రీరిలీజ్‌కు సిద్ధమైన ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’.. ఎప్పుడంటే..

Avatar: The Way of Water అవతార్: ఫైర్ అండ్ యాష్ కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ముందే ఒక ప్రత్యేక గిఫ్ట్‌తో 20th Century Studios వచ్చింది. జేమ్స్ కామెరూన్ మాస్టర్‌పీస్ అవతార్: ది వే ఆఫ్ వాటర్ అక్టోబర్ 2న థియేటర్స్‌లో ఒక వారం పాటు 3D లో రీ-రిలీజ్ కానుంది. ఈ విజువల్ స్పెక్టాక్యులర్ మూవీ మొదటిసారి 2022 డిసెంబర్‌లో విడుదలై, అప్పటినుంచి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన హాలీవుడ్ సినిమా అనే రికార్డుతో పాటు, ఆస్కార్ అవార్డు (బెస్ట్ అచీవ్‌మెంట్ ఇన్ విజువల్ ఎఫెక్ట్స్) కూడా గెలుచుకుంది.

ఈ సినిమాలో సామ్ వర్తింగ్టన్, జోయి సాల్డానా ప్రధాన పాత్రల్లో నటించగా, సిగోర్నీ వీవర్, కేట్ విన్స్‌లెట్, స్టీఫెన్ లాంగ్ కూడా కీలక పాత్రల్లో కనిపించారు. అవతార్: ది వే ఆఫ్ వాటర్ మళ్లీ 3Dలో చూడటం ద్వారా, పాండోరా అద్భుతమైన అండర్‌వాటర్ లోకాలు, సల్లీ ఫ్యామిలీ హృదయానికి హత్తుకునే కథను పెద్ద తెరపై తిరిగి అనుభవించే అవకాశముంది. “ఈ అవకాశం మిస్ అవ్వకండి. మీరు ముందే ఈ మంత్ర ముగ్ధమైన లోకాన్ని చూసినా, లేదా మొదటిసారి చూడబోతున్నా – ఇది మర్చిపోలేని సినిమా అనుభవం అవుతుంది” అని 20th Century Studios ఇండియా ప్రతినిధులు తెలిపారు. Avatar: The Way of Water