
Gold and silver Rates: దేశంలో బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. బంగారం – వెండి ధరలు పెరగడం కొత్తేమీ కాదు కానీ గత తొమ్మిది నెలలుగా విపరీతంగా పెరుగుతున్న రేట్లు సాధారణ ప్రజలకు మింగుడు పడట్లేదు. “ఇంతకుముందు ఎప్పుడూ ఇలా పెరగలేదు” అని మార్కెట్ నిపుణులే అంటున్నారు. ఇకపై ధరలు తగ్గే పరిస్థితి కనీసం కనబడడం లేదు. బంగారం మీద ఎవరు తగ్గిన డిమాండ్ చెప్పినా అది కేవలం ఊహ మాత్రమేనని, వాస్తవానికి బంగారానికి డిమాండ్ ఎప్పటికీ తగ్గదే లేదన్నట్టుగా ఉంది. ఇంకా బంగారం ధరలు ఎగిసిపడే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలో స్వల్ప తగ్గుదల నమోదైంది. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,01,790, 24 క్యారెట్ల పది గ్రాముల ధర రూ. 1,11,050గా ఉంది. మరోవైపు వెండి ధర కిలోకు రూ. 1,42,900గా కొనసాగుతోంది. అంటే పెద్దగా ఊరటేమీ లేకపోయినా కొద్దిగా ఊపిరి పీల్చుకునే పరిస్థితి ఏర్పడింది. 24 క్యారెట్ల బంగారం రేటు నిన్న అంటే సెప్టెంబర్ 15తో పోల్చితే 10 గ్రాములకు రూ.870 పెరిగింది. అంటే గ్రాముకు రేటు రూ.87 పెరగటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య నగరాల్లో పెరిగిన రిటైల్ విక్రయ రేట్లు ఇలా భగ్గుమంటున్నాయి.. Gold and silver Rates.
బంగారం, వెండి రేట్లు ప్రతిరోజూ పెరుగుతూ కొత్త రికార్డు గరిష్ఠాలకు చేరుకుంటున్నాయి. దీంతో భవిష్యత్తులో అసలు వీటి రేట్లు ఏ స్థాయిల వరకు చేరుకుంటాయనే భయాలు సామాన్య మధ్యతరగతి భారతీయులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. మరో రెండు వారాల్లో దసరా కూడా దగ్గర పడుతున్న వేళ షాపింగ్ చేయాలనుకుంటున్న వారు పెరుగుతున్న రేట్లను చూసి షాక్ అవుతున్నారు.