
Modi Trump Phone Call: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పై విధించిన సుంకాల విషయంలో ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతోంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు ఈ సుంకాలు విధిస్తున్నామని ట్రంప్ చెబుతున్నారు… అలాంటప్పుడు రష్యా నుంచి భారత్ కంటే ఎక్కువగా చమురు కొనుగోలు చేస్తున్న చైనాను ఎందుకు వదిలేసినట్టు..? అసలు ట్రంప్ భారత్ పైనే ఎందుకు కన్నేశారు..? నిజంగా ట్రంప్ సుంకాల వెనుక.. రష్యా అంశం ఉందా..? లేక ట్రంప్ మనస్సులో ఏదో పెట్టుకుని ఇలాంటి సంకాలు విధిస్తున్నారా..? ట్రంప్ సుంకాలను తట్టుకుని భారత్ నిలబడటంపై ప్రపంచ దేశాలు ఎలా చూస్తున్నాయి…? ట్రంప్ కు సొంత దేశంలోనే వ్యతిరేకత ఎందుకు వ్యక్తమవుతోంది..? భారత్ అమెరికాకు పోస్టల్ సేవలను ఎందుకు నిలిపివేసింది..? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే చూడాల్సిందే..
ఓ పక్క సుంకాలు బాదుడు.. మరోపక్క ఎన్నో ప్రశ్నలు. అసలు ట్రంప్ భారత్ పై ఎందుకు పగబట్టారనే ప్రశ్న ప్రతీ ఒక్కర్ని తొలిచివేస్తోంది. ఒక్కొక్కరూ ఒక్కో కారణం చెబుతున్నారు. అయితే రష్యా నుంచి చమురు కొనుగోలు చేసి భారత్.. ఉక్రెయిన్ యుద్ధానికి సహాయం చేస్తోందని ప్రధానంగా ట్రంప్ వాదన. అయితే భారత్ కంటే ఎక్కువ చమురు కొనుగోలు చేస్తున్న చైనాను ఎందుకు వదిలేసినట్టు.. అంటే ట్రంప్ భారత్ పై ప్రత్యేకంగా పగబట్టి.. టార్గెట్ చేసినట్టు ఈ సుంకాలు విధిస్తున్నారా..? అంటే అవుననే మాటే వినిపిస్తోంది. దీనికి చాలా మంది అమెరికన్ విశ్లేషకులు కూడా కారణాలు చెబుతున్నారు. ట్రంప్ దేశ ప్రయోగజనాల కంటే తన వ్యక్తిగత పగ తీర్చుకోవడం కోసమే భారత్ పై సుంకాలు విధించారని అంటున్నారు. ట్రంప్, మోదీ మధ్య స్నేహం ఒక్కప్పుడు చాలా గొప్పగా ఉండేది. కాని ఒక ఫోన్ కాల్ వారి మధ్య దూరాన్ని పెంచింది. అదే భారత్ పై సుంకాలు పెంచడానికి కారణమైంది..
ట్రంప్ మొదటి నుంచి నోబల్ శాంతి బహుమతి కోసం తహతహలాడుతున్నారు. పలు దేశాలు తనను నోబల్ కు నామినేట్ చేయాలని కోరుకుంటున్నారు. అంతే కాదు పలు దేశాల మధ్య యుద్ధాన్ని తానే అపానని ట్రంప్ చెప్పుకుంటున్నారు. ఇలానే భారత్, పాకిస్థాన్ మధ్య తానే యుద్ధాన్ని ఆపానని ట్రంప్ ప్రచారం చేసుకున్నారు. ఈ ప్రచారానికి ఊతమిస్తూ పాకిస్థాన్ కూడా ట్రంప్ కు వంతపాడింది. అయితే మోదీ విషయంలో ట్రంప్ ఆటలు చెల్లలేదు. భారత్, పాకిస్థాన్ ఘర్షణలు ఆగిపోయిన తర్వాత.. మోదీకి ఫోన్ చేసిన ట్రంప్ .. శాంతి తానే కారణమని.. తనను నోబల్ బహుమతికి నామినేట్ చేయాలని కోరారు. అయితే దీనికి మోదీ అంగీకరించలేదు. దీనికి కారణం .. ఒకవేళ మోదీ ట్రంప్ ను నోబల్ బహుమతికి నామినేట్ చేస్తే.. పాకిస్థాన్ , భారత్ మధ్య శాంతి ఒప్పందానికి ట్రంప్ కారణమైనట్టు అంగీకరించాలి.. అయితే మోదీ మాత్రం.. పాకిస్థాన్, భారత్ మధ్య మూడో దేశం జోక్యం లేకుండానే కాల్పుల విరమణ జరిగిందని ప్రకటించారు. ఇప్పుడు ట్రంప్ కు మద్దతు పలికితే ఆ మాటకు విరుద్ధంగా ప్రవర్తించినట్టు అవుతుంది. ఇది దేశ వ్యాప్తంగా మోదీకి చెడ్డపేరు తెస్తుంది. దీంతో మోదీ ట్రంప్ రిక్వెస్ట్ కు ససేమిరా అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోను ట్రంప్ ప్రతిపాదనకు అంగీకరించనని మోదీ చెప్పినట్టు అమెరికాలోని ఓ వార్త పత్రిక ప్రచురించింది. అయితే ఇది మనస్సులో పెట్టుకుని ట్రంప్ భారత్ పై సుంకాలతో పగ తీర్చుకుంటున్నారని తన కథనంలో తెలిపింది. అయితే 50 శాతం సుంకాలతో తగ్గని ట్రంప్ ఐరోపా దేశాలను కూడా భారత్ పై ఉసిగొలిపేందుకు ప్రయత్నిస్తున్నారు. భారత్ పై డబుల్ టారిఫ్ లు విధించాలని ట్రంప్ కోరుతున్నారంటే .. ఎంత కక్ష కట్టారో అర్థం చేసుకోవచ్చు.
అయితే రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తోందని గగ్గోలు పెడుతున్న ట్రంప్.. ఉక్రెయిన్ కు భారత్ సరఫరా చేస్తున్న చమురు విషయంలో మాత్రం నోరు మెదపడం లేదు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ, ఉక్రెయిన్ పై పోరాడేందుకు అవససరమైన డబ్బును ఆ దేశానికి అందిస్తోందని ట్రంప్ మొదటి నుంచి వాదిస్తున్నారు. అయితే భారత్ ఒకవైపు రష్యా నుంచి భారీగా ముడి చమురును కొనుగోలు చేస్తూనే, మరోవైపు అదే చమురును శుద్ధి చేసి యుద్ధంతో సతమతమవుతున్న ఉక్రెయిన్‌కు డీజిల్ సరఫరా చేస్తోంది. అమెరికాలోని కొందరు విమర్శిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థకు, సైనిక అవసరాలకు భారత ఇంధనమే కీలకంగా మారింది. ఉక్రెయిన్‌కు చెందిన చమురు మార్కెట్ విశ్లేషణ సంస్థ నాఫ్టోరైనోక్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, 2025 జులై నెలలో ఉక్రెయిన్‌కు అత్యధికంగా డీజిల్ సరఫరా చేసిన దేశంగా భారత్ మొదటి స్థానంలో నిలిచింది. ఆ నెలలో ఉక్రెయిన్ వినియోగించిన మొత్తం డీజిల్‌లో 15.5 శాతం వాటా భారత్‌దే కావడం గమనార్హం. సగటున రోజుకు 2,700 టన్నుల డీజిల్‌ను భారత్ నుంచి ఉక్రెయిన్ దిగుమతి చేసుకుంది. ఈ ఏడాది జనవరి నుంచి జులై వరకు ఉక్రెయిన్‌కు భారత డీజిల్ ఎగుమతులు 10.2 శాతానికి పెరిగాయి. 2024లో ఇదే కాలంలో ఇది కేవలం 1.9 శాతంగా మాత్రమే ఉంది. యుద్ధం కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న ఉక్రెయిన్ నగరాలు, రవాణా వ్యవస్థ, యుద్ధ క్షేత్రాలు నడవడానికి ఈ ఇంధన సరఫరా అత్యంత కీలకంగా మారింది. అయితే ట్రంప్, వైట్ హౌస్ లోని కొందరు.. రష్యా నుంచి చమురు కొనడం ద్వారా భారత్ యుద్ధాన్ని పరోక్షంగా ప్రోత్సహిస్తోందని ఆరోపణలు చేస్తున్నారు. కానీ, అదే రష్యా చమురుతో నడుస్తున్న ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థ వాస్తవ పరిస్థితిని స్పష్టం చేస్తోంది.
అడ్డదిడ్డంగా.. ఇష్టానుసారంగా ట్రంప్ భారత్ పై సుంకాలు విధించడంపై అమెరికాలోని చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. ట్రంప్ చేస్తోందని తప్పు అని చెబుతున్నారు. అమెరికా అడ్డగోలుగా సుంకాలు విధించడాన్ని ఆ దేశ ఆర్థికవేత్త రిచర్డ్ వూల్ఫ్ తప్పుబట్టారు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న భారత్ అతి పెద్ద మార్కెట్ అని.. అలాంటి దేశంతో అమెరికా తీరు ఏనుగును ఎలుక ఢీకొట్టినట్టేనని వ్యాఖ్యానించారు. భారత్ విషయంలో అమెరికా చాలా కఠినంగా ఉన్నట్టు వ్యవహరిస్తోందని అన్నారు. భారత్‌వైపు తుపాకీ గురిపెట్టానని అనుకుంటూ.. తన కాలిని తానే కాల్చుకుంటోందని… ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో రష్యాపై పశ్చిమదేశాలు ఆంక్షలు విధిస్తే.. రష్యా కొత్త మార్కెట్లను వెతుక్కుందని తెలిపారు. ఇప్పుడు అమెరికా సుంకాలతో భారత సరుకులను అడ్డుకుంటే.. భారత్ ఆ సరుకులను బ్రిక్స్ కూటమికి అమ్ముకుంటుందని… దీనితో బ్రిక్స్ కూటమి బలోపేతం అవుతుందని తెలిపారు.. పశ్చిమ దేశాలకు ఆర్థిక ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందని అమెరికా ఆర్థికవేత్త తెలిపారు. భారత్‌పై అడ్డగోలు సుంకాలతో ఒక రకంగా బ్రిక్స్ కూటమిని అమెరికాయే బలోపేతం చేస్తోంది అని రిచర్డ్ వూల్ఫ్‌పేర్కొన్నారు. Modi Trump Phone Call.
అటు. ప్రతీకార సుంకాలతో విరుచుకుపడుతున్న అమెరికాపై భారత్ సహా పలు దేశాలు పోస్టల్ సర్వీసులు నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత తపాలాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా కస్టమ్స్ విభాగం జారీ చేసిన కొత్త నిబంధనల్లో స్పష్టత లేకపోవడంతో అన్ని రకాల పోస్టల్ సేవలను నిలిపివేస్తున్నట్లు ఇండియా పోస్ట్ వెల్లడించింది. 100 డాలర్ల వరకూ విలువవున్న బహుమతులు, లేఖలు, డాక్యుమెంట్ల సేవలు యథాతథంగా కొనసాగుతాయని ఇటీవల ప్రకటించగా.. తాజాగా అవి కూడా నిలిచిపోనున్నాయి. పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని, సాధ్యమైనంత త్వరగా వీటిని పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే బుకింగ్ చేసిన పార్శిళ్లు చేరని పక్షంలో.. పోస్టల్ ఛార్జీలను కస్టమర్లకు తిరిగి చెల్లిస్తామని వెల్లడించింది.
Join with us: https://whatsapp.com/channel/0029VarK7kPHAdNW7c2XLY2q