పెట్టుబడుల పర్వం.!

Adani Power Limited Record: భారత్ లోనే అతిపెద్ద ప్రైవేట్ రంగ థర్మల్ పవర్ జనరేటర్ అయిన అదానీ పవర్ లిమిటెడ్ (APL) రికార్డు నెలకొల్పింది. ఇటీవల ముగిసిన టెండరింగ్ ప్రక్రియలో భాగంగా మధ్య ప్రదేశ్ పవర్ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్ నుండి మొత్తం 1600 మెగావాట్ల సామర్థ్యాన్ని పొందినట్లు ప్రకటించింది. ఇంక మరిన్ని విషయాలు ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ నౌ.

APL కు MPPMCL నుండి “గ్రీన్‌ షూ ఆప్షన్” కింద అదనంగా 800 మెగావాట్ల సామర్థ్యం కోసం లెటర్ ఆఫ్ అవార్డ్ (LoA) లభించింది. ఈ ప్రాజెక్ట్ మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో ఇంధన భద్రతను మెరుగుపరచడమే కాకుండా గణనీయమైన ఉపాధి అవకాశాలను కూడా సృష్టిస్తుందని అదానీ పవర్ స్పష్టం చేసింది. ఇదే బిడ్డింగ్ ప్రక్రియలో APL గతంలో 800 మెగావాట్ల సామర్థ్యాన్ని గెలుచుకున్న తరువాత ఈ అదనపు సామర్థ్యం లభించింది. గత 12 నెలల్లో కంపెనీకి లభించిన ఐదవ ప్రధాన విద్యుత్ సరఫరా ఆర్డర్ ఇది. దీంతో మొత్తం అవార్డు పొందిన సామర్థ్యం 7,200 మెగావాట్లకు చేరుకుంది. దీని ప్రకారం, APL మధ్యప్రదేశ్‌ లోని అనుప్పూర్ జిల్లాలో ఏర్పాటు చేయనున్న 1600 మెగావాట్ల (800MW x 2) అల్ట్రా-సూపర్‌ క్రిటికల్ థర్మల్ పవర్ యూనిట్ నుండి విద్యుత్తును సరఫరా చేస్తుంది. ఇది డిజైన్, ఫైనాన్స్, ఆపరేట్ నమూనా కింద ఏర్పాటు చేయబడుతుంది. రెండు యూనిట్లు నియమించబడిన తేదీ నుండి 60 నెలల్లోగా పనిచేయడం ప్రారంభిస్తాయి.

ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి, సంబంధిత మౌలిక సదుపాయాల కోసం కంపెనీ సుమారు రూ. 21,000 కోట్లు పెట్టుబడి పెడుతుంది. థర్మల్ పవర్ టెండర్‌ లో గ్రీన్‌ షూ ఆప్షన్‌ ను భారత్ లో మొదటిసారిగా స్వీకరించడం జరిగింది. బొగ్గు ఆధారిత విద్యుత్ సేకరణలో గ్రీన్‌ షూ విధానాన్ని వినూత్నంగా చేర్చడం వల్ల మధ్యప్రదేశ్‌ లో పెరుగుతున్న పారిశ్రామికీకరణ, పట్టణీకరణ కారణంగా పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ ను తీర్చడానికి అలాగే రాష్ట్రానికి ఇంధన భద్రతను పెంచడానికి సహాయపడుతుంది. ఈ మేరకు అదానీ పవర్ సీఈఓ ఎస్. బి. ఖ్యాలియా మాట్లాడుతూ, “అదానీ పవర్ మధ్యప్రదేశ్‌ లో ప్రారంభ 800 మెగావాట్ల ప్రాజెక్ట్‌ను పొందడమే కాకుండా, గ్రీన్‌ షూ ఆప్షన్ కింద అదనంగా 800 మెగావాట్లను కూడా పొందింది. ఇది రాష్ట్రానికి, ప్రజలకు నమ్మకమైన, సరసమైన, స్థిరమైన విద్యుత్తును అందించాలనే మా నిబద్ధతను బలోపేతం చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ మధ్యప్రదేశ్‌ తో మా దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని మరింత బలపరుస్తుంది. అలాగే భారతదేశ ఇంధన భద్రత, ఆర్థిక వృద్ధికి మద్దతు ఇవ్వాలనే మా అంకితభావాన్ని హైలైట్ చేస్తుంది.” అని అన్నారు.

ఈ విద్యుత్ ప్లాంట్ కోసం బొగ్గు అనుసంధానం భారత ప్రభుత్వ SHAKTI విధానం కింద కేటాయించబడింది. ఈ ప్రాజెక్ట్ నిర్మాణ దశలో సుమారు 9,000 – 10,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధిని కల్పిస్తుందని అంచనా. కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత సుమారు 2,000 మందికి ఉపాధి లభిస్తుంది. రాష్ట్ర డిస్కామ్‌ తో విద్యుత్ సరఫరా ఒప్పందం (PSA) త్వరలో కుదురుతుందని కంపెనీ భావిస్తోంది. సెప్టెంబర్ 2024లో, అదానీ గ్రీన్ ఎనర్జీతో కలిసి మహారాష్ట్ర రాష్ట్రం నుండి సంయుక్తంగా 6,600 మెగావాట్ల (5,000 మెగావాట్ల సౌర , 1,600 మెగావాట్ల థర్మల్) విద్యుత్ సరఫరా ఆర్డర్ కోసం LoI అందుకుంది. మే 2025లో, రాష్ట్రంలో ఒక గ్రీన్‌ఫీల్డ్ ప్లాంట్ నుండి 1,600 మెగావాట్ల విద్యుత్ సరఫరా కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నుండి LoA అందుకుంది. Adani Power Limited Record.

కొత్త విద్యుత్ ప్లాంట్ నుండి 2,400 మెగావాట్ల విద్యుత్ సరఫరా కోసం కంపెనీ LoA అందుకుంది. గత నెలలో, మధ్యప్రదేశ్ నుండి 800 మెగావాట్ల కోసం LoA అందుకుంది మరియు MPPMCL గ్రీన్‌ షూ ఆప్షన్‌ ను వినియోగించుకున్న తర్వాత అవార్డు పొందిన సామర్థ్యం ఇప్పుడు 1,600 మెగావాట్లకు పెరిగింది. భారతదేశం యొక్క పెరుగుతున్న బేస్ లోడ్ డిమాండ్‌ ను తీర్చడానికి అదానీ పవర్ భారతదేశంలో అతిపెద్ద ప్రైవేట్ రంగ క్యాపెక్స్ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. దీని ప్రస్తుత ఆపరేటింగ్ సామర్థ్యం 12 థర్మల్ పవర్ ప్లాంట్ల నుండి 18.15 GW కాగా, 2031-32 నాటికి మొత్తం 41.87 GW ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.