
Pawan Sentimental Abuse: సినిమా వాళ్లకు సెంటిమెంట్స్ ఎక్కువ అనే విషయం ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. చాలామంది స్టార్ హీరోలు సైతం తమ సినిమాల విషయంలో ఈ సెంటిమెంట్స్ ను ఫాలో అవుతుంటారు. కొన్ని సార్లు అవి వర్కౌట్ అవుతాయి. మరికొన్ని సార్లు ఫెయిల్ అవుతుంటాయ. కానీ మన హీరోలు నెగిటివ్ సెంటిమెంట్స్ కు భయపడుతుంటారు. తాజాగా ఓజి మూవీ విషయంలోనూ ఫ్యాన్స్ ని అలాంటి ఓ నెగిటివ్ సెంటిమెంటే భయపెడుతోంది. ఆ సెంటిమెంట్ ప్రకారం ఓజి డిజాస్టర్ అవుతుందని కొందరు ముందే డిసైడ్ చేసేస్తున్నారు. ఇంతకీ ఓజి ని వెంటాడుతోన్న ఆ బ్యాడ్ సెంటిమెంట్ ఏంటి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ..
సినీ పరిశ్రమలో సెంటిమెంట్లకు కొదువ లేదు. ముహూర్తం షాట్ కి ముందు కొబ్బరికాయ కొట్టే టైం నుండి షూటింగ్ చివరి రోజు గుమ్మడికాయ కొట్టే వరకు మేకర్స్ చాలా సెంటిమెంట్లు ఫాలో అవుతూ ఉంటారు. పలనా ముహూర్తానికి సినిమా మొదలుపెట్టాలని, పలనా రిలీజ్ డేట్ కి సినిమా ఫినిష్ చేయాలని.. ఇలా ఒక్కటేంటి చాలా సెంటిమెంట్లు చూస్తూనే ఉంటాం. కొంతమంది హీరోల సినిమాలకి అభిమానుల అభిప్రయాలను అడిగి సెంటిమెంట్ ప్రకారం కలిసి రాని డేట్లకి సినిమాలు రిలీజ్ ఇవ్వకుండా ఉండటం.. లేదంటే కలిసొచ్చిన డేట్లకి సినిమాలు రిలీజ్ ఇవ్వడం వంటివి మనం చూస్తూనే ఉన్నాం.
అలాగే కొన్ని కాంబినేషన్స్ లో సినిమాలు వస్తే కచ్చితంగా ప్లాప్ అన్న టాక్ కూడా ఉంది. ఉదాహరణకు పూరి జగన్నాథ్ – ప్రభాస్ కాంబోలో వచ్చిన ‘బుజ్జిగాడు’, ‘ఏక్ నిరంజన్’ రెండూ ప్లాప్స్ అయ్యాయి. దీంతో వాళ్ళు మళ్ళీ సినిమా చేసేందుకు సాహసించలేదు. ఎన్టీఆర్ – మెహర్ రమేష్ కాంబోలో వచ్చిన ‘కంత్రి’, ‘శక్తి’ సినిమాల పరిసస్థితి కూడా ఇంతే. శ్రీను వైట్ల – మహేష్ కాంబోలో వచ్చి న ‘దూకుడు’ ఇండస్ట్రీ రికార్డ్స్ తిరగ రాయగా.. ఆ తర్వాత వచ్చిన ‘ఆగడు’ అట్టర్ ప్లాప్ అయింది. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఓజి మూవీ విషయంలో ఓ సరికొత్త సెంటిమెంట్ తెరపైకి వచ్చింది.
పవన్ కల్యాణ్ స్వయంగా పాడిన పాటను తాజాగా రిలీజ్ చేసింది మూవీ టీమ్. వాషి ఓ వాషీ అంటూ సాగే ఈ స్పెషల్ సాంగ్ ను యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. ఇందులో పవన్ కల్యాణ్ తన హుషారెత్తించే గొంతుతో ఆకట్టుకున్నారు. విలన్ ఓమీకి ఏదో వార్నింగ్ ఇస్తూ పాడిన పాటలాగా ఉంది. నీ లాంటి ఎలా నేలకు దించాలో నాకు బాగా తెలుసు.. మా తాత చెప్పిన మాట చెబుతాను విను అంటూ ఈ పాటను మొదలుపెడుతాడు పవన్ కల్యాణ్. ప్రజెంట్ పవన్ పాడిన ఈ సాంగ్ నెట్టింట ట్రెండ్ అవుతుంది. ఇదే తరుణంలో పవన్ పాట పాడితే ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అవుతుందని.. ఈ సెంటిమెంట్ గత సినిమాలకు కూడా వర్కవుట్ అయిందని కొందరు ప్రచారం షురూ చేశారు. Pawan Sentimental Abuse.
సరిగ్గా పరిశీలించి చూస్తే ఇది నిజమే అనే కామెంట్స్ విన్పిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ సినిమాలను గమనిస్తే.. జానీ లో నారాజు గాకురమా అన్నయ, నువ్వు సారా తాగుడు మాను లింగం, గుడుంబా శంకర్ లో కిల్లి కిల్లి అనే సాంగ్, పంజాలో పాపా రాయుడు, అజ్ఞాత వాసి లో కాటమరాయుడా కదిరి నరసింహుడా, హరిహర వీరమల్లు మాట వినాలి.. ఈ పాటలన్నింటిని స్వయంగా పవన్ కల్యాణే పాడారు. ఈ సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయ్యాయి. ఇక ఇప్పుడు ఓజీలో లో వాశి ఓ వాశి అనే సాంగ్ ను పాడటంతో ఓజి కూడా డిజాస్టర్ అవుతుందని అంటున్నారు. దీంతో ఈ సెంటిమెంట్ పట్ల పవన్ ఫ్యాన్స్ లో ఆందోళన మొదలైంది. ఎందుకంటే పవన్ గత సినిమాల రిజల్ట్స్ అలాగే ఉండటంతో ఎక్కడ ఓజి కూడా ఆ సెంటిమెంట్ ని రిపీట్ చేస్తుందోనని తెగ టెన్షన్ పడిపోతున్నారు. ఓజి విషయంలో అలా అస్సలు జరగకూడదని కోరుకుంటున్నారు.