
Kavitha And Vishnu Vardhan: ఒక్క ఫొటో వందల వార్తలకు సమానం అని కూడా అనుకోవాలి.. లక్షల అక్షరాలు చెప్పలేని భావాన్ని ఒక్క ఫొటో చాటుతుంది.. అందుకే మీడియాలో ఫొటోలకు చాలా ప్రాధాన్యం ఉంటుంది.. ఇలాంటి ఫొటోనే ఒకటి తెలంగాణ రాజకీయాల్లో, ముఖ్యంగా హైదరాబాద్ లో తీవ్ర కలకలం రేపింది. ఒక పార్టీలో బీపీ రేపింది. రాబోయే పార్టీగా చెప్పుకొనేలా మరో పార్టీలో హైప్ తెచ్చింది.. ఓ నాయకుడికి ప్లస్ పాయింట్ అయింది. ఇంతకు ఎవరు ఆయన తెలుసుకోవాలంటే లట్స్ వాచ్ దిస్ నౌ…
ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అకాల మరణంతో ఖాళీ అయిన జూబ్లీహిల్స్ అసెంబ్లీకి త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. కాగా ఈ సిట్టింగ్ నియోజకవర్గాన్ని ఎలాగైన తిరిగి దక్కించుకోవాలని బీఆర్‌ఎస్ పట్టుదలతో ఉంది. అయితే ఈ సీటుపై కాంగ్రెస్ కూడా కన్నేసింది. అయితే ఇదిలా ఉండగానే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై స్పెషల్ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఫోకస్ పెట్టడం చర్చనీయంశంగా మారింది. ఆమె కూడా తన సంస్థ నుంచి అభ్యర్థిని నిలపడానికి ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో ఎన్నికలకు సంబంధించిన కార్యాచరణాను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.
మరో వైపు జూబ్లీహిల్స్ సీటు నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన అజాహరుద్దీన్ భావించారు. అయితే, స్థానికం గా నియోజకవర్గంలో సామాజిక సమీకరణాలు.. పార్టీల బలాల ఆధారంగా సీఎం రేవంత్ కొత్త వ్యూహం అమలు చేస్తున్నారు. అందులో భాగంగా సీటు కోసం ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేసిన అజాహరుద్దీన్ ను పోటీ లేకుండా చట్ట సభలకు ఎంపిక చేసారు. దీంతో.. ఇప్పుడు రేవంత్ ఆలోచన లకు అనుగుణంగా జూబ్లీహిల్స్ బై పోల్ అభ్యర్ధి ఖరారు కానున్నారు. ఈ రేసులో ఇప్పటి వరకు ప్రధానంగా నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, రహ్మత్‌నగర్ కార్పొరేటర్ సీఎన్ రెడ్డి పేర్లు ప్రచారం లో ఉండగా.. మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి పేరు పైన సర్వే చేయించటం సంచలనంగా మారుతోంది. కాగా.. మాజీ మంత్రి దానం నాగేందర్ సైతం తనకు అవకాశం ఇవ్వాలని కొత్త ప్రతిపాదన తెర మీదకు తీసుకొచ్చారు.
ఇక దూకుడు మీద ఉన్న బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. దానికోసం ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ రంగంలోకి దిగారు. ఈ ఉప ఎన్నికలో గెలిస్తే.. ఆ ప్రభావం మరికొద్ది రోజుల్లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై పడే అవకాశం ఉంది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఎన్నికలపై ప్రభావం ఉంటుందని అన్ని పార్టీలు భావిస్తున్నాయి. అయితే ఈ ఉప ఎన్నికలో గెలిచి.. జూబ్లీహిల్స్‌లో తమ ప్రాబల్యం ఏ మాత్రం తగ్గలేదని సాంకేతాలు ఇచ్చేందుకు బీఆర్ఎస్ పార్టీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రంగంలోకి దిగారు. ఆయన నియోజక వర్గంలోని డివిజన్ల వారీగా నేతలతో ఆయన సమావేశమవుతున్నారు.
ఇక అధికార పార్టీ కాంగ్రెస్ తరఫున టికెట్ కోసం నలుగురు నాయకుల పేర్లు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ నుంచి మాత్రం మాగంటి సతీమణికి టికెట్ ఖాయం అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరోక్షంగా హింట్ ఇవ్వడమే దీనికి కారణం. అయితే, గత ఎన్నికల ముందు బీఆర్ఎస్ లో చేరిన మాజీ ఎమ్మెల్యే పి.విష్ణువర్ధన్ రెడ్డి ఉండగా మాగంటి సతీమణికి టికెట్ ఇవ్వబోతున్నట్లు ఊహాగానాలు చెలరేగాయి. ఇలాంటి పరిస్థితుల్లోనే విష్ణు.. బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ కు గురైన కల్వకుంట్ల కవితను కలిశారు. ఈ మేరకు ఫొటో బయటకు రావడంతో ఇప్పుడు కలకలం రేపింది.
బీఆర్ఎస్ నుంచి టికెట్ రాదని తేలడంతోనే విష్ణు.. తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కవితను కలిశారనే చర్చ వైరల్ అయింది. దీంతో బీఆర్ఎస్ షాక్ అయ్యింది. తమ సిటింగ్ స్థానం కావడం, విష్ణు వంటి కీలక నాయకుడు కవిత వర్గం వైపు వెళ్తున్నట్లు సంకేతాలు కనిపించడంతో అలెర్ట్ అయ్యారు. ఈ పరిణామాలతో వెంటనే విష్ణు తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టి కేటీఆర్ తోనే నా ప్రయాణం అని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ గనుక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలవకుంటే ఆ పార్టీకి మరిన్ని కష్టాలు ఎదురవుతాయి. అందుకే పరిణామాలు చేజారకుండా చూసుకుంది.
జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధి బంజారా హిల్స్ లో జాగృతి పార్టీ కార్యాలయాన్ని స్థాపించిన కవితకు విష్ణుతో భేటీ అంశం కలిసొచ్చింది. మంచి హైప్ తెచ్చింది. తనను సస్పెండ్ చేసిన బీఆర్ఎస్ ను సైతం కదిలించిన ఈ పరిణామం ఎంతైనా కవితకు ప్లస్ పాయింటేనని రాజకీయ వర్గాలు పేర్కొన్నాయి. ఒకవేళ కవిత సొంతంగా పార్టీ పెడితే ఎలా ఉంటుందో అనే ముందస్తు సంకేతం ఇచ్చిందని వివరిస్తున్నాయి. Kavitha And Vishnu Vardhan.
ఇక విష్ణువర్ధన్ రెడ్డి 2014, 2018 ఎన్నికల్లో గెలవలేదు.. 2023లో టికెట్ రాకపోవడంతో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరారు. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ లేనందున జూబ్లీహిల్స్ లో బలమైన నాయకుడు విష్ణునే. కానీ, ఆయనకు ఈసారికి బీఆర్ఎస్ టికెట్ వచ్చే పరిస్థితి లేదు. తాజా పరిణామాలు మాత్రం ఆయన ఉనికి చాటుకునేందుకు పరోక్ష అవకాశం కల్పించాయి. ఇంతకూ కవితను విష్ణు కలిసిన నేపథ్యం ఏమిటంటే.. జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి దసరా ఉత్సవాలు. ఈ ఆలయం విష్ణు తండ్రి దివంగత పీజేఆర్ మానస పుత్రిక. పీజేఆర్ కుటుంబానికి కూడా తర్వాతి కాలంలో అంతే అనుబంధం ఏర్పడింది. దసరా ఉత్సవాలకు కవితను ఆహ్వానించేందుకే విష్ణు ఆమెను కలిశారు. కానీ, రాజకీయ పరిణామాల రీత్యా భిన్నమైన విశ్లేషణలు వచ్చాయి. ఒక్క ఫోటోతో వైరల్ కావడంతో విష్ణుకు ప్లస్ అయ్యిందనే చెప్పుకోవచ్చు.