ట్రంప్ చనిపోతారని ఎందుకు అంటున్నారు..?

Trump health news: అమెరికా రాజకీయాల్లో ట్రంప్ ఆరోగ్య వ్యవహారం దుమారం రేపుతోంది. సోషల్ మీడియాలో ట్రంప్ కు ఏదో రోగం వచ్చిందని.. ఇక బతకడం కష్టమనే ప్రచారం జరుగుతోంది. దీంతో వైట్ హౌస్ ఈ వార్తలకు సమాధానం చెప్పలేకపోతోంది. మరోవైపు ట్రంప్ కు ఏదైనా జరగరానిది జరిగితే దాను అధ్యక్ష బాధ్యతలు చేపట్టడానికి ఎటువంటి సమస్యా లేదని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అనడం.. ఈ ప్రచారానికి మరింత ఊతమిస్తోంది. అసలు ట్రంప్ కు వచ్చిన రోగం ఏంటి..? సోషల్ మీడియాలో ఎలాంటి ఫోటోలు వైరల్ అవుతున్నాయి..? నిజంగా ట్రంప్ చనిపోతారా..? ప్రపంచ దేశాల అధిపతుల ఆరోగ్యాలపై తరుచూ పుకార్లు ఎందుకు ప్రచారం అవుతాయి..? తెలుసుకోవాలంటే చూడాల్సిందే.

సోషల్ మీడియాతో అంతా ట్రంప్ వార్తలే.. ట్రంప్ ఆరోగ్యం బాలేదంట.. అతడు త్వరలో చనిపోతాడంట.. అసలు ఆయనకు ఏం రోగం వచ్చింది.. ఇలాంటి ప్రశ్నలే .. మాటలో ప్రస్తుతం అమెరికా సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. ఈ అంశం ఇప్పుడు అమెరికాతో పాటు ప్రపంచ దేశాల్లోను చర్చనీయాంశంగా మారింది. ట్రంప్ ఆరోగ్యంపై పుకార్లు సోషల్ మీడియా ద్వారా వేగంగా వ్యాపించాయి. జులై నుంచి ట్రంప్ చేతులపై గాయాలు, కాళ్లలో వాపు కనిపించిన ఫోటోలు వైరల్ అయ్యాయి. అయితే ఇవి సాధారణంగా ఏర్పడిన గాయాలని.. అలాగే ఆస్పిరిన్ వాడకం వల్ల వచ్చాయని వైట్ హోస్ కవర్ చేస్తోంది. ట్రంప్‌కు క్రానిక్ వీనస్ ఇన్సఫిషియెన్సీ ఉందని, ఇది 70 ఏళ్లు దాటిన వారిలో సాధారణమని వైద్యులు చెప్పారు. దీనికి తోడు ట్రంప్ ఇటీవల ఎటువంటి కార్యక్రమాల్లోను కలనిపించలేదు. ప్రైవేటు కార్యక్రమాలు చాలా వరకు తగ్గించేశారు. దీంతో ట్రంప్ చనిపోయాడంటూ కొందరు సోషల్ మీడియాలో ఏకంగా తప్పుడు ప్రచారం మొదలు పెట్టారు. దీనిని వైట్ హౌసో ఖండించింది. ఇలాంటి పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది..

సోషల్ మీడియాలో వస్తున్న పకార్లును వైట్ హౌస్ కొట్టిపారేసింది. ట్రంప్ చాలా ఆరోగ్యంగా, చురుకుగా ఉన్నారని.. తన పని తాను చేసుకుపోతున్నారని అంటోంది. ప్రజలను కూడా నేరుగా కలుస్తున్నారని చెబుతోంది. ట్రంప్ ఆరోగ్యానికి ఆయన పర్సనల్ వైద్యుడు కూడా సర్టిఫికెట్ ఇస్తున్నారు. ట్రంప్ అమెరికా చరిత్రలో అత్యంత ఆరోగ్యవంతమైన అధ్యక్షుడు అని పేర్కొన్నారు. ఇటీవల నిర్వహించిన వైద్య పరీక్షల్లో అద్భుతమైన శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ట్రంప్ కలిగి ఉన్నారని వైట్ హౌస్ పేర్కొంది. అయినప్పటికీ, ట్రంప్ పబ్లిక్ ఈవెంట్స్‌లో కనిపించకపోవడం, సోషల్ మీడియా ఊహాగానాలు ఈ వివాదాన్ని రెట్టింపు చేశాయి.

ఓ పక్క సోషల్ మీడియాలో ట్రంప్ ఆరోగ్యంపై ప్రచారం జరుగుతుండగా.. ఇటు ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఓ అమెరికా వార్త సంస్తకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఈ వ్యవహారానికి మరింత ఆజ్యాం పోసాయి. అధ్యక్షుడు ట్రంప్ అద్భుతమైన ఆరోగ్యంతో, అపారమైన శక్తితో ఉన్నారని జేడీ వాన్స్ తెలిపారు. ట్రంప్ పూర్తి టర్మ్‌ను పూర్తి చేస్తారు అని చెప్పారు. అయితే, ఒకవేళ దైవం నిరాకరిస్తే ఏదైనా దుర్ఘటన జరిగితే, తాను అధ్యక్ష బాధ్యతలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. అయితే రాజకీయ విశ్లేషకులు దీనిని 2028 అధ్యక్ష ఎన్నికల కోసం వాన్స్ సన్నాహకంగా చూస్తున్నారు. ట్రంప్ రెండు హత్యాయత్నాల నుంచి తప్పించుకోవడం, 79 ఏళ్ల వయస్సు ఈ పుకార్లకు ఆజ్యం పోసాయి. వాన్స్ వ్యాఖ్యలు ట్రంప్ ఆరోగ్యంపై అనేక సందేహాలకు కారణమయ్యా.

అటు ట్రంప్ ఆరోగ్యంపై వార్తలు వినిపిస్తుండగా.. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఆరోగ్యంపై కూడా కొన్ని వార్తలు వెలుగులోకి వచ్చాయి. హాంప్టన్స్‌లో ఆయన పోర్టబుల్ డీఫిబ్రిలేటర్‌తో కనిపించిన ఫోటోలు వైరల్ అయ్యాయి. క్లింటన్‌కు 2004లో క్వాడ్రపుల్ బైపాస్ సర్జరీ, 2010లో కరోనరీ స్టెంట్స్, 2005లో ఊపిరితిత్తి సర్జరీ చేశారు. దీనికి తోడు 2021లో రక్త సంబంధిత ఇన్ఫెక్షన్‌తో ఆసుపత్రిలో చేరడం వంటి మెడికల్ హిస్టరీ ఉంది. ఈ తాజా ఫోటోలు ఆయన గుండె సమస్యల కొనసాగింపును సూచిస్తున్నాయి. హిల్లరీ క్లింటన్ కూడా మెడికల్ బ్యాగ్‌తో కనిపించడం ఈ ఊహాగానాలను మరింత పెంచింది. Trump health news.

నాయకుల ఆరోగ్యంపై పుకార్లు ఎందుకు?
ప్రపంచ నాయకుల ఆరోగ్యంపై పుకార్లు రాజకీయ, ఆర్థిక, సామాజిక ప్రభావం కారణంగా తరచూ వస్తాయి. నాయకుడి ఆరోగ్యం దేశ రాజకీయ స్థిరత్వం, అంతర్జాతీయ సంబంధాలు, ఆర్థిక మార్కెట్లపై ప్రభావం చూపుతుంది. ఉదాహరణకు, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోగ్యంపై గత కొన్నేళ్లుగా ఊహాగానాలు ఉన్నాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పుతిన్ త్వరలో చనిపోతాడు అని పేర్కొన్నారు. బైడెన్ వయస్సు, ఆరోగ్య సమస్యలు 2024 ఎన్నికల నుంచి ఆయన వైదొలగడానికి కారణమయ్యాయి. భారత్‌లో నవీన్ పట్నాయక్ ఆరోగ్యంపై వీడియోలు 2024 ఒడిశా ఎన్నికల్లో ప్రభావం చూపాయి.

Join with us: https://whatsapp.com/channel/0029VarK7kPHAdNW7c2XLY2q