చైనాలో ప్రధాని మోదీ పర్యటన..!

PM Modi’s visit to China: చైనా, భారత్.. పక్కపక్క దేశాలు.. కాని ఏదో ఒక దూరం .. ఇది సరిహద్దుల విషయంలో కావొచ్చు… పాకిస్థాన్ విషయంలో కావొచ్చు.. పరస్పరం విభేదాలు ఉండేవి. ఈ నిప్పులో పెట్రోలో పోసినట్టు మధ్యలో అమెరికా.. రెండు దేశాల మధ్య దూరం పెంచేది.. అయితే అమెరికా గత పాలకలు భారత్, చైనాను ఒకదానికొకటి దూరం చేస్తే.. ట్రంప్ మాత్రం రెండు దేశాలను దగ్గర చేశారు. తన టారిఫ్ లతో భారత్ పై భారం మోపి.. చైనాకు దగ్గరయ్యేలా చేశారు. ప్రధాని మోదీ చైనా పర్యటనతో ఈ మైత్రి మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో మోదీ చైనా పర్యటన ఎలా సాగింది.. ? జిన్ పింగ్ తో మోదీ భేటీలో ఎలాంటి అంశాలు చర్చకు వచ్చాయి..? మోదీ పర్యటనకు భారత్ కు ఎలా ఉపయోగం..? ట్రంప్ గురించి వీరి మధ్య ఎలాంటి సీక్రెట్ చర్చ జరిగింది..? జిన్ పింగ్ .. ఏనుగు, డ్రాగెన్ కలయిక అని ఎందుకు అన్నారు..?

దాదాపు ఏడేళ్ల తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ చైనా కు వెళ్లారు. ఓ పక్క ట్రంప్ సుంకాలతో మోత మోగిస్తున్న తరుణంలో మోదీ చైనా పర్యటన ఎంతో ప్రధాన్యతను సంతరించకుంది. ప్రధానంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ తో మోదీ భేటీ అందరి దృష్టిని ఆకర్షించింది. రెండు దేశాల మధ్య విభేదాలు ఉన్నా.. వాటిని పక్కన పెట్టి దగ్గరయ్యేందుకు అనేక అంశాలై మోదీ, జిన్ పింగ్ చర్చించారు. చైనాతో సానుకూల సంబంధాలు కొనసాగించేందుకు భారత్‌ కట్టుబడి ఉందన్న మోదీ… గత చర్చలు భారత్‌- చైనా సరిహద్దుల్లో శాంతి, స్థిరత్వం నెలకొందన్నారు. కైలాశ్‌ మానససరోవర్‌ యాత్ర కూడా తిరిగి ప్రారంభమైన విషయాన్ని గుర్తు చేశారు. రెండు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులు పునఃప్రారంభం కానున్నట్లు తెలిపారు. ఇరుదేశాల మధ్య సహకారంతో దాదాపు 2.8 బిలియన్ల మంది ప్రజల ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయని పేర్కొన్నారు. పరస్పర విశ్వాసం, గౌరవంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు ముందుకు తీసుకెళ్లేందుకు నిశ్చయించుకున్నామన్నారు.

అటు షీ జిన్‌పింగ్ తన ప్రసంగంలో డ్రాగన్-ఎలిఫెంట్ టాంగో అనే పదాన్ని ఉపయోగించారు. ఇది భారత్, చైనాలను వాటి గుర్తులుగా వాడే జంతువులైన ఏనుగు, డ్రాగన్‌లతో సూచిస్తాయి. ఇవి స్నేహం, సామరస్యం, సహకారానికి ఒక గుర్తుకు నిలుస్తాయి. ప్రపంచం పరివర్తన దిశగా సాగుతోంది. భారత్, చైనా పురాతన నాగరికతలు, అత్యధిక జనాభా గల దేశాలు, గ్లోబల్ సౌత్‌లో భాగమని… మనం స్నేహితులుగా, మంచి పొరుగువారిగా ఉండాలి అని జిన్ పింగ్ తెలిపారు. ఈ ఏడాది ఇరు దేశాల దౌత్య సంబంధాలకు 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, ఆసియా ప్రపంచ శాంతి, శ్రేయస్సు కోసం కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ భేటీలో రెండు కీలక అంశాలు చర్చకు వచ్చాయి. ముఖ్యంగా కైలాస్ మానస సరోవర్ యాత్ర పునఃప్రారంభం, డైరెక్ట్ ఫ్లైట్స్ తిరిగి ప్రారంభించడం వంటి అంశాలు చర్చకు వచ్చాయి. కోవిడ్-19 మహమ్మారి కారణంగా 2020 నుంచి నిలిచిపోయిన డైరెక్ట్ ఫ్లైట్స్ ఇప్పుడు పునఃప్రారంభం కానున్నాయి, ఇది వాణిజ్యం, పర్యాటకం, ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేస్తుంది. అలాగే, ఐదేళ్లుగా నిలిచిపోయిన కైలాస్ మానస సరోవర్ యాత్రను తిరిగి ప్రారంభించడం సాంస్కృతిక, ఆధ్యాత్మిక సంబంధాలను పునరుద్ధరించే చర్యగా చూడవచ్చు.

ప్రధాని మోదీ జిన్ పింగ్ తో భేటీ సందర్భంగా పంచశీల సూత్రాలు చర్చకు వచ్చాయి. దీంతో ఈ పంచశీల సూత్రాలు అంటే ఏంటని చర్చ మొదలైంది. పంచశీల సూత్రాలు 1954లో భారత్-చైనా మధ్య కుదిరిన ఒక చారిత్రక ఒప్పందంలో భాగంగా రూపొందాయి. ఈ సూత్రాలు భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ, చైనా ప్రీమియర్ జౌ ఎన్‌లాయ్‌ల మధ్య 1954న జరిగాయి. వీటి ప్రకారం ఒకరి భౌగోళిక సమగ్రత, సార్వభౌమత్వాన్ని గౌరవించాలి, ఒకరిపై ఒకరు దాడి చేసుకోకూడదు, ఒకరి దేశీయ విషయాల్లో మరొకరు జోక్యం చేసుకోకూడదు. సమానత్వం, ఇరుపక్షాలకూ ప్రయోజనం ఆధారంగా సహకారం అందించుకోవాలి.. వివాదాలను శాంతియుతంగా, చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. అయితే మోదీతో మీటింగ్ సందర్భంగా షీ జిన్‌పింగ్ పంచశీల సూత్రాలను ప్రస్తావించడం వెనుక వ్యూహాత్మక సందేశం ఉందంటున్నారు. 1954 ఒప్పందాన్ని కొనసాగించాలని చైనా కోరుకుంటున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం భారత్-చైనా మధ్య లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వివాదం కొనసాగుతోంది, ఈ సందర్భంలో షీ ఈ సూత్రాలను గుర్తు చేయడం ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరచాలనే సంకేతంగా చూడవచ్చు. దీనికి మోదీ స్పందన కూడా వ్యూహాత్మకంగా ఉందంటున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, స్థిరత్వం ద్వైపాక్షిక సంబంధాలకు ఆధారం అని ఆయన నొక్కి చెప్పారు. చైనా.. సరిహద్దు సమస్యలు సంబంధాలను నిర్ణయించకూడదు అని పేర్కొనగా, భారత్.. సరిహద్దు శాంతి సంబంధాలకు అవసరం అని స్పష్టం చేసింది. ఇది రెండు దేశాల విధానాల్లోని వైరుధ్యాన్ని సూచిస్తుంది. PM Modi’s visit to China.

అంతకుముందు జపాన్ నుంచి చైనా చేరుకున్న ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. చైనాలో భారతీయులు సాంస్కృతిక కార్యక్రమాలతో స్వాగతం పలికారు. అటు మోదీకి చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, ఆయన భార్య అధికారిక విందుకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా మోదీ.. జిన్‌పింగ్ దంపతులతో కరచాలనం చేసి, వారితో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చారు. అనంతరం ఇతర ప్రపంచ నేతలతో కలిసి గ్రూప్ ఫొటో సెషన్ లో పాల్గొన్నారు. అయితే ఇప్పుడు మోదీ చైనా పర్యటనపై అన్ని దేశాల కంటే అమెరికా ఆశక్తే ఎక్కువగా ఉంది. చైనాతో వ్యాపార సంబంధాలు కొనసాగించినా.. భౌగోలిక ఆధిపత్యం విషయంలో అమెరికా డామినేషన్ ప్రదర్శించడానికి ప్రయత్నించేంది దీనికి భారత్ ను కూడా వాడుకునేది. అయితే ఇప్పుడు భారత్ కూడా చైనాతో కలిసిపోయింది. దీంతో ట్రంప్ కు ఏం చేయాలో అర్థం కావడం లేదు. జిన్ పింగ్, మోదీ ..ఇద్దరూ కలిసి ట్రంప్ కు సంబంధించిన సీక్రెట్స్ మాట్లాడుకుంటారని అమెరికా భావిస్తోంది.

Join with us: https://whatsapp.com/channel/0029VarK7kPHAdNW7c2XLY2q