
Zaheerabad Constituency Congress Party: రాష్ట్రంలో అధికారం లో ఉన్నా ఆ నియోజక వర్గంలో పార్టీ అయోమయంగా మారిందా? క్యాడర్ కి లీడర్ లకు రోజు రోజుకి పట్టు సన్నగిల్లుతుందా? నియోజక వర్గంలో నాయకుల గ్రూపు తగాదాలు తారా స్థాయికి చేరాయా? ఒకప్పటి కంచుకోట నాయకుల ఆధిపత్య పోరు బీటలు వారెలా చేస్తుందెక్కడ తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే….
మొదటి నుండి ఉమ్మడి మెదక్ జిల్లాలోనే జహీరాబాద్ శాసనసభ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ఎన్నికలు మొదలైనప్పటినుండి 16 సార్లు mla ఎన్నికలు జరిగితే 13 సార్లు కాంగ్రెస్ పార్టీనే విజయం సాధించింది. రెండు సార్లు బీఆర్ఎస్, ఒక సారి టీడీపీ విజయం సాధించింది. విజయాలతో రికార్డులు బ్రేక్ చేసిన జహీరాబాద్ హస్తం పార్టీలో ఇప్పుడు సీనియర్ నాయకుల సఖ్యత లేక ఎవరి క్యాంప్ ఆఫీస్ లు వారే ఏర్పాటు చేసుకోవడం తో క్యాడర్ లో స్థైర్యం సన్నగిల్లుతుందనే టాక్ వినిపిస్తుంది.
1957 నుండి వరసగా ఎం.బాగారెడ్డి ఏడు సార్లు mla గా విజయం సాదించారు. మూడు సార్లు మెదక్ ఎంపి గా కోనసాగారు. బాగారెడ్డి మెదక్ పార్లమెంట్ కు పోటీ చేయగా ఆయన వారసుడుగా పి.నర్సింహరెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున విజయం సాదించారు. మొదటి సారి కాంగ్రెస్ ఎతర అభ్యర్తి టిడిపికి చెందిన బాగన్నా 1994 లో గెలుపొందారు. మళ్ళీ 1999 నుండి 3 సార్లు ఇక్కడ హస్తం జెండా ఎగిరింది. గెలిచిన ఫరీదోడ్డిన్ మంత్రిగా చేశారు. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో జహీరాబాద్ శాసనసభ నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడు కావడంతో ఈ స్థానం నుండి మాజీ మంత్రి గీతారెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి రెండు సార్లు విజయం సాదించి రాష్ట్ర మంత్రి వర్గంలో వివిధ పదవులు నిర్వహించారు. 2018 ,2023 సంవత్సరంలో జరిగిన శాసనసభ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి చేందిన కె.మాణిక్ రావు విజయాన్ని సాధించారు.
ఇలాంటి ఘన చరిత్ర కల్గిన జహీరాబాద్ శాసనసభ నియోజకవర్గంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుల గ్రూపుల గోలతో నాయకులు, కార్యకర్తలు అయోమయనికి గురవుతున్నారు. నియోజకవర్గ ఇంచార్జీ మాజీమంత్రి డాక్టర్ చంద్రశేఖర్ ఒకవైపు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు గిరిధర్ రెడ్డి అండ్ ఉజ్వల్ రెడ్డీ మరోవైపు, ఎంపి సురేష్ షెట్కర్ లు వేరు వేరుగా తమ క్యాంపు కార్యాలయాలు ఎర్పాటు చేసుకోవటం తో క్యాడర్ అయోమయంలో ఉన్నారట. పార్టీ ఇప్పుడున్న పరిస్థతి చూసి, నాయకుల తిరుపై కాంగ్రెస్ అభిమానులు ఒక్కింత నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ద్వీతియ శ్రేణి నాయకులు స్థానిక నేతలకు అనుగుణంగా వర్గాలుగా చీలిపోతున్నారు. పలితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న తమ పనులు కాక నాయకులు, కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నాయకత్వం లోపించిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని చూసి క్రింది స్థాయి నాయకులు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోందరు సీనియర్ నాయకులు క్రీయశీల రాజకీయలకు దురంగా ఉండటంతో జహీరాబాద్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకి బలహీన పడుతుంది. Zaheerabad Constituency Congress Party.
జహీరాబాద్ నియోజకవర్గం ఒక్కప్పుడు కాంగ్రెస్ కు కంచుకోట ప్రస్తుతం ఇందుకు భిన్నమైన పరిస్థితులు నేలకోన్నాయి. ఆధిపత్య పోరు కోసం నాయకుల మధ్య వర్గ పోరు నానాటికి ముదురుతున్నది పలితంగా ఎ నాయకునికి ఆ నాయకుల వారిగా క్యాంపు కార్యాలయాలు జహీరాబాద్ లో ఆవిర్భవించాయి పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలు ఎవ్వరికి వారు వేరు వేరుగా నిర్వహిస్తూ గందరగోళ పరిస్థితులకు దారి తిస్తున్నారు. నాయకుల మద్య నేలకోన్న అదిపత్య వర్గ పోరుతో పార్టీకి జరుగుతున్న అపార నష్టంపై పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికైన జిల్లా,రాష్ట్ర పార్టీ అదినాయకులు దృష్టి సారించి నష్ట నివారణకు చర్యలు తిసుకోవాలని పార్టీ అభిమానులు కోరుతున్నారు. లేని పక్షంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో నష్టపోయే ప్రమాదం ఉందని పార్టీ అభిమానులు కార్యకర్తలు ఆందోళన చెందుతున్న పరిస్థితి.