
Jubilee Hills By Election: ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అకాల మరణంతో ఖాళీ అయిన జూబ్లీహిల్స్ అసెంబ్లీకి త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. కాగా ఈ సిట్టింగ్ నియోజకవర్గాన్ని ఎలాగైన తిరిగి దక్కించుకోవాలని బీఆర్‌ఎస్ పట్టుదలతో ఉంది. అయితే ఈ సీటుపై కాంగ్రెస్ కూడా కన్నేసింది. అయితే ఇదిలా ఉండగానే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై స్పెషల్ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఫోకస్ పెట్టడం చర్చనీయంశంగా మారింది. ఆమె కూడా తన సంస్థ నుంచి అభ్యర్థిని నిలపడానికి ప్రయత్నిస్తు్న్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో ఎన్నికలకు సంబంధించిన కార్యాచరణాను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా కవితతో జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే, పీజేఆర్ తనయుడు పి. విష్ణువర్ధన్ రెడ్డి ప్రత్యేకంగా కవితతో సమావేశం అయినట్లు తెలుస్తోంది. బీఆర్‌ఎస్ దివంగత ఎమ్మెల్యే మాగంటి సతీమణి సునీతకు టికెట్ ఇస్తుందన్న ప్రచారం నేపథ్యంలో వీరి భేటీ కీలకంగా మారింది. గతంలో కాంగ్రెస్ నుంచి టీకెట్ ఆశించిన విష్ఫువర్ధన్ రెడ్దికి టికెట్ కేటాయించకపోవడంతో ఆయన బీఆర్‌ఎస్ లో చేరారు. గత ఎన్నికల్లో మాగంటి గెలుపునకు కృషి చేశాడు, అయితే ఇటీవల మాగంటి మరణంతో ఆయన సతీమణి ఎన్నికల్లో పోటీ చేయకపోతే విష్ణుకే టికెట్ అన్న ప్రచారం సాగింది. అయితే ఇపుడు సునీత బరిలో ఉంటున్న నేపథ్యంలో ఆయన కవితతో బేటీ కావడం సంచలనంగా మారింది. ఇటీవలె జరిగిన జూబ్లీహిల్స్ బీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలోనూ పాల్గొన్న ఆయన ఒకసారిగా ఆయన కవిత వైపు తిరగడం కలకలం రేపింది. కవితతో అరగంటకు పైగా మంతనాలు సాగించిన విష్ణు ఎన్నికల బరిలో ఉండే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఇందులో భాగంగానే ఉప ఎన్నికల్లో విష్ణువర్ధన్ రెడ్డిని పోటీకి దించే యోచనలో కవిత ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. దానికోసం ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ రంగంలోకి దిగారు. ఈ ఉప ఎన్నికలో గెలిస్తే.. ఆ ప్రభావం మరికొద్ది రోజుల్లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై పడే అవకాశం ఉంది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఎన్నికలపై ప్రభావం ఉంటుందని అన్ని పార్టీలు భావిస్తు్న్నాయి. అయితే ఈ ఉప ఎన్నికలో గెలిచి.. జూబ్లీహిల్స్‌లో తమ ప్రాబల్యం ఏ మాత్రం తగ్గలేదని సాంకేతాలు ఇచ్చేందుకు బీఆర్ఎస్ పార్టీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రంగంలోకి దిగారు. ఆయన నియోజక వర్గంలోని డివిజన్ల వారీగా నేతలతో ఆయన సమావేశమవుతున్నారు.
ఇక మరోవైపు ఉప ఎన్నిక అంశానికి సంబంధించి సీఎం రేవంత్‌రెడ్డి తన నివాసంలో సమీక్ష చేపట్టారు. జూబ్లీహిల్స్ ఎన్నికపై పలువురు కాంగ్రెస్ నేతలతో చర్చించారు. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, జూబ్లీహిల్స్ ఇంచార్జ్ మంతరులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, వివేక్‌లతో సర్వే ఏజెన్సీల నుంచి పలువురు హాజరయ్యారు.సెప్టెంబర్ నెలాఖరులో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. దీంతో జూబ్లీహిల్స్‌లో అభివృద్ధి పనులు, అభ్యర్థి ఎంపికపై మంత్రులతో సీఎం చర్చించారు. . జూబ్లీహిల్స్ రేసులో నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, అంజన్ కుమార్ యాదవ్‌లు పోటీలు ఉన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికపై సీక్రెట్ సర్వే రిపోర్ట్‌ను సీఎంకు అందజేశారు పీసీసీ చీఫ్.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తాను పోటీలో ఉన్నానని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ అంటున్నారు. తాను సికింద్రాబాద్ ఎంపీగా రెండు సార్లు గెలిచానని, జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభవృద్ధి కోసం కృషి చేశానన్నారు. ఎంపీ ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేశానన్నారు. ఇక తన మనసులోని మాటను వెల్లడించారు అంజన్ కుమార్ యాదవ్. తన కన్న సీనియర్లు ఎవరు లేరని తనకు అన్ని అర్హతలు ఉన్నాయన్నారు. హైదరాబాద్ నుండి ప్రాతినిథ్యం లేదను కనుకే తనకు ఛాన్స్ ఇవ్వాలని….కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీకి అండగా ఉన్నందుకు తనకు చాన్స్ ఇవ్వాలని…జూబ్లీహిల్స్ లో సర్వే చేస్తే అంజన్ కుమార్ యాదవ్ పేరు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
మరో వైపు జూబ్లీహిల్స్ సీటు నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన అజాహరుద్దీన్ భావించారు. అయితే, స్థానికం గా నియోజకవర్గంలో సామాజిక సమీకరణాలు.. పార్టీల బలాల ఆధారంగా సీఎం రేవంత్ కొత్త వ్యూహం అమలు చేస్తున్నారు. అందులో భాగంగా సీటు కోసం ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేసిన అజాహరుద్దీన్ ను పోటీ లేకుండా చట్ట సభలకు ఎంపిక చేసారు. దీంతో.. ఇప్పుడు రేవంత్ ఆలోచన లకు అనుగుణంగా జూబ్లీహిల్స్ బై పోల్ అభ్యర్ధి ఖరారు కానున్నారు. ఈ రేసులో ఇప్పటి వరకు ప్రధానంగా నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, రహ్మత్‌నగర్ కార్పొరేటర్ సీఎన్ రెడ్డి పేర్లు ప్రచారం లో ఉండగా.. మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి పేరు పైన సర్వే చేయించటం సంచలనంగా మారుతోంది. కాగా.. మాజీ మంత్రి దానం నాగేందర్ సైతం తనకు అవకాశం ఇవ్వాలని కొత్త ప్రతిపాదన తెర మీదకు తీసుకొచ్చారు.
ఇక చూస్తే గులాబీ పార్టీ నుంచి దివంగత గోపినాథ్ సతీమణి మాగంటి సుజాత బరిలో దిగుతుందని ఇప్పటికే కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సంకేతాలిచ్చారు. దీంతో ఆమె కాలనీలు, బస్తీల్లో గోపినాథ్ సంతాపసభలు నిర్వహిస్తున్నారు. గోపినాథ్ తనయలూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఉప ఎన్నికల్లో విజయం లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. పార్టీ కార్యకర్తలతో రెండు పర్యాయాలు నాయకులు ఉప ఎన్నికల సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఇటు కాంగ్రెస్ నుంచి జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్‌లకు ఎన్నికల బాధ్యతలు అప్పగించింది. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఇతర నేతలనూ భాగస్వాములను చేస్తున్నారు. Jubilee Hills By Election.
ఇక, బీజేపీ నుంచి లంకల దీపక్‌రెడ్డి, కీర్తిరెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, మాధవీలత, డాక్టర్ పద్మవిపనేని, మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు మనుమడు ఎన్‌వీ సుభాష్ అభ్యర్థిత్వం ఆశిస్తున్నారు. వీరిలో ఎవరికి అవకాశం దక్కుతుందన్న దానిపై సస్పెన్స్ నెలకొంది. అయితే.. గోపీనాధ్ సానుభూతి ఓటింగ్ తో పాటుగా మైనార్టీల ఓటింగ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ గా భావిస్తున్నారు. ఎంఐఎం పోటీలోకి దిగటం పైన స్పష్టత రావాల్సి ఉంది. బీఆర్ఎస్ సైతం ఎంఐఎం నిర్ణయం కోసం వేచి చూస్తోంది. కాగా.. బీజేపీకి… టీడీపీ నేతలు సైతం మద్దతుగా నిలుస్తున్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా సహకరించనుంది. నియోజకవర్గంలో పరిస్థితులను తమకు అనుకూలంగా మలచుకునేందుకు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. దసరా వేళ అభ్యర్ధుల పైన అధికారికంగా ప్రకటన రానుంది. ఇక ఇలా ఎవరికి వారే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో ఉండడంతో మరీ ఏం జరుగుతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.