
Dr Sanjay Kumar Politics: డాక్టర్ వృత్తి లో ప్రజలకు సేవలు చేసుకునే తాను రాజకీయాలకు రావడంతో సీనియర్ నాయకులను ఓడించి కుర్చీలో కూర్చున్నారు. తన నియోజకవర్గంలో అభివృద్ధిబాటలో నడిపించే ప్రయత్నం చేశారు. ఇంతకు అతను ఎవరు ఆ నియోజకవర్గం ఎక్కడ ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల నియోజవర్గం. ఈ నియోజకవర్గంలో కరుడుగట్టిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి ఒకరు. గతంలో మంత్రిగా చేసిన తాను నియోజకవర్గానికి అభివృద్ధి చేయలేకపోయాడని 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జీవన్ రెడ్డిని ప్రజలు ఓడించారు. మరోపక్క గతంలో టిడిపి నుండి జగిత్యాల నియోజకవర్గంలో ఎల్. రమణ మంచి పట్టు సాధించినప్పటికీ తనకు కూడా అప్పట్లో నియోజకవర్గ ప్రజలు అవకాశం ఇచ్చినప్పటికీ తాను కూడా జగిత్యాలను అభివృద్ధి చేయలేకపోయారు. ఇలా ఇటు కాంగ్రెస్ పార్టీ తరపున జీవన్ రెడ్డి ఉండగా అప్పటి టిడిపిలో ఉన్న ఎల్ రమణకు ఇద్దరి మధ్య పోటీ తత్వం ఉండేది.
అయితే బిజెపి పార్టీ నుండి వీరికి దీటైన నాయకుడు లేకపోవడంతో బిజెపి మూడో స్థానంలోనే కొనసాగడంతో, క్యాడర్ కూడా పెంచుకోలేని పరిస్థితి ఎదురైంది. ఓటు బ్యాంకును పెంచుకునే ప్రయత్నం అప్పటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎంపీగా విద్యాసాగర్ రావు కొనసాగించిన, అప్పుడు ఆ సమయంలో స్థానిక ఎన్నికలు రావడంతో బిజెపి పట్టు పెరిగిందని అనుకున్నారు. కానీ అప్పటి టి ఆర్ ఎస్ ఇప్పుటి బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్రంలో తెలంగాణ పోరాటం పై పార్టీ పట్టు సాధించడంతో తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన పార్టీగా జగిత్యాల నియోజకవర్గ ప్రజల్లోకి రావడంతో ప్రజల్లో తెలంగాణ కోసం పోరాడి తెచ్చిన పార్టీ ప్రజల్లో ముద్ర వేసుకుంది. కనుక అప్పటి స్థానిక సంస్థలైన సర్పంచుల ఎన్నికల్లో అప్పటి టీ ఆర్ ఎస్ ఇప్పటి బి ఆర్ ఎస్ పార్టీ మద్దతు తెలిపిన వారు అధిక సంఖ్యలో గెలవడంతో అప్పటినుండి బి ఆర్ ఎస్ పుంజుకోవడం మొదలుపెట్టింది.
ఏదైతే 2018 ఎన్నికల సమయానికి ముందే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు సిద్ధమైనప్పటికీ తెలంగాణ ప్రజలు అప్పటి టి ఆర్ ఎస్ ఇప్పుటి బి ఆర్ ఎస్ పార్టీకి పటం కట్టారు. జగిత్యాల నియోజకవర్గంలోని ప్రజల తీర్పును ఊహించలేదు కాంగ్రెస్ బిజెపి పార్టీలు. బి ఆర్ ఎస్ పార్టీకి జగిత్యాల నియోజవర్గంలో సరైన నాయకుడు లేకపోవడంతో అప్పట్లో ఆ నియోజకవర్గానికి కల్వకుంట్ల కవిత పోటీ చేద్దాం అనుకున్నారు. కానీ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆలోచించి స్థానికుడైన డాక్టర్ వృత్తులో కొనసాగుతున్న తాను స్వచ్ఛంద సేవ కార్యక్రమంలో చురుకుగా పాల్గొంటున్న సంజయ్ కి ఛాన్స్ ఇవ్వడంతో 2018లో పోటీ చేశారు. గతంలో మంత్రిగా చేసిన జీవన్ రెడ్డి తోపాటు బిజెపి పార్టీ నుండి రవీందర్ రెడ్డి, డాక్టర్ సంజయ్ తో పోటీపడ్డారు. గతంలో మంత్రిగా పనిచేసిన జీవన్ రెడ్డికి జగిత్యాలలో మంచి పట్టు ఉన్నప్పటికీ, అప్పటికే కేంద్రంలో బిజెపి జెండా ఎగురుతుంది. కానీ ఈ రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులు డాక్టర్ సంజయ్ ముందు ఓడిపోవడంతో బి ఆర్ ఎస్ పార్టీకి ఓటు బ్యాంకు వచ్చి చేరింది.
తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా జగిత్యాల నియోజకవర్గం ఎమ్మెల్యేగా కొనసాగిన తాను ఐదు సంవత్సరాలు జగిత్యాల నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా అభివృద్ధి కార్యక్రమాలను చేయడం ప్రారంభించారు. కానీ జగిత్యాల నియోజకవర్గంలో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయలేకపోయారని ప్రజలు అనుకుంటున్నారు. ఇదిలా ఉండగా తాను ఎమ్మెల్యేగా కొనసాగుతున్న జగిత్యాల నియోజకవర్గంలోని మున్సిపాలిటీ చైర్మన్ పీఠం పై భోగ శ్రావణి కొనసాగిన తాను నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి పనుల శంకుస్థాపనలకు, ఎమ్మెల్యేగా కొనసాగుతున్న సంజయ్ ని, పిలువకపోవడంతో అప్పట్లో వీరిద్దరి మధ్య మాటల యుద్ధమే జరిగింది.
సంజయ్ కి బీఆర్ఎస్ పార్టీ తరపున తనకు పోటీగా వస్తుందేమోనని అనుకొని తాను చక్రం తిప్పడంతో చైర్మన్ గా కొనసాగుతున్న భోగ శ్రావణి ని సొంత పార్టీలో ఉక్కిరి బిక్కిరి చేశాడని అంటున్నారు నియోజవర్గం టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు. చివరికి ఎమ్మెల్యే తనను అభివృద్ధి పనుల శంకుస్థాపనలకు పిలువకపోవడంతో , పార్టీ కార్యాక్రమాలకు రానివ్వకపోవడంతో భోగ శ్రావణి బి ఆర్ ఎస్ పార్టీకి తన పదవికి రజీనామా చేసి బీజేపీ పార్టీ లోని బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో పార్టీ కండువ కప్పుకున్నారు. ఇక తాను పార్టీ లో చేరడంతో జగిత్యాల లో బీజేపీ క్యాడర్ పెంచుకోవడం మొదలు పెట్టింది.
భోగ శ్రావణి 2023లో బిజెపి పార్టీ నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన తాను జగిత్యాల నియోజవర్గంలో ఎమ్మెల్యేగా కొనసాగుతున్న డాక్టర్ సంజయ్ ని ఓడిస్తుందని అనుకున్నారు అందరు. కానీ తాను ఓడించలేక పోయింది. చివరకు తాను మూడో స్థానంలోనే ఉండి పోవలసి వచ్చింది. జగిత్యాల ప్రజలు మాత్రం నియోజకవర్గంను అభివృద్ధిబాటలో నడిపిస్తాడేమోనని అనుకొని రెండో సారి అవకాశం ఇచ్చారు. కాని ప్రభుత్వం రాలేకపోవడంతో బి ఆర్ ఎస్ కు రాజీనామా చేశారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని బీఆర్ఎస్ పార్టీకి గట్టి దెబ్బే కొట్టారు. దీంతో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సరైన నాయకులు లేకపోవడంతో పెద్ద తలనొప్పిగా మారింది.
ఇక జగిత్యాల నియోజకవర్గం బి ఆర్ ఎస్ పార్టీని నడిపించేది ఎవరని కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు. డాక్టర్. సంజయ్ కాంగ్రెస్ పార్టీ కాండువా కప్పుకున్న తాను మొన్న చొప్పదండి నియోజకవర్గం లో జరిగిన జానహిత పాదయాత్ర లో పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ని పాదయాత్ర లో కలవడానికి ప్రయత్నం చేశారు. కానీ తనని దగ్గరికి రానివ్వకుండా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నెట్టేశారు. చివరకు తాను ఏమి చేయలేని పరిస్థితిలో ఎమ్మెల్యే సంజయ్ పాదయాత్రలో పాల్గొనలేక అక్కడి నుండి వెనుతిరిగి వెళ్లిపోయారు. Dr Sanjay Kumar Politics.
చివరకు సంజయ్ కి కాంగ్రెస్ పార్టీలో అవకాశం ఉంటుందా లేక ఇంతటితో తన రాజకీయం ఆగిపోతుందా? ఇటు బిఆర్ఎస్ పార్టీలో కొనసాగలేక అటు కాంగ్రెస్ పార్టీ నాయకుల వర్గపోరులో నెగ్గలేక చివరికి సంజయ్ పరిస్థితి ఏమవుతుందో వేచి చూడాల్సిందే మరి.
Join with us: https://whatsapp.com/channel/0029VarK7kPHAdNW7c2XLY2q