ఓజి నుంచి మ్యూజికల్ సర్ప్రైజ్.!!

OG ‘Trance of Omi’: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘ఓజీ’ చిత్రం‌పై సినీప్రియుల ఆశలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సినిమా నుంచి చిన్న అప్డేట్ వచ్చినా, అది క్షణాల్లోనే సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఓ వైపు అమెరికాలో ప్రీ-రిలీజ్ బిజినెస్ జెట్ స్పీడ్‌తో కొనసాగుతుండగా, మరోవైపు మేకర్స్ నుంచి వస్తున్న గ్లిమ్ప్స్‌లు అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తున్నాయి.

తాజాగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ‘ఓమి’ గ్లింప్స్‌కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ హైప్‌ని కొనసాగిస్తూ, తాజాగా చిత్రబృందం ‘ట్రాన్స్ ఆఫ్ ఓమి’ అనే మ్యూజికల్ థీమ్‌ను రిలీజ్ చేసింది. ఇది ఫ్యాన్స్‌కు మరో సర్‌ప్రైజ్ ట్రీట్‌గా నిలిచింది.

ఈ చిత్రంలో బాలీవుడ్ యాక్టర్ ఇమ్రాన్ హష్మి ఓమి అనే కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఆయన లుక్, ప్రెజెన్స్ ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌లలో అందరినీ మెప్పించాయి. ఇప్పుడు విడుదలైన ‘ట్రాన్స్ ఆఫ్ ఓమి’ పాట ద్వారా ఓమి పాత్రకు మరింత లోతు చేకూరింది. “విధ్వంసానికి మరో పేరు ఓమి” అనే విధంగా ఈ పాటలో ఆయన పాత్రను పవర్‌ఫుల్‌గా ప్రెజెంట్ చేశారు.

పాటకు థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థ్రిల్లింగ్‌గా, హై ఎనర్జీగా ఉండటంతో, సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇన్‌స్ట్రుమెంటల్ మ్యూజిక్‌కి ప్రధాన ప్రాధాన్యతనిచ్చిన ఈ పాట 2 నిమిషాల 53 సెకన్ల నిడివితో అందుబాటులోకి వచ్చింది. హర్ష, శ్రుతి రంజని, ప్రణతి, శ్రుతిక వంటి గాయకుల గాత్రం పాటలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. లిరిక్స్ ఈ థీమ్ సాంగ్‌కి మరింత బలాన్నిచ్చాయి. OG ‘Trance of Omi’.

ఈ పాట విడుదలవ్వడంతో ‘ఓజీ’పై ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. ప్రస్తుతం ఈ సాంగ్ అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ట్రెండ్ అవుతోంది. ఈ సినిమాను డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై డివివి దానయ్య నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ మూవీలో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక మోహన్ నటించింది. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, అర్జున్ దాస్ వంటి అగ్ర నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు మొదలవ్వగా, ట్రైలర్ విడుదల కూడా త్వరలోనే ఉండబోతోంది. సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.