
Kakinada Janasena Party: కాకినాడ జిల్లా జనసేన పార్టీ లో ప్రక్షాళన మొదలైందా, మూడు నాలుగు పదవులు అనుభవిస్తున్న నేతల తోకలు కత్తిరించే పనిపై జనసేనాని ద్రుష్టి పెట్టేరా, కూటమి లో ఉంటూనే కుంపటి పెడుతున్న నేతల ఏరివేత కు శ్రీకారం చుట్టారా పిఠాపురం నియోజకవర్గం లో జరుగుతున్న తప్పులపై దిద్దుబాటు చేస్తున్నారా…… అంటే ఔననే సమాధానం చెప్పొచ్చు అంటున్నారు జనసేన నేతలు…. జనసేనలో జరగబోయే మార్పులేంటి, ఎవరెవరిపై వేటు పడబోతుంది తెలుసుకోవాలంటే…… వాచ్ దిస్ స్టోరీ……
ఎన్నికలకు ముందు పిఠాపురాన్ని దేశంలోనే మోడల్ నియోజకవర్గం గా తీర్చిదిద్దుతాను నన్ను ఇక్కడనుంచి గెలిపించండి అన్న పవన్ కళ్యాణ్ మాటలు విని పిఠాపురం ప్రజలు 70,354 ఓట్ల భారీ మెజారిటీతో పవన్ ని గెలిపించారు. పవన్ కళ్యాణ్ గెలుపొందిన వెంటనే ఇచ్చిన మాటప్రకారం పిఠాపురం అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి సారించారు.. ఎన్నో ఏళ్లుగా పిఠాపురం లో పాతుకుపోయిన సమస్యలు తీర్చాలని కంకణం కట్టుకున్నారు. Mla గా సంవత్సరం పూర్తి అయ్యేలోపు దాదాపు 400 కోట్ల అభివృద్ధి పనులు చేశారు. ఇది చూసి దేశం ఎవత్తు ఆశ్చర్యం లో మునిగిపోయింది.. మొదటి సారి mla గా గెలిచి తక్కువ కాలంలో ఇంత అభివృద్ధి చేయొచ్చా అని తలపండిన రాజకీయ విశ్లేషకులు సైతం ఆశ్చర్యపడేలా చేశారు… పిఠాపురం ప్రజలు మా బంగారం పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారు..
ఇంతవరకు సజావుగానే ఉన్నా ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డ నేతల్లో అక్రోసం వారిని పవన్ చేస్తున్న ప్రతి అభివృద్ధి పనుల్లోను ఏదోలా అడ్డుపుల్ల వేసేలా పురీగొల్పుతుంది.. ఇటీవల సూపర్ సిక్స్ పధకాల్లో ఒకటైన మహిళలకు ఉచితబస్సు పధకం కోసం కూటమి లో ఉన్న రెండు పార్టీలు పెద్దలు రెండు బస్సులు ప్రారంభించడం చూసే వారు నవ్వుకునేలా చేసింది.. పార్టీ పెద్దలు కూటమి మరింత బలపడాలని పదే పదే చెప్తున్న పవన్ నియోజవర్గం లోనే వేరు కుంపట్లు పెట్టుకోవడం, ఒకరిపై ఒకరు అంతర్గతంగా బురద చల్లుకోవడం , కార్యకర్తలను రెచ్చగొట్టే ధోరణిలో ఉండటం కూటమి పెద్దలకు మింగుడు పడటం లేదు. పవన్ పై ఎప్పుడూవిమర్శనా లేఖ అస్త్రాలు సంధించే ముద్రగడను పిఠాపురం మాజీ mla వర్మ ముద్రగడ ఇంటికి వెళ్లి కలవడం కూడా అధిష్టాననికి ఇబ్బందిగా ఉన్నట్టు సమాచారం.. శత్రువు కు శత్రువు మిత్రుడు అనే నీతిని వర్మ బాగా ఒంటబట్టించుకున్నారనే విమర్శలు వచ్చాయి… పిఠాపురం లో ప్రజలు ఏ చిన్న సమస్య వచ్చిన జనసేన నేతలు వద్దకు వెళ్లడం, తనను కూరలో కరివేపాకులా తీసేయ్యడం కూడా జీర్ణించుకోలేకే మాజీ mla పవన్ ఇమేజ్ ని డ్యామేజ్ చేసే పనిలో బిజీగా ఉన్నారనే వినికిడి.. ఆ పార్టీ అధిష్టానం కూడా మాజీ mla పై గుర్రుగా ఉందనే గుస గుసలు వినిపిస్తున్నాయి…
అసలు రాజకీయాల్లో ఓనమాలు కూడా తెలియని కొత్త వ్యక్తులను జనసేనలోకి చేర్చుకుని ఇప్పుడు వారు ఉన్నత పదవుల్లో ఉండేలా చేసిన పవన్ కళ్యాణ్ ని సైతం మర్చిపోయి పవన్ పేరును పలకడానికి సైతం ఒప్పుకోకుండా వారి స్వలాభం చూసుకుంటూ, కోట్లు కూడబెడుతున్న నాయకులపై పవన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారని చెప్తున్నారు ధనార్జనే ప్రధాన ద్యేయంగా,పార్టీ పరువును బజారు కి ఈడిస్తున్నా ఒక నేతను అగ్రహాంతో పవన్ లాగి కొట్టినట్టు ఆ పార్టీ వారే చెప్పుకోవడం గమనార్హం. పవన్ ఆ నేతను దూరం పెట్టినట్టు సమాచారం..
పిఠాపురం నియోజకవర్గం లో జనసేన జెండా కు ఎదురులేని విధంగా పనులు చెయ్యాలని పవన్ నిర్ణయం తీసుకున్నారు. అందుకు తగ్గట్టు నియోజకవర్గంలో ప్రజా సమస్యలుతీర్చడానికి కొంతమందిని నియమించారు.. వీరు అప్పగించిన భాద్యతలు సక్రమంగా నిర్వర్తించగ పోగా నియోజజవర్గంలో ప్రతి అభివృద్ధి పనికి తన పెద్ద పెద్ద ఫోటోలు వేసుకోవడం, పవన్ కళ్యాణ్ ని మీడియా సమావేశాల్లో ఏకవచనంతో సంభోదించడం, అప్పగించిన బరువు భాద్యతలకు కొన్ని సమయాలు కేటాయించుకుని ఆ సమయాల్లోనే ప్రజలకు అందుబాటులో ఉంటూ ఒక ఉద్యోగంగా భాద్యలు నెరవేరుస్తున్న ఒక నేతపై మంగళగిరిలో జరిగిన సమావేశం లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి, నీకు అప్పగించిన భాద్యతలకు మంగళం పాడే సమయం వచ్చిందని హింట్ ఇచ్చారని కూడా నియోజకవర్గంలో బహిరంగ చర్చ నడుస్తుంది… సందట్లో సడెమియా చందంగా ఇప్పటికే నాలుగు పదవులు అనుభవిస్తున్న ఒక నేత నియోజకవర్గం ఇంచార్జ్ పదవిపై కన్నేసి ఇంకొంత మూటగట్టుకోవచ్చని చూస్తూ ఆ పదవి కూడా తనకే దక్కితే బాగుండునని ఇప్పుడు పనిచేస్తున్న వారిని మైమరపించేలా చేస్తానని డాంభికాలు పోవడం తో జనసైనికులు ఆ నేత పక్కనే,….ముందు నీకు అప్పగించిన భాద్యతలు సక్రమంగా నెరవేర్చు అంటూ ముసి ముసి గా 0 నవ్వుకుంటున్నారు…
Aపిఠాపురం నియోజకవర్గం అభివృద్ధిలో ycp నుంచి వచ్చిన ఒక నేత కీలకంగా మారి, పదవులు ఆశించకుండా పవన్ అడుగుజాడల్లో తను నడుస్తూ తన అనుచరులను అవైపు నడిపిస్తు పవన్ ను ఆకర్షించారు. తన ఆలోచనలు, చేస్తున్న అభివృద్ధికి ఇలాంటి నేతలు తోడైతే పిఠాపురం మరింత అభివృద్ధి చెందుతుందని అలాంటి వ్యక్తి నియోజకవర్గ ప్రజలు కు తలలో నాలుకలా ఉంటారని భావిస్తూ జిల్లా బాధ్యతలు అప్పగించాలని చూస్తున్నట్టు జనసేన అభిమానులు చెప్పుకుంటున్నారు. మంగళగిరిలో జరిగిన సమావేశంలో పవన్ ఈ విషయాన్నీ చెప్పకనే చెప్పారని అంటున్నారు. ఇలాంటి నేతకు కీలక భాద్యతలు అప్పగిస్తే కూటమిలో కుంపట్లు పెడుతున్న వారికీ చెక్ పెట్టొచ్చని అంటున్నారు… Kakinada Janasena Party.
మొత్తం మీద కాకినాడ జిల్లాలో జనసేన ప్రక్షాళన కు పవన్ నడుం కట్టారని తెలుస్తుంది.. తను చేస్తున్న అభివృద్ధికి చేదోడు వాదోడు గా ఉంటూ సొంత లాభం చూసుకోకుండా పార్టీ పేరు ప్రఖ్యాతులను మరింత ఇనుమడింపచేసే నేత ఇప్పటికే పవన్ దృష్టిలో ఉన్నారని అతనికే జిల్లాలో జనసేన పార్టీ కీలక పదవి అప్పగిస్తారని చెప్పుకుంటున్నారు.. అతనికి భాద్యతలు అప్పగిస్తే ఇప్పుడు ప్రతి పనికి నాకెంత…అనే నాయకుల నోళ్లు మూత పడటం ఖాయం అంటున్నారు……