
MLA Kavya Krishna Reddy: ఆయన ఒక మాజీ ఎమ్మెల్యే ఒకటికి రెండుసార్లు ఆ నియోజకవర్గంలో గెలిచాడు. అయితే 2024 సాధారణ ఎన్నికల్లో రికార్డ్ ఓట్లతో ఓటమి చెందాడు.ఇక అదే తరువాయి ఓటమిని జీర్ణించుకోలేక అధికార పార్టీ ఎమ్మెల్యే పై రకరకాల విమర్శలు చేయడం చివరికి అధికార పార్టీ ఎమ్మెల్యే క్వారీపై డ్రోన్ కెమెరా ఎగరవేసి హత్య ప్రయత్నం కూడా చేయటానికి ప్రయత్నాలు చేసినట్లు ఆయనపై ఎఫ్ ఐ ఆర్ కూడా నమోదయింది… ఇంతకీ వరుసగా రెండుసార్లు గెలిచిన ఎమ్మెల్యే ఎవరు ఓటమి అనంతరం ఎవరు పైన హత్య ప్రయత్నానికి ప్లాన్ చేశాడు తెలుసుకోవాలనుకుంటే వాచ్ దిస్ స్టోరీ….
వస్త్ర ప్రపంచానికి మారుపేరుగా..రాష్ట్ర ఖజానాకి భారీగా ఆదాయం తెచ్చే నియోజకవర్గంగా కావలి నియోజకవర్గం పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఇక్కడ నుంచి ఎంతోమంది హేమహేమీలు పార్లమెంటుకు.. అసెంబ్లీకి.. రాజ్యసభ కి వెళ్లారు.అయితే ఇదే నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకటికి రెండుసార్లు విజయం సాధించి తిరుగులేని నాయకుడిగా ముందుకు సాగుతున్న రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి 2024 సాధారణ ఎన్నికల్లో కావలి ప్రజలు దిమ్మతిరిగే సమాధానం చెప్పారు. రికార్డ్ స్థాయిలో సిట్టింగ్ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గెలవడం విశేషం. కావలి నియోజకవర్గ చరిత్రలో ఎవరు గెలవని విధంగా భారీ మెజారిటీతో కృష్ణారెడ్డి గెలిచారు. త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో నెల్లూరు జిల్లా నుండి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పేరు మొదటి వరుసలో ఉందని టాక్.. కావలిలో సంవత్సరాల తరబడి పెండింగ్‌లో ఉన్న పనులను సొంత నిధులతో చేయించడం ఆయన స్ట్రైల్ అంట.
ఇంతవరకు బాగానే ఉంది అయితే ఇక్కడి నుండి మొదలైంది అసలు కథ..ఓటమిని జీర్ణించుకోలేని మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే పై రగిలిపోతున్నాడంట.అసలు సిట్టింగ్ ఎమ్మెల్యేని లేపేస్తే మళ్లీ బై ఎలక్షన్ వస్తుందని అందులో పోటీ చేసి గెలవాలని మాజీ ఎమ్మెల్యే తహదహలాడుతున్నాడని సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.ప్రజలు ఇచ్చిన తీర్పును కూడా ఒప్పుకొని మాజీ ఎమ్మెల్యే తనపై హత్యా ప్రయత్నానికి ప్లాన్ చేశాడని తన క్వారీపై డ్రోన్ ఎగరవేసి నలుగురు రౌడీషీటర్‌ను పంపి తనను చంపేయటానికి ప్రయత్నం చేశాడని పోలీసు కేసు కూడా నమోదయింది.
నలుగురు రౌడీషీటర్లను జైలు కూడా పంపారు. ఇక అప్పుడు నుండి మాజీ ఎమ్మెల్యే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని దేశం విడిచి వెళ్లిపోయాడని ప్రచారం జరుగుతుంది. అయితే కావలి నియోజక వర్గ చరిత్రలో ఇలాంటి దారుణమైన సంఘటన ఎప్పుడు చోటు చేసుకోలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఓటమి చెందితే ఇలా హత్య ప్రయత్నం చేయడం ఎంతవరకు సబబు అంటూ ప్రతి నోటా వినిపిస్తుంది. సిట్టింగ్ ఎమ్మెల్యేను ప్రజలలో ఫెయిల్ చేయడానికి మాజీ ఎమ్మెల్యే రకరకాల కుట్రలకు ప్రయత్నాలు చేస్తున్నాడని ప్రచారం జరుగుతుంది..
అనంతపురం జిల్లా నుంచి 30 మంది రౌడీషీటర్‌ను తీసుకువచ్చి కావలీ నియోజకవర్గంలో విద్యుత్‌కు అంతరాయం కలిగించాలని రాత్రుల సమయంలో విద్యుత్ వైర్లపై రాళ్లతో కట్టిన తాళ్ళని వేసి నియోజకవర్గాన్ని చీకటిమయం చేశాడని కూడా ప్రచారం జరుగుతుంది.
గతంలో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి తన అనుచరుల వద్ద మాట్లాడుతూ.. అందరూ జైలుకు పోతున్నారు నేను కూడా పోతే బాగుంటుంది.. జగన్ దృష్టిలో కూడా బాగా పడుతాను అని సెటైర్ కూడా వేశారు అంట..తీరా కేసులు నమోదయ్య సమయానికి ఏకంగా రాష్ట్రం..దేశం వదిలి పారిపోయాడు అని టాక్.
ఓటమిని జీర్ణించుకోలేని మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గంలో అల్లర్లు సృష్టించడానికి పదే పదే ప్రయత్నాలు చేయటం పట్ల సొంత పార్టీ నాయకులే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంట..
అభివృద్ధి పనుల కోసం ఏర్పాటుచేసిన ఫైలాన్ లను పగలగొట్టడం..సిట్టింగ్ ఎంఎల్ఏ పై కొత్త కొత్త ఆరోపణలు తెరపైకి తేవటం కావలి నియోజకవర్గంలో ఎప్పుడు జరగలేదంట.. అయితే నియోజకవర్గంలో ఇంత రచ్చ జరుగుతున్నప్పటికీ సిట్టింగ్ ఎమ్మెల్యే కృష్ణారెడ్డి మాత్రం ఏమాత్రం పట్టించుకోకుండా అభివృద్ధి వైపు పరుగులు తీస్తున్నాడంట…
నియోజకవర్గంలో సంవత్సరాల తరబడి అభివృద్ధికి నోచుకోని రోడ్లు.. కాలువలు..బ్రిడ్జిలు నిర్మిస్తూ తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు అంట. కొన్నిచోట్ల తన సొంత నిధులు సైతం ఖర్చుపెట్టి అభివృద్ధి ఆగకుండా ప్రయత్నాలు చేస్తున్నాడంట. నియోజకవర్గంలో ఎప్పుడు లేని విధంగా గత ఎన్నికల్లో వైసీపీ నాయకులు ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిని కూడా నిలబెట్టి సిట్టింగ్ ఎమ్మెల్యే ఓటమి కోసం మాజీ ఎమ్మెల్యే నానా ప్రయత్నాలు చేశాడంట.. ఎన్ని ప్రయత్నాలు చేసినా బంతిని కిందకి ఎంత గట్టిగా కొడితే అంత పైకి లేస్తుంది అన్న సామెత రూపంలో కావలి నియోజకవర్గంలో ఏర్పడ్డ తర్వాత 30.000 పైగా మెజారిటీతో గెలిచిన ఏకైక నాయకుడు సిట్టింగ్ ఎమ్మెల్యే కృష్ణారెడ్డి.
సిట్టింగ్ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సొంత క్వారీపై రౌడీషీటర్‌ను పంపి డ్రోన్ ఎగరవేయవలసిన అవసరం ఏముందని నియోజకవర్గ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అంట.ఏదైనా అక్రమాలు జరుగుతున్నాయి అని అనుమానం వస్తే సమాచార హక్కు చట్టం ద్వారా తెలుసుకోవాలని లేదా పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని లేదా కోర్టు ద్వారా అనుమతులు తీసుకుని పోలీసుల సమక్షంలో క్వారీ వద్దకు వెళ్లాలని ఇలా డ్రోన్లు ఎగరవేయటం ముమ్మాటికి తప్పేనని కావలి నియోజకవర్గ ప్రజలు అనుకుంటున్నారు అంట..
సిట్టింగ్ ఎమ్మెల్యేని హత్య చేయటానికి ఆయన క్వారీపై డ్రోన్ ఎగరవేయటం జరిగిందని అందుకే హత్య ప్రయత్నం కేసు కూడా నమోదు చేశామని.. నలుగురు నిందితులను రిమాండ్ కూడా పంపామని అటు పోలీసులు కూడా చెప్పిన విషయం తెలిసిందే.
పాలు మీటింగ్‌లలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ తాను దేనికి భయపడనని తగ్గేదే లేదని జైలుకు పోవడానికి సిద్ధంగా ఉన్నారని సవాల్ విసిరిన విషయం కూడా తెలిసిందే.అయితే కేసులు నమోదయ్యేసరికి తుస్సు మని దేశం విడిచి పారిపోయాడు అంట. మరి ఇలాంటి నాయకుడా బహిరంగ సభలలో సవాల్ విసిరింది అని వైసిపి కార్యకర్తలు గుసగుసలాడుతున్నారంట.
సిట్టింగ్ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఎమ్మెల్యే కాక ముందు నుంచి కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ పేద ప్రజలకు సేవ చేస్తూ ఎంతో మందికి ఎన్నో విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ తన ట్రస్టు ద్వారా వేలాదిమంది మనసు దోచుకున్నాడు అంట. మరి అలాంటి ఎమ్మెల్యే పై హత్య ప్రయత్నం చేయటం మాజీ ఎమ్మెల్యే కు రాజకీయంగా పెద్ద మైనస్ అవుతుందని కావలీ ప్రజలు గుసగుసలాడుతున్నారట. MLA Kavya Krishna Reddy.
ఏది ఏమైనా సిట్టింగ్ ఎమ్మెల్యే సొంత నిధులు సైతం ఖర్చు చేస్తూ అభివృద్ధి పనులు చేస్తూ ప్రజలకు వద్దకు దూసుకుపోతుంటే మాజీ ఎమ్మెల్యే మాత్రం ఓటమిని జీర్ణించుకోలేక సిట్టింగ్ ఎమ్మెల్యేని చంపేస్తే బై ఎలక్షన్ వస్తుందని ఇలాంటి కు.. కుతంత్రాలుకు తెరలేపుతున్నాడని ప్రతి నోటా వినిపిస్తుంది.. ఇదే విషయమై సాక్షాత్తు పోలీసులే మీడియా సమావేశంలో చెప్పారంటే మరి మాజీ ఎమ్మెల్యే రాజకీయానికి ఇది ఒక పెద్ద మైనస్ గా మరే అవకాశాలు కనిపిస్తున్నాయి…