కొరటాలకు షాక్ ఇచ్చిన ఎన్టీఆర్..?

NTR gave shock to Koratala: యంగ్ టైగర్ ఎన్టీఆర్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ.. వీరిద్దరి కాంబోలో జనతా గ్యారేజ్ మూవీ రావడం.. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం తెలిసిందే. ఆతర్వాత మరో సినిమా చేయాలి అనుకోవడంతో దేవర అనే సినిమా చేశారు. ఈ మూవీ షూటింగ్ లో ఉండగానే.. దేవర సినిమాను ఒక పార్టుగా కాదు.. రెండు పార్టులుగా చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. అయితే.. దేవర రిలీజ్ తర్వాత దేవర 2 ఉంటుందా..? ఉండదా..? అనేది సస్పెన్స్ గా మారింది. ఇప్పుడు దేవర 2 లేదని గట్టిగా టాక్ వినిపిస్తోంది. ఇంతకీ.. ఏమైంది..?

ఎన్టీఆర్ ఇప్పుడు వార్ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం తెలిసిందే. హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ నటించిన వార్ 2 మూవీకి సరిగా ప్రమోషన్స్ జరగడం లేదని ప్రచారం జరిగింది. అయితే.. ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన తర్వాత నుంచి బజ్ బాగా క్రియేట్ అయ్యింది. బ్లాక్ బస్టర్ టాక్ వస్తుందని ఎదురు చూసిన అభిమానులకు షాక్ తగిలినట్టు అయ్యింది. వార్ 2 జస్ట్ యావరేజ్ అనే టాక్ తెచ్చుకుంది. దీంతో ఎన్టీఆర్ ఆలోచనలో పడ్డాడని.. తెలిసింది. ఇప్పుడు తన సినిమాల లైనప్ మారింది అనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్.

లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. ఎన్టీఆర్ ప్రస్తుతం డ్రాగన్ మూవీ చేస్తున్నాడు. దీనికి సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకుడు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఆమధ్య రామోజీ ఫిలింసిటీలో ఈ సినిమాకి సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. జూన్ 25న డ్రాగన్ సినిమాను విడుదల చేయాలి అనుకుంటున్నారు. దీని తర్వాత లెక్క ప్రకారం.. దేవర 2 చేయాలి. కొరటాల శివ కథ రెడీ చేసేసి రెడీగా ఉన్నాడు. ఎన్టీఆర్ ఎప్పుడు డేట్స్ ఇస్తే.. అప్పుడు దేవర 2 పట్టాలెక్కించాలి అనుకున్నాడు. NTR gave shock to Koratala.

అయితే.. వార్ 2 రిజెల్ట్ సరిగా రాకపోవడంతో లైనప్ మార్చాడట. దేవర 2 తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేయాలి అనుకున్నాడు యంగ్ టైగర్. ఇది మైథలాజికల్ స్టోరీతో రూపొందే భారీ చిత్రం. అయితే.. ఇప్పుడు దేవర 2 ను పక్కనపెట్టి త్రివిక్రమ్ తో సినిమాని స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడని తెలిసింది. దీంతో కొరటాల ఏం చేయాలో తెలియక తెగ టెన్షన్ పడుతున్నాడని టాక్ వినిపిస్తోంది. నాగచైతన్య కోసం ఓ కథ రెడీ చేస్తున్నాడట. ఈ కథకు చైతూ ఓకే చెబుతాడా..? ఓకే చెప్పినా వెంటనే ఈ సినిమా స్టార్ట్ చేసే పరిస్థితి లేదు. చైతూ ఫుల్ బిజీగా ఉన్నాడు. మరి.. కొరటాల ఏం చేస్తాడో..?

Also Read: https://www.mega9tv.com/cinema/kollywood-doesnt-have-a-1000-crore-movie-coolie-fails-to-meet-expectations/