‘ఓజీ’ షాకింగ్ న్యూస్.. పవన్ కల్యాణ్ డ్యూయెల్ రోల్..!!

Pawan kalyan dual role: టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీ ఓజీ మరో 20 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ తో సినిమాకి రావాల్సిన దానికంటే ఎక్కువ బజ్ వచ్చింది. ఈ బజ్ ను మరింత పెంచుతూ ఓజి లో పవన్ చేస్తున్న రోల్ పై ఇంట్రెస్టింగ్ రూమర్ ఒకటి ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ఓజి లో పవర్ స్టార్ ఫ్యాన్స్ కి ఓ ఊహించని సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారట డైరెక్టర్ సుజీత్. రేపు సినిమా రిలీజ్ తర్వాత థియేటర్స్ లో ఆ సర్ప్రైజ్ చూసి ఆడియన్స్ షాక్ అవ్వడం గ్యారెంటీ అని చెబుతున్నారు. ఇంతకీ ఆ సర్ప్రైజ్ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే లేట్ చేయకుండా ఈ స్టోరీ చూసేయండి..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజి సినిమా ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ గ్యాంగ్ స్టార్ యాక్షన్ థ్రిల్లర్ లో పవన్ డబుల్ రోల్ లో కనిపించబోతున్నారని టాక్స్ వినిపిస్తున్నాయి. పవన్ ఇప్పటివరకు తన కెరీర్లో డబుల్ రోల్ చేయలేదు. కానీ ఈ సినిమాతో ఆయన తన అభిమానులకు ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారట. ఓజీ లోపవన్ చేస్తున్న చేస్తున్న డబల్ రోల్స్ చాలా పవర్ఫుల్ గా ఉంటాయని.. అందులో ఒక పాత్రలో గ్యాంగ్స్టర్ ఓజెస్ గంభీరంగా.. మరొకటి ఊహించని ట్విస్ట్ తో కనిపిస్తుందని అంటున్నారు.

పవర్ స్టార్ డబుల్ రోల్ విషయంలో ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినా.. సినిమా యూనిట్ నుంచి వస్తున్న లీక్స్ ఈ గాసప్ కు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. రెండు పాత్రలలో పవన్ వైవిధ్యమైన నటన కనబరుస్తారని.. ఒక పవర్ ఫుల్ గ్యాంగ్ స్టార్ గా మరొకటి ఎమోషనల్ డెప్త్ తో గా సాగే పాత్రగా ఉంటుందని అంటున్నారు. తమన్ సంగీతం తమన్ సంగీతం రవికే చంద్రన్ సినిమాటోగ్రఫీతో ఈ సినిమా విజువల్ గా కూడా గ్రాండ్ గా ఉంటుందని పవన్ డబుల్ రోల్ ఈ చిత్రాన్ని మరో స్థాయికి తీసుకెళ్తుందని టాలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. Pawan kalyan dual role.

ఈ విషయం ఫ్యాన్స్ లో హైప్ ని మరింత హైప్ పెంచేస్తోంది. రీసెంట్ గా ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన ప్రతి కంటెంట్ సినిమాపై అంచనాలను ఆకాశాన్ని తాకేలా చేసింది. ఇప్పుడు రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్ది పవన్ కొద్ది హైప్ మారింది పెరుగుతోంది. ఇక సినిమాలో ఇమ్రాన్ హష్మీ ప్రియాంక మోహన్ శ్రీయ రెడ్డి, అర్జున్ దాస్ లాంటి స్టార్ క్యాస్ట్ కూడా ఉండటంతో ఒజీ బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. పవన్ పొలిటికల్ గా బిజీ ఉండడంతో ఓజి సినిమా షూటింగ్ కొంత ఆలస్యంగా పూర్తయింది. ఇప్పుడు సినిమా వర్క్ స్పీడ్ గా జరుగుతున్నట్లు తెలుస్తోంది.త్వరలోనే ఓజీ నుంచి ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు. ఈ ట్రైలర్ తో సినిమాలో పవన్ డ్యూయల్ రోల్ పై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.