
Celebrities Who Served in Army: పోరాటాలు, నిరసనలు, ప్రాణాత్యాగాలతోనే స్వాతంత్ర్యం వచ్చింది. భరతమాత తన సంకెళ్లు విదిలించుకుని స్వేచ్ఛను పొంది నేటి(ఆగస్టు 15)కి 79 ఏళ్లు. ఈ స్వాతంత్ర్య దినోత్సవంపై ఎన్నో సినిమాలు వచ్చాయి. దేశభక్తిని చాటిచెప్పే పాటలెన్నో ఉన్నాయి. అయితే ఈ రోజు మనం దేశాన్ని శత్రువుల బారి నుంచి కంటికిరెప్పలా కాపాడుతున్న ఆర్మీలో పని చేసిన సెలబ్రిటీల గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం..
80’s, 90’sలో విలన్‌గా రాణించిన కెప్టెన్ రాజు ఒకప్పుడు భారత ఆర్మీకి కెప్టెన్‌గా వ్యవహరించారు. 1971లో బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో పాల్గొన్నారు. ఐదేళ్లు సైన్యంలో ఉన్న రాజు తర్వాత ఆర్మీ ఉద్యోగాన్ని వదిలేసి సినిమాల్లోకి వచ్చారు.
బాలీవుడ్ సీనియర్ యాక్టర్ సునీల్ శెట్టి ది కూడా ఆర్మీ ఫ్యామిలీనే. అతను సైన్యంలో పని చేయలేదు, కానీ అతడి తండ్రి వీరప్ప శెట్టి లెఫ్టినెంట్ కల్నల్‌గా ఆర్మీలో సేవలందించారు.
మరో బాలీవుడ్ సీనియర్ నటుడు నానాపటేకర్ మూడేళ్లపాటు ఆర్మీలో శిక్షణ తీసుకున్నారు. 1999లో కార్గిల్ యుద్ధ సమయంలో గౌరవ కెప్టెన్‌గా వ్యవహరించారు. కొంతకాలానికే గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాను పొందారు. 2013లో ఆర్మీ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నారు.
బాలీవుడ్ తో పాటూ సౌత్ లోనూ విలన్ గా భయపెట్టిన సంజయ్ దత్ 1947లో జరిగిన ఇండో పాక్ యుద్ధంలో పాల్గొన్నాడు.
చిచోరే, జెర్సీ సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రుద్రశిష్ ముజందార్ 2011లో సైన్యంలో చేరారు. 2018లో మేజర్‌గా ఉన్నప్పుడే రిటైర్మెంట్ తీసుకున్నారు.
మహాభారతం సీరియల్లో శకునిగా నటించిన నటుడు గుఫి పైంటల్.. ఒకప్పుడు ఆర్మీలో పని చేసినవ్యక్తే.. ఆయన భారత్-చైనా సరిహద్దులో జవాన్‌గా విధులు నిర్వర్తించారు.
రామ్ గోపాల్ వర్మ సత్య సినిమాతో నటుడిగా పాపులర్ అయిన మనోజ్ బాజ్‌పాయ్ కి ఆర్మీలో పని చేయాలన్నది కల. జాతీయ డిఫెన్స్ అకాడమీ ప్రవేశ పరీక్ష రాసి పాసయ్యాడు, కానీ ఇంటర్వ్యూలో ఫెయిలయ్యాడు. నిజ జీవితంలో ఆర్మీలో చేరలేకపోయాడు కానీ 1971 సినిమాలో జవాన్‌గా నటించాడు.
Also Read: https://www.mega9tv.com/cinema/independence-day-special-upcoming-patriotic-movies/