానీ.. నాగార్జున మాత్రం చేయకపోవచ్చు. కారణం ఏంటంటే.. ఇక విలన్ పాత్రలు చేయద్దు మహాప్రభో అంటూ నాగ్ ఫ్యాన్స్ తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. సో.. నాగ్ విలన్ గా నటించిన ఫస్ట్ అండ్ లాస్ట్ మూవీ కూలీయే అవుతుందేమో చూడాలి.