
Kaleshwaram project: కాళేశ్వరం ప్రాజెక్ట్ అవకతవకలపై సీబీఐ విచారణ.. అసెంబ్లీలో సీఎం రేవంత్ సంచలన ప్రకటన కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై సంచలన నిర్ణయం తీసుకుంది తెలంగాణ సర్కార్. అయితే కాళేశ్వరం కేసును సీబీఐకు అప్పగిస్తున్నట్టు సీఎం రేవంత్ అసెంబ్లీలో సంచలన ప్రకటన చేశారు. దర్యాప్తుకు సభ ఏకగ్రీవంగా నిర్ణయించింది. నిజాయితీతో విచారణ జరగాలని ఆశిస్తున్నట్టు సీఎం రేవంత్ అన్నారు.
కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించడమే సముచితం అన్నారు రేవంత్. కాళేశ్వరం పేరుతో దోచుకున్నవాళ్లందరికీ శిక్షపడాలన్నారు. నిజాయితీగా నిష్పక్షపాతంగా విచారణ జరగాలనే కాళేశ్వరం కేసును సీబీఐకి ఇస్తున్నట్టు ప్రకటించారు సీఎం. జస్టిస్ పీసీ కమిషన్.. అలాగే NDSA, ఇతర ఏజెన్సీలు.. క్రిమినల్ చర్యలకు అర్హమైన అనేక లోపాలు, అవకతవకలను గుర్తించినందువల్లే కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్టు చెప్పారు.
మూడు బ్యారేజీల నిర్మాణంలో తప్పు జరిగిందని, అసలు ప్లానింగే లేదని కమిషన్ తన నివేదికలో తేల్చిచెప్పిందన్నారు. మేడిగడ్డ కుంగడానికి ప్లానింగ్, డిజైన్, నాణ్యత నిర్వహణా లోపాలే కారణమని NDSA గుర్తించిందన్నారు. వీటిన్నింటిపై మరింత లోతుగా, సమగ్రంగా దర్యాప్తు చేయాల్సిన అవసరముందని కమిషన్ సూచించడంతోనే కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్టు ప్రకటించారు సీఎం. Kaleshwaram project.
కాళేశ్వరం ప్రాజెక్టులో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, అంతర్రాష్ట్ర సంస్థలు కూడా భాగస్వామ్యం అయ్యాయి. వ్యాప్కోస్ వంటి సెంట్రల్ పీఎస్యూలు, పీఎఫ్‌సీ, ఆర్‌ఈసీ వంటి ఆర్థిక సంస్థలు డిజైన్, నిర్మాణం, ఫైనాన్సింగ్‌లో పాల్గొన్నందునే ఈ కేసును సీబీఐకి అప్పగించడం సముచితమని ప్రభుత్వం భావించింది.
Join with us: https://whatsapp.com/channel/0029VarK7kPHAdNW7c2XLY2q