ఆ రైల్వే స్టేషన్ కు మహర్దశ.!

Mahabubabad Railway Station: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అమృత్ భారత్ పథకంతో దేశంలో రైల్వే స్టేషన్ల రూపురేఖలు మారిపోతున్నాయి. కొన్ని రైల్వేస్టేషన్ల అభివృద్ధి చూస్తే ఇది రైల్వేస్టేషనా, లేక విమానాశ్రయమా అనే తరహాలో అప్‌గ్రేడ్ చేస్తున్నారు. అందుకోసం కొన్ని రోజులపాటు రైల్వేస్టేషన్లకు కొన్ని రైళ్లను దారిమళ్లించడం లాంటివి చేశారు. తెలంగాణలో సికింద్రాబాద్, బేగంపేట, కరీంనగర్, మహబూబాబ్ రైల్వే స్టేషన్లను అమృత్‌భారత్‌ పథకం కింద కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది.

ఈ క్రమంలో మహబూబాబాద్ రైల్వే స్టేషన్ పనులు చివరిదశకు చేరుకున్నాయి. త్వరలోనే ఈ స్టేషన్ ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. మహబూబాబాద్ రైల్వే స్టేషన్ పునరుద్ధరణ పనులు దాదాపు పూర్తయ్యాయని.. ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 26.49 కోట్లు ఖర్చు చేసిందని.. పనులు 92 శాతం పూర్తయ్యాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ స్టేషన్ త్వరలో అత్యాధునిక సౌకర్యాలతో ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుందన్నారు. ఈ మేరకు స్టేషన్ లో కొత్తగా నిర్మించిన స్టేషన్ భవనం, వేచి ఉండే గదుల నిర్మాణాలు. ఇతర భవనాల చిత్రాలను ఎక్స్ లో పోస్టు చేశారు. తెలంగాణలో రైల్వే సదుపాయాల కల్పనకు కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అందుకు తగిన నిధులు అందించి రైల్వే స్టేషన్ల అప్‌గ్రేడేషన్ చేస్తున్నట్లు కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

ఓవరాల్ గా చూస్తే 92 శాతం మేర పని పూర్తయిందని, అత్యాధునిక సౌకర్యాలతో సిద్ధమవుతోందన్నారు. మహబూబాబాద్ రైల్వేస్టేషన్ ఫొటోల్ని కిషన్ రెడ్డి విడుదల చేశారు. తెలంగాణలో రైల్వే సదుపాయాల కల్పనకు కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం కృషి చేస్తుందని, అందుకు తగిన నిధులు అందించి రైల్వే స్టేషన్ల అప్‌గ్రేడేషన్ చేస్తున్నట్లు కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

దేశంలోని రైల్వేస్టేషన్లను ఆధునీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన దీర్ఘకాలిక ప్రణాళికనే ఈ ‘అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్’ అని చెప్పవదచ్చు. ఈ పథకం కింద దేశంలోని కొన్ని రైల్వేస్టేషన్లను ఎంపిక చేసి దశలవారీగా ఒక్కో స్టేషన్‌కు ప్రత్యేక ప్రణాళికలు తయారు చేసి, పునరాభివృద్ధి పనులు చేపడుతున్నారు. గతంలో కంటే రైల్వేస్టేషన్లను మరింత అందంగా, పరిశుభ్రంగా, సౌకర్యవంతంగా ఉండేలా మార్చడమే దీని లక్ష్యం.

రైల్వే స్టేషన్‌లోకి ప్రవేశం (Entry), నిష్క్రమణ మార్గాల (Exit) మెరుగుదల, విశాలమైన వెయిటింగ్ హాళ్లు, పరిశుభ్రమైన ప్లాట్‌ఫారమ్‌లు, మరుగుదొడ్లు, రైల్వేస్టేషన్ పైకప్పులు వంటివి పునరుద్ధరిస్తారు.రైల్వే స్టేషన్లకు దగ్గర్లో ఉన్న నగరాలను కలుపుతూ స్టేషన్ బిల్డింగ్ అప్‌గ్రేడ్ చేస్తారు. ఈ రైల్వేస్టేషన్లను బస్సులు, ఇతర రవాణా వ్యవస్థలతో అనుసంధానం చేస్తారు. అవసరమైన చోట లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు ఏర్పాటు చేస్తారు. ఉచిత వై-ఫై సదుపాయం, మెరుగైన సమాచార వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నారు. అవసరమైన రైల్వే స్టేషన్లలో ఎగ్జిక్యూటివ్ లాంజ్‌లు, బిజినెస్ మీటింగ్స్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. Mahabubabad Railway Station.

ఒక స్టేషన్ ఒక ఉత్పత్తి పథకం కింద స్థానిక ఉత్పత్తులను విక్రయించడానికి వీలు కల్పించారు. ఫుడ్ కోర్టులు, ఆట స్థలాలు వంటివి ఏర్పాటు చేస్తారు. స్టేషన్ సమీపంలో రోడ్లను వెడల్పు చేయడం, అవసరం లేని నిర్మాణాలు ఉంటే తొలగించడం, ప్రత్యేక పాదచారుల మార్గాలు (Walkers Root), మెరుగైన పార్కింగ్, బెస్ట్ లైటింగ్ సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇక అందుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బ్రెయిలీ సంకేతాలు, స్పర్శతో గుర్తించదగిన మార్గాలు, లిఫ్ట్‌లు, ర్యాంప్‌లు వంటి సదుపాయాలతో దివ్యాంగులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నారు.

Join with us: https://whatsapp.com/channel/0029VarK7kPHAdNW7c2XLY2q