
Modi’s Strategy Shocked Trump: ప్రధాని మోడీ వ్యూహంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు భారీ షాకే తగిలింది. భారత్ బాటలో ప్రస్తుతం 25 దేశాలే పయనిస్తున్నాయి. పోస్టల్ సేవల నిలిపివేతతో ట్రంప్ కు ఒక్కసారిగా దిబ్బతిరిగిపోయింది. టారిఫ్ లు రద్దు చేయకపోతే భారీ మూల్యం. భారత్ నిర్ణయానికి ప్రపంచ దేశాలు మద్దతు తెలుపుతున్నాయి. చిన్న వ్యాపారులకు దెబ్బతగలకుండా ప్రధాని మోడీ ప్లాన్ చేస్తున్నారు.
అమెరికా ఆర్థిక వ్యవస్థపై తాజా నిర్ణయంతో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ట్రంప్ నిర్ణయానికి చెంప చెల్లుమనేలా సరైన సమాధానం భారత్ ఇచ్చింది. ట్రంప్ కొత్త సుంకాలతోనే ఈ గందరగోళం అంతా కనిపిస్తుంది. ప్రెజెంట్ ప్రపంచం మొత్తం ఒకే ఒక వ్యక్తి గురించి చర్చించుకుంటున్నారు. ఆయనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇక ట్రంప్ తీసుకుంటున్న సడన్ డిషీశన్స్ ప్రపంచ దేశాలనే కాదు సొంత దేశ ప్రజలను కూడా షాక్ కు గురిచేస్తున్నాయి. అసలు ట్రంప్ ప్రపంచానికే షాక్ ఇస్తున్నారా…లేక తన ప్రజలకే ఝలక్ లు ఇస్తున్నారా అనే గందరగోళంలో అమెరికన్స్ ఉన్నారు.
ఇక పోతే ట్రంప్ టారిఫ్స్ పెంపుపై భారత్ భయపడటం లేదని.. ట్రేడ్ డిస్ప్యూట్‌పై భారత్ తీవ్ర ఆగ్రహంగా ఉందని తెలుస్తుంది. ప్రధాని మోదీతో మాట్లాడేందుకు ట్రంప్ప్రయత్నించగా మోడీ స్పందించడం లేదని సమాచారం. మోడీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గత వారం రోజులుగా 4 సార్లు ఫోన్ చేసినా.. మోడీ ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదని తెలుస్తుంది. ఇటీవల కాలంలో ట్రంప్ కనీసం నాలుగు సార్లు మోదీకి ఫోన్ చేసినా, ఆయన మాట్లాడటానికి నిరాకరించారు.
దీనికి కారణం భారత్‌పై అమెరికా విధించిన 50 శాతం టారిఫ్‌లే. ఇప్పటికే ఉన్న 25 శాతం సుంకంతో పాటు, అదనంగా మరో 25 శాతం సుంకం విధించడంపై మోదీ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయన ట్రంప్ కాల్స్‌ను పట్టించుకోవడం లేదు. మోదీ తన కోపాన్ని, ఆందోళనను తెలియజేయడానికే ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడటానికి ఇష్టపడట్లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
గతంలో ట్రంప్ ఇతర దేశాల అధినేతలతో ఫోన్‌లో మాట్లాడిన తర్వాత, ఆ సంభాషణల సారాంశాన్ని మార్చి చెప్పిన సందర్భాలు ఉన్నాయని, ఆ ట్రాప్‌లో పడకుండా మోదీ జాగ్రత్త పడుతున్నారు. అయితే, భారత ప్రభుత్వం తరఫున దౌత్యవేత్తలు అనధికారికంగా దీనిపై స్పందించినట్లు తెలుస్తోంది. ఇలాంటి సెన్సిటీవ్ మ్యాటర్లు మోదీ ఫోన్‌లో డీల్ చేయరని కొందరు అంచనా వేస్తున్నారు.
ఇక భారత్ పై అమెరికా సుంకాల మోత మరింత పెరిగింది. రష్యా చమురు కొనుగోలు చేస్తూ ఉక్రెయిన్ పై యుద్ధానికి సహకరిస్తున్నారని ఆరోపిస్తూ ట్రంప్ సుంకాలను 50 శాతానికి పెంచేశారు. కొత్త సుంకాలు ఇవాళ్టి నుంచే అమల్లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో రష్యా చమురు విషయంలో భారత్ ఏం చేయబోతోందనే చర్చ సర్వత్రా నడుస్తోంది. ఈ నేపథ్యంలో భారతీయ చమురు సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి.
మూడేళ్లుగా రష్యా డిస్కౌంట్ పై అందిస్తున్న చమురును కొనుగోలు చేస్తూ స్వదేశంలో ప్రజలకు ఆ ప్రయోజనం బదిలీ చేయకపోయినా విదేశాలకు సైతం దాన్ని అమ్ముకుంటున్న మన చమురు సంస్థలు ఐఓసీఎల్, బీపీ, హెచ్పీ ఇప్పుడు ట్రంప్ సుంకాల మోత తర్వాత కూడా అదే వైఖరి కొనసాగించాలని నిర్ణయించాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు రష్యా నుంచి చమురు కొనుగోళ్లు ఆపరాదని నిర్ణయించాయి.
దేశం ముందు, వాణిజ్యం తర్వాత అన్న కేంద్ర ప్రభుత్వ సందేశం నేపథ్యంలో రష్యా నుంచి చమురు కొనుగోళ్లు కొనసాగించాలని భారతీయ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. మరోవైపు గత నెలతో పోలిస్తే ఈ నెలలో తగ్గించినప్పటికీ రష్యా నుంచి చమురు కొనుగోళ్లు మాత్రం ఆపరాదని ఆయా సంస్థలు నిర్ణయించాయి. అయితే గతేడాది పోలిస్తే రష్యా చమురు డిస్కౌంట్లు కూడా తగ్గిపోయాయి. గతేడాది బ్యారెల్ ను 2.5 నుంచి 3 డాలర్ల డిస్కౌంట్ ఇచ్చిన రష్యా ఈ ఏడాది మాత్రం దాన్ని 1.5 నుంచి 1.7 డాలర్లకు పరిమితం చేస్తోంది. అయినా భారత్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. Modi’s Strategy Shocked Trump.
అమెరికా డిమాండ్లకు తలొగ్గడం కంటే రష్యా చమురును కొనసాగించడం ద్వారా దీర్ఘకాలంలో ఇబ్బందుల్ని అధిగమించవచ్చని కేంద్ర భావిస్తోంది. అయితే అమెరికా మాత్రం రష్యా చమురు కొనుగోళ్లను భారత్ ఇలాగే కొనసాగిస్తే మాత్రం భవిష్యత్తులో మరింత సుంకాల మోత మోగించడంతో పాటు అదనంగా ఆంక్షలు విధించేందుకు కూడా సిద్ధమని హెచ్చరికలు పంపుతోంది. ఈ నేపథ్యంలో చమురు ధరల స్థిరత్వం కోసం కేంద్రం ఏం చేయబోతోందన్న ఉత్కంఠ నెలకొంది. మరోవైపు అమెరికాతో చర్చల్ని మాత్రం కొనసాగించేందుకు కేంద్రం మొగ్గు చూపుతోంది.
Join with us: https://whatsapp.com/channel/0029VarK7kPHAdNW7c2XLY2q