పవన్ అభిమానులకు చేదు వార్త..!

AP Government Ticket Prices: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘ఓజీ’ సినిమాపై ఇప్పటికే సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో క్రేజ్ నెలకొంది. ఈ మూవీపై అభిమానులు మాత్రమే కాకుండా, సినీ ప్రేయులు, ఇండస్ట్రీ వర్గాలు కూడా భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు విడుదలైన గ్లింప్స్, ఫస్ట్ సింగిల్, ఇతర ప్రమోషనల్ కంటెంట్ అన్నీ కూడా భారీ రెస్పాన్స్‌ను తెచ్చుకున్నాయి. ఈ మధ్య కాలంలో వచ్చిన టాలీవుడ్ సినిమాల్లో ఇంతటి స్టైల్, టెక్నికల్ ప్రెజెంటేషన్, మేకింగ్ కనపడలేదని టాక్. దాంతో డైరెక్టర్ సుజిత్ పట్ల కూడా మంచి నమ్మకం ఏర్పడింది. ఇది ఖచ్చితంగా పవన్ కెరీర్‌లో ఒక మైలురాయి సినిమా అవుతుంది అని ఫ్యాన్స్ నమ్మకంగా చెబుతున్నారు.

అయితే ఈ హైప్ మధ్యలో ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ అభిమానుల్లో అసహనాన్ని కలిగిస్తోంది. గతంలో పవన్ కళ్యాణ్ చిత్రం ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ సందర్భంగా ప్రీమియర్ షోలు వేసిన సంగతి తెలిసిందే. కానీ కంటెంట్ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఆ సినిమా ఫలితం నిరాశపరిచింది. ఇక తాజా సమాచారం ప్రకారం, ‘ఓజీ’ మూవీకి ముందుగా ప్రీమియర్ షోలు ఉండవన్న వార్తలు వినిపిస్తున్నాయి. తొలుత సాయంత్రం నుంచే ప్రీమియర్ షోలు ఉంటాయని భావించారు కానీ తాజా సమాచారం ప్రకారం సినిమా ప్రదర్శన రాత్రి 1 గంటల తర్వాత లేదా తెల్లవారుజామున 4 గంటల తర్వాత మొదలవుతుందని తెలుస్తోంది. డిస్ట్రిబ్యూటర్లకు కూడా ఈ మేరకు సమాచారం అందినట్లు తెలుస్తోంది.

ఇక ముఖ్యంగా ఇది పవన్ కళ్యాణ్ సినిమా కావడం, భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ కావడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా అనుమతులు ఇచ్చింది. సెప్టెంబర్ 25న రాత్రి 1 గంటకు బెనిఫిట్ షో నిర్వహించేందుకు ప్రభుత్వ జీవో విడుదలైంది. టికెట్ ధరను ₹1000 (జీఎస్టీతో కలిపి)గా నిర్ణయించారు. అదేవిధంగా, సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 4 వరకు పదిరోజుల పాటు టికెట్ ధరలను పెంచుకోవడానికి అధికారికంగా అనుమతినిచ్చారు. AP Government Ticket Prices.

ఈ దశలో సింగిల్ స్క్రీన్లలో ₹125 అదనంగా, మల్టీప్లెక్స్‌లలో ₹150 అదనంగా టికెట్ ఛార్జీలు వసూలు చేసుకోవచ్చని జీవోలో స్పష్టం చేశారు. ఇది బాక్సాఫీస్ వసూళ్లపై ప్రభావం చూపుతుందని, ‘ఓజీ’ కొత్త రికార్డులు క్రియేట్ చేయనున్నదని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తానికి చెప్పాలంటే, ఓవర్‌హైప్, బాక్సాఫీస్ స్టామినా, భారీ టికెట్ రేట్లతో ‘ఓజీ’ రిలీజ్ ఒక సెన్సేషన్‌గా మారనుంది. కానీ, ప్రీమియర్ షోలు లేకపోవడమే మాత్రం ఫ్యాన్స్ ను అప్సెట్‌ చేస్తోంది.