ఆ రెండు సినిమాలను మించి వెంకీ, త్రివిక్రమ్ మ్యాజిక్ చేసేనా..?

Venky Trivikram’s movie: విక్టరీ వెంకటేష్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. వీరిద్దరి కాంబోలో మూవీ అంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈపాటికే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లాలి కానీ.. కొన్ని కారణాల వలన పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. ఇప్పుడు ఈ క్రేజీ మూవీని సినీ ప్రముఖుల సమక్షంలో ప్రారంభించారు. అయితే.. ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది ఆసక్తిగా మారింది. ముఖ్యంగా ఆ రెండు సినిమాలను మించి మ్యాజిక్ చేస్తుందా..? అనేది హాట్ టాపిక్ అయ్యింది. ఇంతకీ.. ఆ రెండు సినిమాలు ఏంటి..? త్రివిక్రమ్ ప్లాన్ ఏంటి..?

వెంకీ కామెడీ స్టైల్ ఎలా ఉంటుందో తెలిసిందే. అలాగే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కామెడీ డైలాగ్స్ గురించి తెలిసిందే. అందుచేత వీరిద్దరూ కలిసి సినిమా చేస్తే.. ఆ సినిమా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎప్పటి నుంచో ఈ కాంబో మూవీ చేయాలని ట్రై చేస్తున్నారు. వెంకీ 75వ సినిమాను త్రివిక్రమ్ తో చేయాలి అనుకున్నారు కానీ.. కుదరలేదు. ఇప్పుడు ఈ క్రేజీ కాంబో మూవీ సెట్ అయ్యింది. ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

అయితే.. త్రివిక్రమ్ కథ – మాటలతో వెంకీ నటించిన చిత్రాలు మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావ్. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ రాబట్టాయి. బ్లాక్ బస్టర్ చిత్రాలుగా నిలిచాయి. ఇప్పుడు ఫస్ట్ టైమ్ త్రివిక్రమ్ డైరెక్షన్ లో వెంకీ సినిమా చేస్తుండడంతో ఈ మూవీ పై ఎక్స్ పెక్టేషన్స్ భారీగా ఉన్నాయి. మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావ్ చిత్రాలు మ్యాజిక్ చేసినట్టుగా తాజాగా చేస్తున్న సినిమా కూడా మ్యాజిక్ చేయడం ఖాయమనే టాక్ బలంగా వినిపిస్తోంది. త్వరలోనే ఈ మూవీని సెట్స్ పైకి తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. Venky Trivikram’s movie.

సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో వెంకీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించాడు. ఆతర్వాత ఈ సినిమాని స్టార్ట్ చేయాలి అనుకున్నాడు కానీ.. మెగా 157 మూవీలో వెంకీ ముఖ్యపాత్ర పోషిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత త్రివిక్రమ్ తో మూవీని ప్రారంభించాలి అనుకోవడం వలన ఆలస్యం అయ్యింది. ఈ సినిమాకి
వెంకటరమణ, ఆనందరావు టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయని తెలిసింది. త్వరలోనే ఈ సినిమా టైటిల్ ఏంటి అనేది ప్రకటించనున్నారు. మరి.. ఈ సినిమాతో వెంకీ మరోసారి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధిస్తాడేమో చూడాలి.

Also Read: https://www.mega9tv.com/cinema/these-are-the-celebrities-who-served-in-the-army-they-are-not-heroes-in-reel-life-but-also-in-real-life/