
PM Kisan Latest Update: ప్రధాని నరేంద్ర మోదీ రైతులకు ఆర్థిక లబ్ది చేకూర్చేందుకు అనేక రకాల పథకాలను, సాంఘిక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ సంక్షేమ పథకాల్లో పీఎం కిసాన్ పథకం అత్యంత ముఖ్యమైనదని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ స్కీం ద్వారా నేరుగా రైతుల అకౌంట్లలో డబ్బులు పడనున్నాయి. తద్వారా వారికి ఆర్థిక లబ్ది చేకూరనుంది. డైరక్ట్ టు బెనిఫిషియరీ పద్దతిలో మొత్తం సంవత్సరానికి ఒక్కో రైతు అకౌంట్లో 6వేలు జమ అవుతున్నాయి. ఇదిలా ఉంటే…తాజాగా ఈ పథకానికి సంబంధించి లబ్ధిదారులకు ఒక కీలకమైన అప్ డేట్ అందుబాటులోకి వచ్చింది. ఆ అప్ డేట్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
మోదీ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకం పీఎం కిసాన్ పథకం. ఈ పథకం కింది కేంద్ర ప్రభుత్వం దేశంలోని రైతులకు ఏడాదికి 6వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తుంది. ఈ డబ్బు మూడు వాయిదాల్లో, అంటే ప్రతి నాలుగు నెలలకు ఒకసారి 2వేల చొప్పున నేరుగా అర్హులైన రైతుల అకౌంట్లలో జమ అవుతుంది. ఈ స్కీమ్ ద్వారా రైతులకు కొంత ఆర్థిక ఊరట లభిస్తుంది. పంటల సాగు ఖర్చులకు కొంచెం తోడ్పాటుగా ఉంటుంది.ఇప్పటివరకు ఈ స్కీమ్ ద్వారా 20 వాయిదాలు విడుదలయ్యాయి. ఇప్పుడు అందరి దృష్టి 21వ వాయిదా మీద పడింది. దీపావళి సీజన్ రాబోతుంది కాబట్టి, ఈ పండుగకు ముందే డబ్బు వచ్చే అవకాశం ఉందని అంచనా. ఈ సమయంలో ప్రభుత్వం పీఎం కిసాన్ పై ఒక ముఖ్యమైన నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ నోటిఫికేషన్లో ఏం ఉందంటే..ఫిబ్రవరి 1, 2019 తర్వాత భూమిని కొనుగోలు చేసిన …లేదా సొంతం చేసుకున్న రైతులపై కొన్ని అక్రమ కేసులు గుర్తించామని కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లో విడుదల చేసిన నోటిఫికేషన్లో తెలిపింది. ఒకరి కంటే ఎక్కువ మంది సభ్యులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్న కుటుంబాలు ఉన్నాయని తెలిపింది. చాలా మంది హక్కుదారులు ఒకే భూమిని సద్వినియోగం చేసుకుంటున్నారని గుర్తించి. ఇలాంటి వారికి వాయిదా చెల్లింపు ప్రస్తుతానికి నిలిపివేసింది కేంద్రం. రైతులు తమ అర్హతను తనిఖీ చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు . దీని కోసం నో యువర్ స్టేటస్ అంటే KYC సేవలు అందుబాటులో ఉన్నాయి. దీనిని PM కిసాన్ వెబ్సైట్, మొబైల్ యాప్ లేదా కిసాన్ ఇ-మిత్రా చాట్‌బాట్ ద్వారా ఉపయోగించవచ్చు. PM Kisan Latest Update.
ఫిబ్రవరి 1, 2019 తర్వాత భూమిని కొనుగోలు చేసిన లేదా యాజమాన్యం పొందిన రైతులు ఫిజికల్ ఆథంటిఫికేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. దీని ప్రకారం రైతు కుటుంబాల్లో ఒక సభ్యుడు ఇప్పటికే ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందుతున్నట్లయితే, తండ్రీ కొడుకులలో ఒకరికి మాత్రమే ఈ పథకం ద్వారా ప్రయోజనం లభిస్తుందని గుర్తుంచుకోండి. PM కిసాన్ యోజన కింద నమోదు చేసుకున్న రైతులకు eKYC తప్పనిసరి. రైతులు వెబ్సైట్లో OTP ఆధారిత eKYCని, వారి సమీప CSC కేంద్రంలో బయోమెట్రిక్ eKYCని పూర్తి చేయవచ్చు. ఇక ఫిజికల్ వెరిఫికేషన్ పూర్తయ్యే వరకు తదుపరి విడత ఈ రైతుల ఖాతాలకు జమ కాదని కేంద్రం తెలిపింది. పూర్తి అర్హత ఉన్న రైతుల అకౌంట్లో మాత్రమే డబ్బు జమ అవుతుంది. ఇక పీఎం కిసాన్ 21వ విడద నగదు విషయానికొస్తే దీపావళికి ముందే అకౌంట్లో పడుతుందని రైతులు ఆశిస్తున్నారు. కానీ గత సంవత్సరాల ట్రాక్‌ను పరిశీలిస్తే వాయిదా డిసెంబర్ 2025లో వచ్చే అవకాశం లేకపోలేదు.