“మిరాయ్” విజయం నా జీవితంలో మర్చిపోలేని సంతోషాన్నిచ్చింది.!

Rocking Star Manchu Manoj: రాకింగ్ స్టార్ మంచు మనోజ్ “మిరాయ్” చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఈ చిత్రంలో ఆయన చేసిన బ్లాక్ స్వార్డ్ క్యారెక్టర్ ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తోంది. “మిరాయ్” పాన్ ఇండియా స్థాయిలో రికార్డ్ కలెక్షన్స్ సాధిస్తోంది. ఈ ఘన విజయాన్ని పురస్కరించుకుని తాజాగా విజయవాడలో సక్సెస్ సెలబ్రేషన్స్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంచు మనోజ్ స్పీచ్ హైలైట్ అయ్యింది.

రాకింగ్ స్టార్ మంచు మనోజ్ మాట్లాడుతూ – “మిరాయ్” సినిమా రిలీజ్ అయ్యాక నాకు వచ్చిన ఫస్ట్ కాంప్లిమెంట్ అమ్మ దగ్గర నుంచే. అమ్మ ప్రశంసలు నా మనసును కదిలించాయి. “మిరాయ్” చూసి మా అమ్మ నన్ను హత్తుకుని భావోద్వేగానికి గురైంది. నీకు తెలియదురా నాన్నా, నిన్ను ఎంతగా స్క్రీన్ మీద చూడటం మిస్ అయ్యానో అని చెప్పింది. సినిమాలు చేస్తూ ఉండు అని అంది. అందరికీ ఫోన్స్ చేసి “మిరాయ్” చూశారా, నా బిడ్డ మహవీర్ లామా క్యారెక్టర్ లో అదిరిపోయేలా నటించాడు అని చెప్పుకుని సంతోషించింది. నా కుటుంబ సభ్యులు, మిత్రులతో కలిసి “మిరాయ్” సినిమా చూడటం నా జీవితంలో మర్చిపోలేని అనుభూతినిచ్చింది. నా పిల్లలకు కూడా “మిరాయ్” సినిమా బాగా నచ్చింది. నేను కంటిన్యూగా సినిమాలు చేయాలని నా అభిమానులు ఎంతగానో కోరుకున్నారు.

వారు ఎదురుచూసిన సినిమా “మిరాయ్” రూపంలో నాకు దక్కింది. విశ్వప్రసాద్ గారు కాంప్రమైజ్ కాకుండా పాన్ ఇండియా స్థాయిలో సినిమాను తీసుకెళ్లారు. అలాంటి ప్రొడ్యూసర్ మరొకరు ఉండరు. డార్లింగ్ ప్రభాస్ తో విశ్వప్రసాద్ గారు నిర్మిస్తున్న రాజా సాబ్ కూడా మామూలుగా ఉండదు. ఆ సినిమా రికార్డ్ లు తిరగరాస్తుంది. వారి సంస్థలో వస్తున్న మోగ్లీ కూడా మంచి విజయం సాధించాలి. మంచి సినిమా చేస్తే తెలుగు ఆడియెన్స్ తప్పకుండా థియేటర్స్ కు వచ్చి ఆదరిస్తారు. తెలుగు మీడియా మిత్రులు కూడా నాపై, మా సినిమాపై ఎంతో ప్రేమ చూపిస్తున్నందుకు కృతజ్ఞతలు. లిటిల్ హార్ట్స్ అనే సినిమా వచ్చి మంచి విజయం సాధించింది. స్టార్ గా ఎదగాలంటే చిరంజీవి, మోహన్ బాబు కొడుకులే కావాల్సిన అవసరం లేదు. ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, యూట్యూబర్ మౌళి కూడా హీరోగా ఎదగొచ్చు అని మన ప్రేక్షకులు నిరూపించారు. Rocking Star Manchu Manoj.

“మిరాయ్” కోసం ఎలా నిలబడ్డానో, రేపు మౌళి తన సినిమాలో నటించమని అడిగినా నటిస్తా. నెక్ట్స్ డేవిడ్ రెడ్డి అనే మూవీ చేస్తున్నాను. బ్రిటీష్ కాలంలో జరిగిన యాక్షన్ స్టోరీతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నాం. కేజీఎఫ్ టీమ్ మెంబర్స్ రవి బస్రుర్, ఉజ్వల్ మా డేవిడ్ రెడ్డి మూవీకి వర్క్ చేస్తున్నారు. టీ సిరీస్ వాళ్లతో అబ్రహాం లింకన్ అనే యాక్షన్ మూవీ చేస్తున్నాను. రక్షక్ అనే మూవీలో ఫస్ట్ టైమ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నా. అన్నారు.