భారత్ కు వ్యతిరేకంగా పాకిస్థాన్ రాకెట్ ఫోర్స్..!

Pakistan’s rocket force against India: భారత్ సైనిక శక్తి ముందు పాకిస్తాన్ ఓటమి భయంతో వణికిపోతోంది. ఆపరేషన్ సింధూర్. సమయంలో భారత వాయుసేన పాకిస్తాన్‌కు గట్టి దెబ్బ కొట్టడంతో, ఇస్లామాబాద్ ఒక కొత్త వ్యూహంతో ముందుకొచ్చింది. పాకిస్థాన్ రాకెట్ ఫోర్స్ పేరుతో ఓ కొత్త యూనిట్‌ ప్రారంభించాలని చూస్తోంది. ఇది పూర్తిగా భారత్‌కు వ్యతిరేకంగా, మిస్సైల్ సామర్థ్యాలను మెరుగుపరచడానికి ప్రారంభించినట్లు ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. అయితే పాకిస్థాన్ రాకెట్ ఫోర్స్ కు నిజంగా అంత సీన్ ఉందా..? ఇది భారత్ స్పీడ్ ముందు నిలవగలదా..? అసలు పాకిస్థాన్ రాకెట్ ఫోర్స్ లో ఏం ఉంటాయి..?

ఆపరేషన్ సింధూర్ .. భారత్-పాకిస్తాన్ మధ్య జరిగి సైనిక ఘర్షణలో ఒక మరో మైలురాయగా చెప్పుకోవచ్చు. ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో టీఆర్ఎఫ్ ఉగ్రవాదుల జరిపిన ఉగ్రదాడిలో 26 మంది మరణించారు. దీనికి ప్రతీకారంగా, భారత వాయుసేన ఆపరేషన్ సింధూర్ ను ప్రారంభించి, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. భారత్ బ్రహ్మోస్, అకాశ్, S-400వంటి అత్యాధునిక మిస్సైల్ వ్యవస్థలు పాకిస్తాన్ HQ-9 రక్షణ వ్యవస్థను చీల్చిచెండాడాయి. పాకిస్తాన్ పంపిన PL-15 మిస్సైళ్లు భారత రక్షణ వ్యవస్థల ముందు విఫలమయ్యాయి. ఈ నాలుగు రోజుల యుద్ధంలో భారత్ సైనిక ఆధిపత్యం స్పష్టమైంది, పాకిస్తాన్ సైన్యం బలహీనతలు బయటపడ్డాయి. ఈ ఓటమి భయంతోనే పాకిస్తాన్ ఆర్మీ రాకెట్ ఫోర్స్ ఏర్పాటు నిర్ణయం తీసుకుంది.

పాకిస్తాన్ కొత్త ఆర్మీ రాకెట్ ఫోర్స్ ఏర్పాటు, భారత్ సైనిక శక్తి ముందు వారి నిస్సహాయతను చాటుతోంది. ఈ యూనిట్‌ను షాహీన్, ఘౌరి, ఫతెహ్, బాబర్ వంటి మిస్సైళ్లను సమర్థవంతంగా నిర్వహించడానికి, ఒకే కమాండ్ కింద మెరుపు దాడులు చేయడానికి రూపొందిస్తున్నారు. కానీ, ఈ నిర్ణయం వెనుక పాకిస్తాన్ సైన్యం అసమర్థత స్పష్టంగా కనిపిస్తోంది. ఆపరేషన్ సింధూర్‌లో వారి మిస్సైళ్లు భారత్ రక్షణ వ్యవస్థల ముందు దెబ్బతిన్నాయి. ఒక పాక్ ఉన్నతాధికారి స్వయంగా ఈ ఫోర్స్ భారత్‌ కోసమే అని చెప్పడం, వారి భయాన్ని, భారత్ సైనిక ఆధిపత్యం ముందు వణుకును చూపిస్తోంది. ఈ యూనిట్ ఏర్పాటు చేసినా, భారత్ దగ్గర ఉన్న అగ్ని-V, బ్రహ్మోస్, నిర్భయ్ వంటి మిస్సైళ్ల శక్తి, సాంకేతిక ఆధునికత ముందు పాకిస్తాన్ ఎప్పటికీ వెనుకే ఉంటుందని సైనిక విశ్లేషకులు అంటున్నారు.

పాకిస్థాన్ రాకెట్ ఫోర్స్ వెనుక చైనా..?
పాకిస్తాన్ ఆర్మీ రాకెట్ ఫోర్స్, చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ రాకెట్ ఫోర్స్ ను ఆదర్శంగా తీసుకుని ఏర్పాటు చేస్తున్నట్టు భావిస్తున్నారు. చైనా J-10 యుద్ధ విమానాలు, PL-15 మిస్సైళ్లు, రియల్-టైమ్ ఇంటెలిజెన్స్, ఉపగ్రహ డేటా, HQ-19 యాంటీ-బాలిస్టిక్ మిస్సైళ్లతో పాకిస్తాన్ ఈ యూనిట్‌ను బలోపేతం చేయాలని చూస్తోంది. కానీ, ఇది పాకిస్తాన్ సొంత సామర్థ్యం కాదు. చైనా టెక్నాలజీని దీనికి ఆధారం చేసుకోవాలని చూస్తోంది. ఆపరేషన్ సింధూర్‌లో చైనా సరఫరా చేసిన HQ-9 వ్యవస్థలు భారత్ బ్రహ్మోస్ మిస్సైళ్ల ముందు నిలవలేదు. ఈ కొత్త ఫోర్స్ కూడా చైనా సహాయం లేకుండా సమర్థవంతంగా పనిచేయలేదని, భారత్ స్వదేశీ సాంకేతికత, సైనిక వ్యూహాల ముందు ఇది ఎంతమాత్రం పోటీ ఇవ్వలేదని విశ్లేషకులు చెబుతున్నారు. చైనా ద్వారా పాకిస్తాన్ భారత్‌ను ఎదిరించాలని చూస్తున్నా, భారత్ S-400, ప్రళయ్, నిర్భయ్ వంటి వ్యవస్థలు ఈ రాకెట్ ఫోర్స్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటాయని నిపుణులు నమ్ముతున్నారు.

భారత్ సైనిక శక్తి ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుస్తోంది. అగ్ని-5, బ్రహ్మోస్, S-400 రక్షణ వ్యవస్థలు, ప్రళయ్ బాలిస్టిక్ మిస్సైల్ వంటివి పాకిస్తాన్ షాహీన్-3, అబాబీల్ మిస్సైళ్ల కంటే రేంజ్, వేగం, సాంకేతికతలో ఎంతో ముందున్నాయి. ఆపరేషన్ సింధూర్‌లో భారత్ బ్రహ్మోస్ మిస్సైళ్లు పాకిస్తాన్ ఎయిర్ బేస్‌లను లక్ష్యంగా చేసుకొని నీరుగార్చాయి, అక్కడ వారి రక్షణ వ్యవస్థలు నిస్సహాయంగా నిలిచాయి. పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం, సైనిక సామర్థ్యాలలో లోపాలు, చైనాపై ఆధారపడటం వంటివి వారి బలహీనతలను మరింత స్పష్టం చేస్తున్నాయి. ఈ రాకెట్ ఫోర్స్ ఏర్పాటు చేసినా, భారత్ స్వదేశీ సాంకేతికత, అత్యాధునిక రక్షణ వ్యవస్థల ముందు ఇది ఒక బలహీన ప్రయత్నంగానే మిగులుతుందని సైనిక నిపుణులు అంటున్నారు.

పాకిస్తాన్ ఆర్మీ రాకెట్ ఫోర్స్, భారత్ సైనిక ఆధిపత్యాన్ని సవాలు చేయడానికి ఒక ప్రయత్నంగా కనిపిస్తున్నా, దీని సామర్థ్యం పరిమితమే. ఈ యూనిట్ ఫతెహ్-I, ఫతెహ్-II. ఫతెహ్-IV క్రూయిజ్ మిస్సైళ్లను సెంట్రల్ కమాండ్ కింద నిర్వహిస్తుంది. కానీ, భారత్ S-400,అకాశ్, ప్రళయ్, నిర్భయ్ వంటి వ్యవస్థలు ఈ మిస్సైళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనే సామర్థ్యం కలిగి ఉన్నాయి. పాకిస్తాన్ ఆర్థిక సమస్యలు, సైనిక శిక్షణలో లోపాలు, చైనా టెక్నాలజీపై అతిగా ఆధారపడటం వంటివి ఈ ఫోర్స్‌ను ఒక ప్రచార స్టంట్ గా మార్చే అవకాశం ఉంది. భారత్ కోల్డ్ స్టార్ట్ డాక్ట్రిన్, స్వదేశీ మిస్సైల్ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సామర్థ్యాలు ఈ రాకెట్ ఫోర్స్‌ను సవాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. అంతర్జాతీయంగా కూడా, పాకిస్తాన్ ఈ చర్య భారత్ సైనిక ఆధిపత్యాన్ని ఎదుర్కోవడానికి ఒక నిస్సహాయ ప్రయత్నంగా చూస్తున్నారు.

పాకిస్తాన్ ఆర్మీ రాకెట్ ఫోర్స్ ఏర్పాటు, భారత్‌కు కొత్త సవాళ్లను తెచ్చినప్పటికీ, మన సైనిక వ్యవస్థ సిద్ధంగా ఉంది. భారత్ ఇంటిగ్రేటెడ్ రాకెట్ ఫోర్స్ ఏర్పాటు ప్రతిపాదనలు 2023 నుంచి చర్చలో ఉన్నాయి, ఇది అగ్ని, పృథ్వీ, ప్రళయ్, బ్రహ్మోస్ వంటి మిస్సైళ్లను ఒకే కమాండ్ కిందకు తీసుకొస్తుంది. ఈ IRF, పాకిస్తాన్ రాకెట్ ఫోర్స్‌ను సమర్థవంతంగా ఎదుర్కొని, భారత్ సైనిక ఆధిపత్యాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ఇప్పటికే భారత్ S-400, అడ్వాన్స్‌డ్ ఎయిర్ డిఫెన్స్ , ప్రాజెక్ట్ కుశ వంటి రక్షణ వ్యవస్థలు పాకిస్తాన్ మిస్సైళ్లను నిర్వీర్యం చేయగలవు. అదనంగా, భారత్ సైబర్ వార్‌ఫేర్, ఉపగ్రహ ఇంటెలిజెన్స్ సామర్థ్యాలు పాకిస్తాన్ కమాండ్ నెట్‌వర్క్‌ను లక్ష్యంగా చేసుకోవచ్చు. భారత్ ప్రళయ్, నిర్భయ్ క్రూయిజ్ మిస్సైళ్లు శత్రు లక్ష్యాలను ఖచ్చితంగా ధ్వంసం చేయగలవు. ఈ రాకెట్ ఫోర్స్ ఏర్పాటు, భారత్ సైనిక వ్యూహాన్ని మరింత బలోపేతం చేయడానికి ఒక అవకాశంగా మారనుంది. Pakistan’s rocket force against India.

పాకిస్తాన్ ఆర్మీ రాకెట్ ఫోర్స్ ఏర్పాటు, భారత్ సైనిక ఆధిపత్యానికి భయపడిన చర్యగా అంతర్జాతీయ విశ్లేషకులు చూస్తున్నారు. ఈ నిర్ణయం, చైనా-పాకిస్తాన్ ఆల్-వెదర్ ఫ్రెండ్‌షిప్ ను మరింత బలోపేతం చేస్తుంది, కానీ అదే సమయంలో పాకిస్తాన్ సొంత సామర్థ్యం లేకపోవడాన్ని బయటపెడుతోంది. షెహబాజ్ షరీఫ్, ఆపరేషన్ సిందూర్ ఘర్షణను పాకిస్తాన్ విజయంగా, భారత్ గుణపాఠం అని గతంలో ప్రకటించినప్పటికీ, అంతర్జాతీయ మీడియా, సైనిక నిపుణులు దీనిని పాకిస్తాన్ ప్రచారంగా చూస్తున్నారు. భారత్, ఈ ఘర్షణలో డైరెక్టర్స్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ ద్వారా స్వతంత్రంగా శాంతి ఒప్పందం కుదుర్చుకుంది, అమెరికా జోక్యం లేదని స్పష్టం చేసింది. పాకిస్తాన్ ఈ కొత్త ఫోర్స్, దక్షిణాసియాలో ఆయుధ పోటీని పెంచినప్పటికీ, భారత్ సైనిక, దౌత్య శక్తి దీనిని సమర్థవంతంగా ఎదుర్కొంటుందని అంతర్జాతీయ సమాజం భావిస్తోంది.

Also Read: https://www.mega9tv.com/international/hunter-biden-escalates-rift-with-melania-trump-over-jeffrey-epstein-allegation/