ఓజీ పై అదిరిపోయే అప్డేట్!

Pawan kalyan’s OG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ నటించిన హరి హర వీరమల్లు సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత పవన్ నుంచి రాబోయే మూవీ ఓజీ. సుజిత్ ఈ మూవీకి డైరెక్టర్. ఈ చిత్రం గురించి అప్ డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని పవర్ స్టార్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మేకర్స్ మాత్రం అప్ డేట్ అడిగితే.. కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు. అయితే.. ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ లీకైంది. ఇంతకీ.. లీకైన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటి..?

ఓజీ సినిమా అనగానే.. గ్యాంగ్ స్టర్ మూవీ అని.. ఇది ముంబాయి బ్యాక్ డ్రాప్ లో రూపొందే సినిమా అనే తెలుసు. అంతకు మించిన ఎలాంటి సమాచారం లీక్ కాలేదు. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. పవన్ కళ్యాణ్‌ నటించిన పంజా మూవీ ఎలా ఉంటుందో తెలిసిందే. ఆ మూవీకి వేరే వెర్షెన్ లా ఉంటుందట. సుజిత్ ఈ సినిమాని పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్ మూవీగా.. డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో డిజైన్ చేశాడట. సినిమా చూసిన ప్రేక్షకులకు థ్రిల్ కలిగించడం ఖాయమనే టాక్ బలంగా వినిపిస్తుంది. పవన్ కళ్యాణ్‌ తన షూటింగ్ వర్క్ కంప్లీట్ చేశారు. దీంతో సుజిత్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చాలా స్పీడుగా చేస్తున్నాడు.

సెప్టెంబర్ 25న ఈ మూవీని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అదే డేట్ కు బాలయ్య అఖండ 2 వస్తుంది. దీంతో ఏ సినిమా అయినా పోస్ట్ పోన్ అవుతుందేమో అనుకున్నారు. ముఖ్యంగా ఓజీ వాయిదాపడుతుందేమో అనుకున్నారు కానీ.. అలాంటిది ఏమీ లేదని తెలిసింది. త్వరలోనే ఈ మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఓ వైపు షూటింగ్ జరుగుతుండగానే మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేశారు. Pawan kalyan’s OG.

ఈ మూవీ గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే.. దీనికి పార్ట్ 2 కూడా ఉంటుందట. ఆమధ్య ఓజీ రెండు పార్టులుగా వస్తుందని వార్తలు వచ్చాయి. ఆతర్వాత దీని గురించి ఎలాంటి న్యూస్ బయటకు రాలేదు. తాజాగా వినిపిస్తున్న మాట ఏంటంటే.. ఓజీ తర్వాత సుజిత్ నానితో సినిమా చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. ఆతర్వాత ఓజీ 2 చేయాలనే ఆలోచనలో ఉన్నాడట. దీనికి సంబంధించిన కథ కూడా రెడీగా ఉందని తెలిసింది. అయితే.. పవన్ పాలిటిక్స్ లో బిజీగా ఉన్నాడు. మరో వైపు వీరమల్లు 2 చేయాలి. ఇప్పుడు ఓజీ 2 కూడా అంటే.. డౌటే అనే మాట వినిపిస్తుంది. మరి.. నిజంగా ఓజీ 2 ఉంటుందో లేక వార్తలకే పరిమితం అవుతుందో చూడాలి.

Also Read: https://www.mega9tv.com/cinema/does-nani-and-sai-pallavi-combo-fixed-with-sekhar-kammula/