
Rebel Organic Youth Ecil: గణేష్ చతుర్థి, వినాయక చతుర్థి లేదా గణేష్ ఉత్సవ్ అని కూడా పిలుస్తారు, ఇది గణేష్ జన్మదినాన్ని జరుపుకునే హిందూ పండుగ. అతను జ్ఞానం, శ్రేయస్సు మరియు అదృష్టానికి ప్రసిద్ధి చెందిన ఏనుగు తల గల దేవుడు.
ఈ క్రమంలో వినాయక చవితి వేడుకల్లో మనం పెద్ద పెద్ద విగ్రహాలను చూస్తూనే ఉంటాం.. అయితే తాజా గా హైదరాబాద్ లో ECIL కు చెందిన REBEL ORGANIC YOUTH వాళ్ళు ఇరవై మూడు ఫీట్ల ఎతైన గణేష్ విగ్రహాన్ని పెట్టారు. ప్రస్తుతం ఇది రాధికా దగ్గర ఉన్న ఎంజే కాలనీ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భక్తులు మరియు సందర్శకులు ఇప్పటికే ఈ ప్రదేశానికి తరలి రావడం ప్రారంభించారు, సెల్ఫీలు, ఫోటోలు మరియు పండుగ ఉత్సాహంతో నిండిన ఉత్సాహభరితమైన కేంద్రంగా ఈ ప్రాంతాన్ని మార్చారు.
రెబెల్ ఆర్గానిక్ యూత్ ఆర్గనైజర్ DJ శివ మాట్లాడుతూ “గణేశుడు మన హృదయంలో ఉన్నప్పుడు, ఏ మార్గం కూడా కష్టం కాదు మరియు ఏ కల కూడా చాలా దూరం కాదు.” “గణపతి కేవలం అడ్డంకులను తొలగించడమే కాదు; వాటిని ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలో కూడా మనకు నేర్పుతాడు.” అని గణేష్ చతుర్థి శుభాకాంక్షలు చెప్తూ అందరికి ఆహ్వానం పలికారు. ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి పాల్గొన్నారు.

ప్రస్తుతం ఈ భారీ గణపయ్యను కొన్ని రోజుల్లో కాప్రా లో నిమర్జనం చేయనున్నారు. రెబెల్ ఆర్గానిక్ యూత్ ఆర్గనైజర్ DJ శివ మరియు అతని ఫ్రెండ్స్, ఉత్తమ అభినందనలతో NV రోహిన్ కుమార్.
Join with us: https://whatsapp.com/channel/0029VarK7kPHAdNW7c2XLY2q