
Maoist Letter To Modi: కేంద్ర ప్రభుత్వానికి మావోయిస్టులు సంచలన లేఖ రాశారు. ఇప్పుడు ఆ లేఖ కలకలం సృష్టించింది. పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటనలో మావోయిస్టులు ఏం చెప్పారు….వారు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు. ఇంతకు ఆ లేఖలో వారు ఏ డిమాండ్స్ చేశారు… తెలుసుకోవాలంటే లట్స్ వాచ్ దిస్ నౌ
మావోయిస్టులు కేంద్ర ప్రభుత్వానికి సంచలన లేఖ రాశారు. లేఖ కలకలం సృష్టించింది. ఆయుధాలు వదిలేస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా లకు విజ్ఞప్తి చేస్తూ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో లేఖ విడుదల చేశారు. ఆయుధాలు వదిలేస్తున్నామని, తమ పార్టీకి చెందిన లీడర్లకు ఎలాంటి విఘాతం కలగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. నెల రోజులపాటు యాంటీ నక్సల్స్ ఆపరేషన్లను నిలిపివేయాలని వేడుకున్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేస్తున్న ఆపరేషన్ కగార్తో మావోయిస్టులు కకావికలమయ్యారు. ఎక్కడికి వెళ్లిన దాచుకునేందుకు చోటు లేక ఎన్నడూ లేని రీతిలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మావోయిస్టులు విడుదల చేసిన లేఖతో అటు మావోయిస్టు, ఇటు పోలీసువర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. నెల రోజులపాటు మావోయిస్టులపై కాల్పులు జరగకుండా విరమణ కార్యక్రమాన్ని అమలుపరచాలని విజ్ఞప్తి చేశారు. అయితే ఈ లేఖను మావోయిస్టులే విడుదల చేశారా..? అనే అనుమానాలు సైతం తలెత్తుతున్నాయి.
దాదాపు గత ఏడాదికాలంగా మావోయిస్టులను స్వచ్ఛందంగా లొంగిపోయేందుకు ప్రత్యేక కార్యక్రమాలను మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం అమలుపరుస్తూ వస్తోంది. అదే కాకుండా ఆపరేషన్ కగార్ పేరిట నక్సల్స్ ను ఏరివేసే కార్యక్రమాన్ని సైతం అమలు చేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో అటు ఛత్తీస్గడ్ రాష్ట్రంలోనూ ఇటు తెలంగాణ రాష్ట్రంలోనూ మావోయిస్టుల మనుగడ ప్రశ్నార్ధకమైంది. ఎన్నో ఏళ్లుగా అడవుల్లో సంచరిస్తూ మావోయిస్టులకు స్వర్గధామాలుగా భావించిన ప్రాంతాల్లో అత్యధిక రోజులు గడుపుతూ తమ కార్యకలాపాలను సాగిస్తూ వస్తున్నారు. ఆపరేషన్ కగారులో భాగంగా కేంద్ర, చత్తీస్గడ్ రాష్ట్ర పోలీస్ బలగాలతో మావోయిస్టులు సంచరించే ప్రాంతాలను విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తూ వాళ్లను మట్టు పెడుతూ వస్తున్నారు.
అంతేకాకుండా అత్యాధునికమైన నూతన సాంకేతిక పరిజ్ఞానంతో మావోయిస్టులు సంచరించే ప్రాంతాలను చిటికెలో తెలుసుకునేలా ప్రణాళికలు చేశారు. వాటి వినియోగం కారణంగా మావోయిస్టులు దండకారణ్యంలోనూ సంచరించాలంటే వణుకు పుట్టేలా కేంద్ర ప్రభుత్వం చేసింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర కమిటీ సభ్యులు, రాష్ట్ర కమిటీ సభ్యులు, స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు పోలీసులకు చిక్కి తమ ప్రాణాలను కోల్పోయారు. ముందు నుంచి చెబుతూ వస్తున్న కేంద్ర హోం శాఖ మంత్రి అనుకున్నట్టుగానే 2026 మార్చి 31 నాటికి మావోయిస్టుల పార్టీ పూర్తిస్థాయిలో అంతం చేస్తామని వెల్లడిస్తూ వస్తున్నారు. ఆ నేపథ్యంలోనే కేంద్ర, చత్తీస్గడ్ రాష్ట్రాల పోలీస్ బలగాలు మూకుమ్మడిగా మావోయిస్టులపై దాడులు చేస్తూ వారిని మట్టు పెడుతున్నారు.
కాగా ఈ సంవత్సరం మార్చి చివరి నుంచి మా పార్టీ ప్రభుత్వంతో శాంతిచర్చలకు నిజాయతీగా ప్రయత్నిస్తోంది. మే 10న పార్టీ ప్రధాన కార్యదర్శి స్వయంగా పార్టీ కేంద్ర కమిటీ ప్రతినిధి అభయ్ పేరుతో ప్రకటన విడుదల చేశారు. పార్టీ ఆయుధాలను వదులుకుంటున్నట్లు ప్రస్తావించారు. ప్రభుత్వానికి కాల్పుల విరమణ ప్రతిపాదించారు. అత్యంత కీలకమైన ఈ అంశంపై పార్టీ అత్యున్నత నాయకత్వ సహచరులతో సంప్రదించడానికి నెల సమయం కోరారు. కానీ కేంద్రం అనుకూల వైఖరిని వ్యక్తం చేయలేదు. బదులుగా 2024 జనవరి నుంచి జరుగుతున్న సైనికదాడుల్ని తీవ్రతరం చేసింది. పర్యవసానంగా మే 21న మాడ్‌లోని గుండెకోట్ సమీపంలో జరిగిన భీకర దాడిలో పార్టీ ప్రధానకార్యదర్శి బస్వరాజ్‌తోపాటు 28 మంది మరణించారు”.
ఇక మరోవైపు జార్ఖండ్ రాష్ట్రంలోని హజారీబాగ్ లో మావోయిస్టులకు కోబ్రా 209 బెటాలియన్ పోలీసులకు మధ్య భీకర వెదురు కాల్పులు జరిగాయి. దీంతో ఘటన స్థలంలో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టుగా పేరుగాంచిన హిడ్మాకు అత్యంత సన్నిహితులు మావోయిస్టు సీనియర్ కమాండర్ సహదేవ్ సోరైన్సహా స్పెషల్ ఏరియా కమిటీ సభ్యుడు రఘునాథ్ హిమంబరం, జోనల్ కమిటీ సభ్యుడు విర్సెన్ గంజూ ఎన్కౌంటర్లో చనిపోయారు. ఎన్కౌంటర్ నేపథ్యంలోనే మావోయిస్టులు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారని నిజం ఉండొచ్చునేమోనని చర్చ జరుగుతుంది. Maoist Letter To Modi.
జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో మావోయిస్టులు అంతగా తమ ప్రాబల్యాన్ని చాటుకోలేకపోతున్నారనేది కూడా స్పష్టం అవుతోంది. ఈ నేపథ్యంలోనే మావోయిస్టులు ఆయుధాలు వదిలేస్తున్నామని, అవసరమైతే వీడియో కాల్ ద్వారా మాట్లాడుతామని ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా లకు విజ్ఞప్తి చేసినట్లుగా మావోయిస్టు అధికార ప్రతినిధి అభయ్ పేరుతో లేఖ వెలువడడం చర్చనీయాంశంగా మారింది. మరీ కేంద్రం ఎలా స్పందిస్తుందో తెలియాలీ అంటే వేచి చూడాల్సిందే.