శ్రీవారి సేవ చేసేందుకు భక్తులకు గోల్డెన్ ఛాన్స్.!

TTD key decision: టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి సేవకుల పరిధిని పెంచాలని డిసైడ్ అయింది. శ్రీవారి సేవ కోసం వస్తున్న వారి సేవలను తిరుమల పరిధిలోని ఆస్పత్రుల్లోనూ విస్తరించనున్నట్లు ప్రకటించారు. సేవ చేయాలనుకునే వారికి శ్రీవారి సేవ ట్రైనర్ పేరుతో మూడు రోజుల శిక్షణ ఇవ్వనున్నారు. ఎన్నారై భక్తులు శ్రీవారి సేవకులుగా పని చేస్తామని వస్తున్నారని.. వారి సేవలను వినియోగించుకుంటామని ఛైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు.

అయితే ఈ సేవ చేయటానికి వచ్చే భక్తులకు కనీసం డిగ్రీ అర్హతగా ఉంటుందని చెప్పారు. సేవలకు శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేకంగా కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. తిరుపతిలోని స్విమ్స్, బర్డ్ ఆస్పత్రుల్లోనూ వారి సేవలను వినియోగించుకుంటామన్నారు. ఇప్పటికే సూపర్ వైజర్స్ శ్రీవారి సేవకుల విధులను పర్యవేక్షిస్తు న్నారని… పెద్ద సంఖ్యలో కొత్త వారు సైతం ముందుకు వస్తున్నారని వివరించారు.

సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు శ్రీవారి సేవలో మార్పులు తీసుకొస్తున్నామని తెలిపారు. 2000 సంవత్సరంలో ప్రారంభమైన ఈ సేవ ద్వారా ఇప్పటివరకు 17 లక్షల మంది వాలంటీర్లు పాల్గొన్నారని, ప్రస్తుతం రోజుకు 3,500 మంది వివిధ విభాగాల్లో సేవలందిస్తున్నారని గుర్తుచేశారు. ఇకపై శ్రీవారి సేవకులకు, గ్రూప్ సూపర్‌వైజర్లకు నిరంతరం శిక్షణ ఇచ్చేందుకు టీటీడీ వెబ్‌సైట్‌లో ‘ట్రైనర్ మాడ్యూల్’ను అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు. ఈ మాడ్యూల్ రూపకల్పనలో ఐఐఎం (అహ్మదాబాద్), డైరెక్టర్ ఆఫ్ ప్లానింగ్ ఆఫ్ గవర్నమెంట్ పాలుపంచుకున్నాయని ఆయన పేర్కొన్నారు. TTD key decision.

తిరుమలలో ఆలయంతో పాటుగా భక్తుల కోసం వీరి సేవలను వినియోగిస్తామని ఈవో శ్యామల రావు చెప్పారు. ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాలకు శిక్షణ తీసుకున్న వారి సేవలను వినియోగిస్తామని వివరించారు. సూపర్ వైజర్స్ కు మరింతగా శిక్షణ ఇచ్చి శ్రీవారి సేవకుల బాధ్యతలు అప్పగిస్తామన్నారు. ఎన్నారైలు శ్రీవారి సేవలకులుగా పని చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని..వారి సేవలను వినియోగించుకుంటామని చెప్పారు. అదే విధంగా తిరుమలలో బిగ్ క్యాంటీన్లు.. జనతా క్యాంటీన్లను టెండర్లు పిలుస్తామని వెల్లడించారు. భక్తులకు మరింత రుచికరమైన ఆహారం అందించాలని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. గతంలో క్యాంటీన్ల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరించటంతో భక్తులు ఇబ్బందులు పడ్డారని.. ఇప్పుడు వీటి ద్వారా మరింత మెరుగ్గా నిర్వహణ ఉంటుందని పేర్కొన్నారు.

Join with us: https://whatsapp.com/channel/0029VarK7kPHAdNW7c2XLY2q