నయనతారకు బిగ్ షాక్.. హైకోర్ట్ నుండి నోటీసులు..!!

Nayanthara High Court Notice: కోలీవుడ్‌లో లేడీ సూపర్‌స్టార్‌గా గుర్తింపు పొందిన నయనతార చిక్కుల్లో పడింది. ఆమె జీవిత కథ ఆధారంగా రూపొందిన డాక్యుమెంటరీ ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీటేల్’ గత సంవత్సరం నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా విడుదలైన విషయం తెలిసిందే కదా.. అయితే ఈ డాక్యుమెంటరీ విడుదలైనప్పటి నుంచే నయన్ ను వివాదాలు వెంటాడుతున్నాయి. తాజాగా, ఈ డాక్యుమెంటరీకి సంబంధించి మద్రాసు హైకోర్టు నయనతారకు నోటీసులు జారీ చేసినట్టు సమాచారం.

ఈ డాక్యుమెంటరీలో అనుమతి లేకుండా తమ సినిమాల ఫుటేజీ వినియోగించారని ఆరోపణలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ‘చంద్రముఖి’ చిత్రానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలను అనుమతి లేకుండా ఉపయోగించారని ఆరోపిస్తూ, ఆ సినిమాకు కాపీరైట్స్ కలిగి ఉన్న ఏబీ ఇంటర్నేషనల్ సంస్థ కోర్టును ఆశ్రయించింది. ఈ ఫుటేజీని డాక్యుమెంటరీ నుండి తొలగించాలని లేదా రూ.5 కోట్లు నష్టపరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కేసు తాజాగా మద్రాసు హైకోర్టులో విచారణకు రావడంతో, కోర్టు డాక్యుమెంటరీ నిర్మించిన టార్క్ స్టూడియోస్ సంస్థకు నోటీసులు జారీ చేసింది. అక్టోబర్ 6వ తేదీ లోపు సమగ్ర వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అలాగే, ఇప్పటివరకు డాక్యుమెంటరీ ద్వారా ఎంత ఆదాయం వచ్చింది అనే విషయాన్ని కూడా కోర్టు ముందు ఉంచాలని ఆదేశించింది.

ఇదే సమయంలో మరో సినిమాకు సంబంధించిన వివాదం కూడా ఈ డాక్యుమెంటరీను చుట్టుముట్టింది. నయనతార నటించిన ‘నానుమ్ రౌడీ థాన్’ చిత్రంలోని మూడు సెకన్ల ఫుటేజీని తమ అనుమతి లేకుండానే వాడారని ఆరోపిస్తూ ఆ చిత్రం నిర్మాత, నటుడు ధనుష్.. నయనతారకు లీగల్ నోటీసులు పంపి తనకి రూ.10 కోట్లు నష్టపరిహారం చెల్లించాలంటూ డిమాండ్ చేశారు. ఈ రెండు ప్రధాన వివాదాలతో ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీటేల్’ డాక్యుమెంటరీ ప్రస్తుతం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఒకవైపు అభిమానుల ప్రశంసలు అందుకుంటున్న ఈ డాక్యుమెంటరీ, మరోవైపు లీగల్ ఇష్యూస్‌తో నయనతారకు తలనొప్పిగా మారింది. Nayanthara High Court Notice.

ఇక నయన్ సినిమాల విషయానికొస్తే.. లాంగ్ గ్యాప్ తర్వాత టాలీవుడ్ లో మెగాస్టార్ తో జోడి కట్టింది.అనిల్ రావిపూడి – చిరు కాంబోలో తెరకెక్కుతున్న మన శంకర వరప్రసాద్ సినిమాలో నయన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవలే ఈ హీరోయిన్ షూటింగ్ లో జాయిన్ అయింది. చిరు, నయన్ పై ఓ పాటను షూట్ చేస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.