కోలీవుడ్ కి 1000 కోట్ల మూవీ లేనట్టేనా..?

Kollywood 1000 crore movie: ఒకప్పుడు 100 కోట్లు కలెక్ట్ చేయడం అంటే.. గొప్పగా ఉండేది. ఇప్పుడు 1000 కోట్లు కలెక్ట్ చేయడం అనేది గొప్పగా మారింది. టాలీవుడ్ నుంచి 1000 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాలు నాలుగు ఉన్నాయి. శాండిల్ వుడ్ నుంచి 1000 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా ఒకటి ఉంది. అయితే.. కోలీవుడ్ నుంచి 1000 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా ఒక్కటి కూడా లేదు. కూలీ సినిమా 1000 కోట్లు కలెక్ట్ చేయడం ఖాయమని.. కోలీవుడ్ సినీ అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు కూలీ రిలీజైంది. మరి.. కూలీ ఎంత కలెక్ట్ చేసింది..? 1000 కోట్ల మార్క్ సాధించడం సాధ్యమేనా..?

కూలీ సినిమా పై అంచనాలు భారీగా ఏర్పడడంతో ఈసారి సూపర్ స్టార్ రజినీ సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని.. బాక్సాఫీస్ షేక్ చేస్తారని ఆతృతగా ఎదురు చూశారు. అయితే.. కూలీ అంచనాలు అందుకోవడంలో తడబడింది. సరైన కథ లేకపోవడంతో మంచి హైప్ ను మిస్ చేసుకుందనే టాక్ వినిపిస్తోంది. లోకేష్‌ కనకరాజ్.. 1000 కోట్లు కలెక్ట్ చేసేలా బజ్ ను క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. ఇది చాలా మంది అవకాశం. అయితే.. సరైన కథ, కథనం లేకపోవడంతో కూలీ అందర్నీ మెప్పించలేకపోయింది. థియేటర్స్ కి వెళ్లిన ప్రేక్షకులకు నిరాశే ఎదురైంది.

కూలీ సినిమాకి ఫస్ట్ డే 100 కోట్లు వస్తుందని అంచనా వేశారు. అయితే.. ఇది అంచనాలకు మించి 151 కోట్లు కలెక్ట్ చేయడం విశేషం. దీనికి లాంగ్ వీకెండ్ అనేది బాగా ప్లస్ అని చెప్పచ్చు. ఆదివారం వరకు కలెక్షన్స్ బాగుంటాయి. అడ్వాన్స్ బుకింగ్స్ లో ఓ రేంజ్ లో టిక్కెట్లు సేల్ అయ్యాయి. దీంతో ఈ సినిమా 1000 కోట్లు ఈజీగా సాధించేస్తుంది అనుకున్నారు కోలీవుడ్ సినీ జనాలు. అయితే.. వచ్చిన హైప్ కి తగ్గట్టుగా సినిమా ఉండకపోవడంతో నెక్ట్స్ వీక్ సినిమాకు అంతగా కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ లేదు అనేది ట్రేడ్ పండితులు చెబుతున్న మాట. Kollywood 1000 crore movie.

ఈ సినిమా 1000 కోట్లు కలెక్ట్ చేయాలని సినీ అభిమానులే కాదు.. కోలీవుడ్ సినీ ప్రముఖులు కూడా ఎదురు చూశారు. యాక్టర్ సత్యరాజ్ అయితే.. ప్రెస్ మీట్ లోనే కోలీవుడ్ నుంచి వస్తున్న ఫస్ట్ 1000 కోట్లు సినిమా కూలీ అంటూ అనౌన్స్ చేశారు. దీనిని బట్టి ఎంతలా ఈ సినిమా పై ఆశలు పెట్టుకున్నారో అర్థమౌతుంది. అయితే.. లోకేష్‌ కనకరాజ్ స్టార్ కాస్టింగ్ పై దృష్టి పెట్టాడు కానీ.. స్టోరీ పై కాన్ సన్ ట్రేషన్ చేయలేదు. మరి.. ఏ కోలీవుడ్ సినిమా 1000 కోట్లు కలెక్ట్ చేస్తుందో.. ఎప్పుడు చేస్తుందో చూడాలి.

Also Read: https://www.mega9tv.com/cinema/mahesh-and-allu-arjun-should-be-appreciated-because-bollywood-directors-gave-flop-to-telugu-heroes/