
The Great Wedding Show: వెర్సటైల్ యాక్టర్ తిరువీర్, టీనా శ్రావ్య హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’. 7 పి.ఎం.ప్రొడక్ష్సన్స్, పప్పెట్ షో ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై సందీప్ అగరం, అస్మితా రెడ్డి బాసిని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 7న సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ మంగళవారం టీజర్‌ను రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల రిలీజ్ చేశారు.
అనంతరం శేఖర్ కమ్ముల మాట్లాడుతూ ‘‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో టీజర్‌ను రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. సినిమా టీమ్ మొత్తం యంగ్ అండ్ ఎనర్జిటిక్‌గా కనిపిస్తోంది. అందరిలో మంచి వైబ్ ఉంది. సినిమా టీజర్ సరదాగా సాగిపోయింది. తిరువీర్ ప్రామిసింగ్ హీరో. టాలీవుడ్‌లో తనకంటూ సొంతంగా ఓ స్పేస్ క్రియేట్ చేసుకుంటాడు. ఈ ఈవెంట్‌కు పిలచినిప్పుడే ఇదొక స్పెషల్ ఫిల్మ్ అనిపించింది. తీరువీర్‌కు ప్రీ వెడ్డింగ్ షో లాంటి మరిన్ని మంచి సినిమాలు చేయాలి. హీరోయిన్ నాచురల్‌గా కనిపించింది. ఇలాంటి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు నిర్మించడానికి ధైర్యం, పాషన్ ఉండాలి. నిర్మాతలను చూస్తుంటే నా డాలర్ డ్రీమ్స్, ఆనంద్ రోజులు గుర్తొచ్చాయి. కంప్లీట్ క్లీన్ ఫిల్మ్ అని తీరువీర్ అన్నాడు. బ్యాక్‌డ్రాప్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. టీజర్‌ను చూడగానే సినిమా చూడాలని అనిపిస్తుంది. దర్శకుడి మార్కు కనిపిస్తుంది. ప్రీ వెడ్డింగ్ షో సినిమా పెద్ద విజయాన్ని సాధించాలి’’ అని తెలిపారు.
హీరో తిరువీర్ మాట్లాడుతూ ‘‘ఫ్రెండ్ సజేషన్‌తో ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ కథ విన్నాను. కథ వింటున్నప్పుడు స్టార్టింగ్ నుంచి చివరి వరకు నవ్వుతూనే ఉన్నాను. అప్పుడే ఈ సినిమా చేయాలని ఫిక్సయ్యాను. మార్కెట్ లెక్కల గురించి ఆలోచించకుండా నిర్మాతలు సందీప్, రంజిత్ ధైర్యంగా సినిమా చేయడానికి ముందుకొచ్చారు. కొత్త ప్రొడ్యూసర్, డైరెక్టర్ రిస్క్ చేసి సినిమా చేస్తున్నప్పుడు మంచి కథను సపోర్ట్ చేయడానికి నేను ఏం చేయగలను అనిపించింది. పప్పేట్ షో అనే బ్యానర్ లాంఛ్ చేసి రెమ్యూనరేషన్ తీసుకోకుండా సినిమాలో భాగం అయ్యాను. ఈ సినిమా నా నమ్మకాన్ని నిలబెడితే భవిష్యత్తులో ఇలాంటి కొన్ని సినిమాలు చేస్తాను. షూట్ మొత్తం పిక్నిక్‌లా సాగింది. ఇంటిల్లిపాది కలిసి చూసే మంచి సినిమాగా పప్పేట్ షో నిలుస్తుంది’’ అని చెప్పారు.
ప్రొడ్యూసర్ సందీప్ మాట్లాడుతూ ‘‘డైరెక్టర్ రాహుల్ నాకు ప్రొడ్యూసర్‌గా లైఫ్ ఇచ్చాడు. మేము అనుకున్న బడ్జెట్ కంటే ఐదింతలు పెరిగింది. కథపై నమ్మకంతో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సినిమా చేశాం. 35 రోజులు అరకులో షూట్ చేశాం. చాలా సీన్స్ సింగిల్ టేక్‌లోనే చేశాడు తిరువీర్. సురేష్ బొబ్బిలి మంచి హిట్ సాంగ్స్ ఇచ్చాడు’’ అని పేర్కొన్నారు.

డైరెక్టర్ రాహుల్ శ్రీనివాస్ మాట్లాడుతూ ‘‘ప్రొడ్యూసర్లు సందీప్, రంజిత్ ఫస్ట్ సిట్టింగ్‌లోనే కథను నమ్మారు. వన్ ఇయర్ జర్నీ చాలా సాఫ్ట్‌గా వెళ్లిపోయింది. మసూద హిట్టైనా తర్వాత తీరువీర్‌కు చాలా మంది కథలు చెప్పారు. కానీ వారందరిని కాదని డెబ్యూ డైరెక్టర్ అయినా నన్ను నమ్మాడు. అది జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. రోహన్ డేట్స్ ఖాళీ లేకపోవడంతో తిరువీర్ ఒప్పించి అతడిని సినిమాలో భాగమయ్యేలా చేశాడు’’ అని అన్నారు.
హీరోయిన్ టీనా శ్రావ్య మాట్లాడుతూ ‘‘టీజర్ శాంపిల్ మాత్రమే. రెండు గంటలు ప్రతి సీన్, డైలాగ్ బాంబ్‌ల పేలిపోతాయి. తీరువీర్ నుంచి చాలా నేర్చుకున్నారు. ఆయనతో పనిచేయడం ఛాలెంజింగ్‌గా అనిపించింది. హేమ పాత్రకు న్యాయం చేయడమే కాకుండా నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన దర్శకుడి న మ్మకాన్ని నిలబెట్టానని అనుకుంటున్నాను’’ అని తెలిపింది.
నిర్మాత అశ్విత రెడ్డి మాట్లాడుతూ ‘‘తీరువీర్, టీనా శ్రావ్య యాక్టింగ్ బాగుంటుంది. ఫన్ ఎంటర్‌టైనర్‌గా డైరెక్టర్ రాహుల్ ఈ మూవీని రూపొందించాడు. ప్రారంభం నుంచి చివరి వరకు ఆడియెన్స్‌ను నవ్విస్తుంది. విజయ్ దేవరకొండ, శేఖర్ కమ్ముల టీజర్ రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది’’ అని చెప్పారు.
యాక్టర్ రోహన్ మాట్లాడుతూ ‘‘రెండు గంటలు కడుపుబ్బా నవ్వించే మూవీ. అప్పుడే రెండు గంటలు అయిపోయిందా అనిపిస్తుంది. డ్రామా జూనియర్స్‌లో తిరువీర్ నాకు మెంటర్‌గా పనిచేశారు. చాలా కాలం తర్వాత మళ్లీ తిరువీర్‌తో పనిచేయడం ఆనందంగా ఉంది. మా ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చే సీన్స్ పడి పడి నవ్విస్తాయి’’ అని చెప్పారు.
యాక్టర్ నరేంద్ర రవి మాట్లాడుతూ ‘‘మేమ్ ఫేమస్ తర్వాత నేను చేసిన సినిమా ఇది. ఇందులో మంచి పాత్ర చేశా. ఇన్‌స్టాగ్రామ్ రీల్‌లో నన్ను డైరెక్టర్ సెలెక్ట్ చేశారు. శ్రీకాకుళం బ్యాక్‌డ్రాప్‌లో చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. షూటింగ్‌లో తిరువీర్ ఇచ్చిన సపోర్ట్ మర్చిపోలేను’’ అని అన్నారు.
ఎడిటర్ నరేష్ మాట్లాడుతూ ‘‘రెండు గంటలు నాన్‌స్టాప్‌గా నవ్వించే మూవీ ఇది. చాలా మంది ఫొటోగ్రాఫర్స్, కొత్తగా పెళ్లైనా వాళ్లకు, పెళ్లిచేసుకోబోతున్న వాళ్లకు కనెక్ట్ అవుతుంది’’ అని అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి మాట్లాడుతూ ‘‘బ్యూటీఫుల్ ఫిల్మ్‌కు వర్క్ చేసిన ఫీలింగ్ కలిగింది. మంచి సినిమా రాబోతుంది. ప్రస్తుతం చిన్న సినిమాలు జనాదరణ పొందుతున్నాయి. క్లీన్ కామెడీ మూవీ. తిరువీర్ నాచురల్ యాక్టింగ్‌తో అదరగొట్టాడు. రోహన్ పాత్ర నవ్విస్తుంది. తమిళం, మలయాళం డైరెక్టర్లకు మించి అద్భుతంగా రాహుల్ ఈ సినిమాను రూపొందించారు. సందీప్ ప్రొడ్యూసర్‌లా కాకుండా స్నేహితుడిలా ఫ్రీడమ్ ఇచ్చారు. మంచి టీమ్‌తో పనిచేశాను’’ అని అన్నారు. The Great Wedding Show.