
Megastar Birthday Celebrations in Goa: మెగాస్టార్ చిరంజీవి నేడు 70వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. అభిమానులు, ప్రముఖులు అంతా చిరుకి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే మెగా ఫ్యామిలీ మాత్రం ఆయన బర్త్ డే సెలెబ్రేషన్స్ ను గోవాలో ప్లాన్ చేశారు. గోవాలో మెగాస్టార్ బర్త్ డే ని ఫ్యామిలీ మెంబర్స్ ఘనంగా సెలబ్రేట్ చేసిన స్పెషల్ వీడియోను రామ్ చరణ్ సోషల్ మీడియాలో షేర్ చేసి తండ్రికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ వీడియోలో చరణ్ తండ్రికి కేక్ తినిపించి, చిరు కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నాడు. అనంతరం ఇద్దరూ ఆప్యాయంగా కౌగలించుకున్నారు. చిరు కూడా చరణ్ కి కేక్ తినిపించారు.
ప్రతి ఏడాది మెగాస్టార్ బర్త్ డే ను ఆయన ఫ్యామిలీ అంతా ఎంతో గ్రాండ్ గా సెలెబ్రేట్ చేస్తుంటారు. అయితే ఈ ఏడాది చిరు బర్త్ డే ని ఇంకాస్త స్పెషల్ గా ప్లాన్ చేశారు. అది కూడా గోవాలో కావడం విశేషం. రామ్ చరణ్ చిరు బర్త్ డే సెలెబ్రేషన్స్ కి సంబంధించిన ఈ వీడియో షేర్ చేస్తూ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు..’ ఇది కేవలం నీ పుట్టిన రోజు మాత్రమే కాదు నాన్న. ఇది మీలాంటి వ్యక్తికి ఒక అద్భుతమైన వేడుక. నా హీరో, నా గైడ్, నా ప్రేరణ మీరే. నేను సాధించిన ప్రతి విజయం, నేను మోసే ప్రతి విలువ, మీ నుండే వస్తుంది. 70 ఏళ్ల వయసులో మీరు హృదయంలో ఇంకా యవ్వనంగా, ఇంకా స్ఫూర్తిదాయకంగా మారుతున్నారు. మీ ఆరోగ్యం, ఆనందం ఎన్నో సంవత్సరాలు ఇలాగె ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. ఎవరైనా కోరుకునే ఉత్తమ తండ్రిగా ఉన్నందుకు ధన్యవాదాలు..’ అని తెలిపాడు. దీంతో చరణ్ పోస్ట్ వైరల్ గా మారగా మెగా ఫ్యాన్స్ ఈ తండ్రి కొడుకుల వీడియోని నెట్టింట తెగ షేర్ చేస్తున్నారు. Megastar Birthday Celebrations in Goa.
మరోవైపు చిరు బర్త్ డే సందర్భంగా ఆయన లేటెస్ట్ మూవీస్ కి సంబంధించిన అప్డేట్స్ కూడా వచ్చేసాయి. నిన్న విశ్వంభర నుంచి గ్లింప్స్ వీడియోని రిలీజ్ చేయగా.. నేడు అనిల్ రావిపూడి మెగా 157 ప్రాజెక్ట్ కు సంబంధించి టైటిల్ గ్లింప్స్ వదిలారు. అనిల్ రావిపూడి – చిరంజీవి కాంబినేషన్‌లో రానున్న ఈ సినిమాకు ‘మన శంకరవరప్రసాద్‌గారు’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. గ్లింప్స్ లో కారు నుంచి కూలింగ్ గ్లాస్ పెట్టుకొని నోటిలో సిగరెట్‌తో మెగాస్టార్ ఎంట్రీ ఇచ్చారు. ఇక వెనకాల సెక్యూరిటీ తుపాకులు పట్టుకొని ఉండగా స్టయిల్‌గా చిరు నడిచి వస్తుంటే వింటేజ్ లుక్ ఒకసారి కళ్ల ముందు కదిలింది. ఇంతలో ‘మన శంకరవరప్రసాద్ గారు’ పండగకి వస్తున్నారు అంటూ వెంకటేష్ వాయిస్ తో టైటిల్ పడింది. ఈ గ్లింప్స్ వీడియో ఫ్యాన్స్ ను బాగా ఆకట్టుకుంటోంది.