
Trump Hand Injury: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఏమైంది? ఎక్కడున్నాడు? గత రెండు రోజులుగా జనాల మధ్యలో ఎందుకు కనిపించడం లేదు.? మీడియా ముందుకు ఎందుకు రావడం లేదు..? తాను ఏదైనా చెప్పాలనుకుంటే ట్రూత్ ద్వారానే ఎందుకు చెబుతున్నాడు.? ట్రంప్ నిజంగానే హెల్త్ ఇష్యూస్ తో బాధపడుతున్నారా? సోషల్ మీడియాలో ఆయన ఆనారోగ్యంపై వస్తున్న రూమర్స్ వాస్తవమేనా? ఒకవేళ అమెరికాలో ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఎదురైతే తాను అధ్యక్ష పగ్గాలు చేపట్టేందుకు రెడీ అని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చెప్పడం వెనుక ఉన్న ఆంతర్యమేంటి? ఇదే క్రమంలో ఈ వీకెండ్‌లో ఆయన షెడ్యూల్స్ ఏమీ లేకపోవడంతో ట్రంప్ మిస్సింగ్ అనే న్యూస్ వైరల్ గా మారింది .దీంతో అసలు ట్రంప్ ఎక్కడ ఉన్నారు, ఆయనకు ఏమైంది అనేది అమెరికాలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.
79 ఏళ్ల డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై గత కొంత కాలంగా చాలా రూమర్లు వెలుగులోకి వస్తున్నాయి.ట్రంప్ చాలా సీరియస్ కండీషన్ లో ఉన్నారన్న పుకార్లు షికారు చేస్తున్నాయి. రీసెంట్ గా ఆయన చేతి మీద పెద్ద మచ్చ ఉన్న ఫొటో నెట్టింట్లో వైరల్ అయ్యింది. ఈ గాయం గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరిగింది. ఆ గాయాన్ని కవర్ చేసేందుకు చేతికి మేకప్ వేసుకుని ట్రంప్ కనిపించడం హాట్ టాపిక్ గా మారింది. దీనిపై ట్రంప్ పర్సనల్ డాక్టర్ సీన్ బార్బబెల్లా కూడా ఒక క్లారిటీ ఇచ్చింది. ట్రంప్ కు గాయం అయ్యింది వాస్తవమేనని..అయితే ఆయన తరచుగా షేక్ హ్యాండ్స్ ఇవ్వటం, అస్ప్రిన్ వాడటం వల్లనే ఆ గాయం ఏర్పడిందని తెలిపింది. అంతకు మించి ట్రంప్ కు ఎలాంటి అనారోగ్య సమస్య లేదని క్లారిటీ ఇచ్చింది
ఇక తాజాగా ఆయన కాలల్లో వాపు ఉన్నట్లు ప్రచారం మరో ప్రచారం జోరందుకుంది. ఆయన పబ్లిక్ ఈవెంట్స్ లో కనిపించకపోవడం, షెడ్యూల్ లో ఎలాంటి ఈవెంట్లు లేకపోవడంతో ట్రంప్ మిస్సింగ్ అనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదే సమయంలో ట్రంప్ ఏదైనా చెప్పాలనుకుంటే మాత్రం సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ అయిన ట్రూత్ ద్వారానే తన అభిప్రాయాన్ని తెలియజేస్తుండటం ఈ అనుమానాలకు మరింత బలాన్నిస్తోంది. ట్రంప్ తెచ్చిన టారిఫ్ ల్లో చాలా వరకు ఇల్లీగల్ అని.. అవి చెల్లవంటూ అమెరికా లోకల్ కోర్టు తాజాగా తీర్పు ఇచ్చింది. దీనిపై ట్రంప్ స్పందించారు.కోర్టు తప్పుడు తీర్పు ఇచ్చిందన్న ట్రంప్ టారిఫ్ లు కొనసాగుతాయని సోషల్ మీడియాలోనే అనౌన్స్ చేశారు. లోకల్ కోర్టు తీర్పు మీద పై కోర్టుకు వెళ్తానని తెలిపారు .
ఇదిలా ఉంటే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ట్రంప్ పై ఇండైరెక్ట్ గా సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఏర్పడినా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడానికి తాను సిద్థం అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ట్రంప్ ఆరోగ్యంపై వస్తున్న ఊహాగానాల నేపథ్యంలో వాన్స్ ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమయ్యాయి. అధ్యక్షుడు ట్రంప్ చాలా హెల్దీగా , యాక్టివ్ గా ఉన్నారు. మిగిలిన పదవీకాలాన్ని ఆయన విజయవంతంగా పూర్తి చేస్తారన్న నమ్మకం తనకు ఉందన్నారు వాన్స్ . కానీ..ఒకవేళ అనుకోని పరిస్థితులు ఎదురైతే, అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నా అని వాన్స్ స్పష్టం చేశారు. దీంతో వాన్స్ కామెంట్స్ కూడా ట్రంప్ హెల్త్ పై అనుమానాలను పెంచుతున్నాయి. Trump Hand Injury.
అయితే ట్రంప్ ఆరోగ్యంపై వస్తున్న వార్తలన్నీ పుకార్లేనని.. ఆయన ఫిట్‌గా ఉన్నారని..అందుకు ట్రంప్ చేసిన ట్రూత్ సోషల్ పోస్ట్‌లే ప్రూఫ్ అని మరికొంత మంది చెబుతున్నారు. సెప్టెంబర్ 1న కార్మిక దినోత్సవం..అందుకే ఆయన ఈ నెల 30, 31వ తేదీల్లో ఎలాంటి ఈవెంట్లకు వెళ్లడం లేదని, ఆయన పూర్తి ఫిట్ గా ఉన్నారని అంటున్నారు.
Join with us: https://whatsapp.com/channel/0029VarK7kPHAdNW7c2XLY2q