నాని, సాయిపల్లవి కాంబో ఫిక్స్ అయ్యిందా..?

Nani and Sai Pallavi Combo: నేచురల్ స్టార్ నాని ప్రతి సినిమాలో కొత్తదనం కోసం తపిస్తుంటాడు. అందుకనే వరుసగా సక్సెస్ సాధిస్తూ దూసుకెళుతున్నాడు. దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం, హిట్ 3.. ఇలా వరుసగా విజయాలు సాధించాడు. ప్రస్తుతం ప్యారడైజ్ అనే డిఫరెంట్ మూవీ చేస్తున్నాడు. దీనికి శ్రీకాంత్ ఓదెల డైరెక్టర్. ఇదిలా ఉంటే.. నాని, సాయిపల్లవి కాంబో మూవీ ఫిక్స్ అయ్యిందనే వార్త ప్రచారంలోకి వచ్చింది. ఇంతకీ.. ఈ ప్రాజెక్ట్ వెనకున్న వాస్తవం ఏంటి..?

నాని ఏమాత్రం గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నాడు. ఒక సినిమా సెట్స్ పై ఉండగానే.. ఒకటి రెండు సినిమాలు ఫైనల్ చేస్తున్నాడు. హిట్ 3 సినిమా షూటింగ్ లో ఉండగానే ప్యారడైజ్ మూవీ ఫైనల్ చేశాడు. ఇప్పుడు ప్యారడైజ్ మూవీ షూటింగ్ లో ఉండగానే మరో మూవీ ఫిక్స్ చేశాడని తెలిసింది. ఇంతకీ విషయం ఏంటంటే.. నాని ఎప్పటి నుంచో సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ములతో సినిమా చేయాలి అనుకుంటున్నాడు. ఇప్పుడు ఈ క్రేజీ కాంబో ఫిక్స్ అయ్యిందని టాక్ వినిపిస్తుంది. నానితో శేఖర్ కమ్ముల డిపరెంట్ లవ్ స్టోరీ చేయాలని ఫిక్స్ అయినట్టుగా తెలిసింది.

అయితే.. ఈ క్రేజీ మూవీలో నానికి జంటగా ఫిదా బ్యూటీ సాయిపల్లవి నటిస్తున్నట్టుగా ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. నాని, సాయిపల్లవి జంటగా ఏంసీఏ, శ్యామ్ సింగ రాయ్ సినిమాలు చేశారు. ఈ రెండు సినిమాలు సక్సెస్ సాధించాయి. ఇప్పుడు ఈ కాంబోలో హ్యాట్రిక్ మూవీకి రంగం సిద్దమౌతుందనే వార్త వైరల్ అయ్యింది. సాయిపల్లవిని ఫిదా సినిమాతో తెలుగు తెరకు శేఖర్ కమ్ములనే పరిచయం చేశారు. ఆతర్వాత శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో లవ్ స్టోరీ సినిమాలో నాగచైతన్యకు జంటగా సాయిపల్లవి నటించింది. Nani And Sai Pallavi Combo.

శేఖర్ కమ్ముల అడిగితే.. సాయిపల్లవి ఎప్పుడైనా సరే.. నటించడానికి రెడీ అంటుంది. ఎంత బిజీలో ఉన్నప్పటికీ.. నో చెప్పదు. ఈసారి కూడా ఫిదా బ్యూటీని సరికొత్తగా చూపించబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాని నిర్మించే నిర్మాత ఎవరు అనేది మాత్రం ఇంకా ఫైనల్ కాలేదు అంటున్నారు. అలాగే ఏసీయన్ ఫిల్మ్స్ బ్యానర్ లో శేఖర్ కమ్ముల మరో సినిమా చేయడానికి ఓకే చెప్పారని కూడా తెలిసింది. అయితే.. నానితో చేసే సినిమాని ఏసియన్ ఫిల్మ్స్ బ్యానర్ లో చేస్తారా..? లేక వేరే బ్యానర్ లో చేస్తారా..? అనేది తెలియాల్సివుంది.

Also Read: https://www.mega9tv.com/cinema/does-rangasthalam-part-2-is-getting-on-sets/