
Rangasthalam Part 2: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటీవ్ జీనియస్ సుకుమార్.. వీరిద్దరి కాంబోలో రూపొందిన సినిమా రంగస్థలం. ఈ సినిమా ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. ఈ మూవీ చరణ్ కెరీర్ లో మరచిపోలేని సినిమాల్లో ఒకటిగా నిలిచింది. అయితే.. వీరిద్దరూ కలిసి మరో మూవీ చేయాలి అనుకున్నారు. అఫిషియల్ గా అనౌన్స్ చేయడం కూడా జరిగింది. అయితే.. ఇంత వరకు సెట్స్ పైకి రాలేదు. ఇప్పుడు రంగస్థలం 2 చేయబోతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇంతకీ.. ఇది నిజమా..?
పుష్ప 2 తర్వాత సుకుమార్ చరణ్ తో సినిమా చేస్తానని ప్రకటించారు కానీ.. కథ మాత్రం లేదు. కొన్ని స్టోరీ లైన్స్ అనుకున్నప్పటికీ.. చాన్నాళ్లు ఫైనల్ కాలేదు. తాజా సమాచారం ప్రకారం.. రంగస్థలం 2 చేయాలని సుకుమార్ డిసైడ్ అయ్యారట. ప్రస్తుతం కథ పై కసరత్తు చేస్తున్నారని తెలిసింది. సుకుమార్ తన టీమ్ తో దుబాయ్ లో స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. దసరాకి ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసి చరణ్ కి వినిపించనున్నాడని టాక్. ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించేందుకు ప్లాన్ చేస్తుంది.
అయితే.. ప్రస్తుతం చరణ్ పెద్ది సినిమా చేస్తున్నాడు. బుచ్చిబాబు సానా డైరెక్షన్ లో రూపొందుతోన్న ఈ మూవీ చాలా ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటుంది. ఇందులో చరణ్ కు జంటగా జాన్వీ కపూర్ నటిస్తుంది. సంగీత సంచలనం ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈమధ్య రిలీజ్ చేసిన పెద్ది గ్లింప్స్ కు అనూహ్య స్పందన లభించింది. దీంతో మూవీ పై మరింత క్రేజ్ పెరగింది. యాభై శాతంకు పైగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఈ క్రేజీ పాన్ ఇండియా మూవీని మార్చి 27న రిలీజ్ చేయనున్నట్టుగా అనౌన్స్ చేశారు. Rangasthalam Part 2.
పెద్ది తర్వాత చరణ్ సినిమా ఎవరితో అంటే.. సుకుమార్ తోనే అని ప్రకటించారు. అయితే.. సుకుమార్ కథ రెడీ చేయడం ఆలస్యం అయితే.. ఈగ్యాప్ లో మరో సినిమా చేయాలి అనుకుంటున్నట్టుగా వార్తలు వచ్చాయి. బాలీవుడ్ డైరెక్టర్ నిఖిల్ తో చరణ్ మూవీ అంటూ ప్రచారం జరిగింది. కరణ్ జోహార్ ఈ మూవీని నిర్మించేందుకు రెడీగా ఉన్నాడు. అలాగే ఒకరిద్దిరి దర్శకుల కథలు కూడా చరణ్ విన్నాడని.. అయితే.. ఏ కథను కూడా ఫైనల్ చేయలేదని తెలిసింది. దీంతో పెద్ది తర్వాత సుకుమార్ తో మూవీ ఉంటుందా…? లేక మరో సినిమా చేస్తాడా..? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది. క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.
Also Read: https://www.mega9tv.com/cinema/fans-are-complaining-about-nagarjuna-do-you-know-why/