ఆ సినిమాతో.. టాలీవుడ్ రారాజుగా..!

Megastar Chiranjeevi Top 5 Movies: తెలుగు చిత్ర పరిశ్రమలో నాటి నుంచి నేటి వరకు ఎందరో హీరోలు వచ్చారు .. వెళ్లారు. కానీ కొందరు మాత్రమే తమకంటూ కొన్ని పేజీలు లిఖించి ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు. అలాంటి వారిలో ఖచ్చితంగా ఉండే పేరు మెగాస్టార్ చిరంజీవి. సామాన్య కుటుంబం నుంచి వచ్చి టాలీవుడ్‌కు, తెలుగువారికి ఐకాన్‌గా నిలిచారు. తెలుగు సినిమాను రారాజుగా ఏలుతున్నారు చిరంజీవి.

సుదీర్ఘ ప్రస్థానంలో తమకంటూ చెప్పుకోవడానికి కనీసం ఒక్కటైనా సినిమా ఉంటుంది. దాదాపు 46 ఏళ్ల సినీ జీవితంలో చిరంజీవి ఎన్నో మరుపురాని పాత్రలు పోషించారు. డ్యాన్స్, ఫైట్స్‌తో పాటు తన నటనతో కమర్షియల్ హీరోగా ప్రేక్షకులను అలరించారు. అయితే పరిపూర్ణమైన నటుడిగా చిరంజీవికి పేరు తీసుకొచ్చిన చిత్రాలు కొన్నే ఉన్నాయి. వాటిలో టాప్ 5 సినిమాలు.

కోదండరామిరెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం ఖైదీ. అప్పటి వరకు చిన్నాచితకా సినిమాలు చేసుకుంటూ వస్తున్న చిరంజీవి కెరీర్‌ను పూర్తిగా మార్చేసిన సినిమా ఖైదీ. మాధవీ, సుమలత, రావుగోపాల్ రావు తదితరులు నటించిన ఈ చిత్రం 1983 అక్టోబర్ 28న విడుదలై కలెక్షన్ల వర్షం కురిపించడంతో పాటు చిరంజీవి మెగాస్టార్ అయ్యే క్రమంలో తొలి అడుగుగా మారింది.

ఏ కొదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో చిరంజీవి తన నటనతో చెలరేగిపోయారు. ఫుట్‌బాల్ ప్లేయర్ అవుదామనుకున్న కుర్రాడు.. తన కుటుంబం కోసం ఎలాంటి త్యాగం చేశాడనే ఇతివృత్తంతో విజేత సినిమా తెరకెక్కింది. భానుప్రియ, జేవీ సోమయాజులు కీలకపాత్రలు పోషించగా.. ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ బాలనటుడిగా కనిపించారు. 1985 అక్టోబర్ 23న విడుదలైన విజేత చిత్రం సంచలన విజయం సాధించగా.. చిరంజీవికి ఉత్తమ నటుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ వరించింది.

చెప్పులు కుట్టుకునే వ్యక్తి తన స్వయంకృషితో కుబేరుడిగా ఎలా మారాడు అనే ఇతివృత్తంతో కళాతపస్వి కే. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం చిరంజీవి కెరీర్‌లో క్లాసిక్‌గా నిలిచిపోయింది. విజయశాంతి, చరణ్ రాజ్, సుమలత తదితరులు నటించిన ఈ చిత్రం 1987 సెప్టెంబర్ 3న విడుదలై ఘన విజయం సాధించింది. ఈ సినిమాను స్పూర్తిగా తీసుకున్న నాటి యువత ఎంతో మంది తమ స్వయంకృషితో జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించారు.

లెజండరీ డైరెక్టర్ కే.బాలచందర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రుద్రవీణ. సాంప్రదాయ సంగీత కుటుంబానికి చెందిన ఓ కుర్రాడు తన పాటలతో సమాజాన్ని ఎలా మార్చాడు అనే ఇతివృత్తం ఆధారంగా రుద్రవీణను తెరకెక్కించారు. జెమినీ గణేశన్, రమేశ్ అరవింద్, శోభన కీలకపాత్రలు పోషించిన ఈ సినిమా 4 మార్చి 1988న విడుదలై విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. అలాగే నర్గీస్ దత్ జాతీయ సమైక్యతా పురస్కారంతో భారత ప్రభుత్వం ఈ సినిమాను సత్కరించింది. Megastar Chiranjeevi Top 5 Movies.

మెగాస్టార్‌గా, కోటి రూపాయలకు పైగా రెమ్యునరేషన్ అందుకున్న తొలి హీరోగా చిరంజీవి ఇమేజ్ శిఖరాన్ని చేరిన సమయంలో కమర్షియల్ సినిమాలకు దూరంగా చిరంజీవి చేసిన సినిమాయే ఆపద్భాంధవుడు. కళాతపస్వి కే. విశ్వనాథ్‌ దర్శకత్వంలో అవకాశం వస్తే ఎలాంటి సినిమాలనైనా వదులుకుంటానని మరోసారి చిరు నిరూపించారు. మీనాక్షి శేషాద్రి, శరత్ బాబు, జంధ్యాల, కైకాల సత్యనారాయణ, గీత తదితరులు కీలకపాత్రలు పోషించారు. తనను ఆదరించిన పెద్దాయన రాసిన కవితల్ని పుస్తకంగా తీసుకురావడంతో పాటు ఆయన కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడే కుర్రాడిగా చిరంజీవి నటన హైలైట్‌గా నిలిచింది. 1992 అక్టోబర్ 9న విడుదలైన ఆపద్భాంధవుడు సినిమా విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఉత్తమ నటుడిగా చిరంజీవి నంది అవార్డ్‌తో పాటు ఫిల్మ్‌ఫేర్ పురస్కారాన్ని అందుకున్నారు. అలాగే మొత్తం ఐదు నంది అవార్డులు ఆపద్బాంధవుడిని వరించాయి.

Join with us: https://whatsapp.com/channel/0029VarK7kPHAdNW7c2XLY2q