
OG vs Pulivendula: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ సినిమా సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తుదకు వారి నిరీక్షణకు ముగింపు పలకబోతున్న వేళ, సినిమా పై క్రేజ్ మరింత పెరిగిపోతోంది.ఇప్పటి వరకు పవన్ ఎక్కడ కనిపించినా – సినిమా ఈవెంట్స్ అయినా, రాజకీయ సభలు అయినా – అక్కడ ఒక్కసారిగా “OG, OG” అనే నినాదాలే వినిపించేవి. అంతగా ఈ సినిమా ఫ్యాన్స్ మనసుల్లో స్థానం సంపాదించుకుంది. పవన్ గత చిత్రం ‘హరిహరవీరమల్లు’ విడుదల సమయంలో కూడా, చాలామంది అభిమానులు “మేము OG కోసం ఎదురుచూస్తున్నాం” అని వ్యాఖ్యానించటం తెలిసిందే.
ఇప్పటికే ఫ్యాన్స్ మదిలో OG ఒక ఎమోషన్ గా మారిపోయింది. తాజాగా, ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతం, ముఖ్యంగా పులివెందుల పట్టణం OG చర్చలకు వేదికగా మారింది. OG అనేది సినిమాలో “ఓజాస్ గంభీరా” అనే అర్థం ఉన్నా, అభిమానుల మాటల్లో అది “ఒరిజినల్ గాడ్” అని మారిపోయింది. ఈ నినాదానికి రాజకీయ రంగు కూడా తీసుకొచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ పులివెందుల నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండటంతో, పవన్-జగన్ మధ్య ఉన్న రాజకీయ వైరం OG చర్చల్లోకి లాగబడింది. పవన్ ఫ్యాన్స్ OG ని ఒరిజినల్ గాడ్ అంటూ అతడిని పొగడగా, జగన్ అభిమానులు కూడా అదే మాటను తమ నాయకుడిపై వర్తింపజేస్తున్నారు. దీంతో OG అనే పదం పులివెందులలో మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
పవన్ సినిమాలకు పులివెందులలో మంచి ఫాలోయింగ్ ఉంది. అక్కడ దాదాపు 10 థియేటర్లు ఉన్నట్టు సమాచారం. OG సినిమాపై ఉన్న భారీ క్రేజ్ దృష్ట్యా, ఈ అన్ని థియేటర్లలోనూ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం OG సినిమా రిలీజ్ ముందు రోజు సెప్టెంబర్ 24 రాత్రి బెనిఫిట్ షోలకు అనుమతినిచ్చింది. ప్రీమియర్స్ కు నో అని చెప్పినప్పటికీ, బెనిఫిట్ షోలకు రూ.1000 వరకు టికెట్ ధరను ఆమోదించింది. విడుదల తరువాత పది రోజులపాటు ఐదవ షోలకు అనుమతి ఇచ్చింది. అలాగే, సాధారణ టికెట్ ధరల కంటే కొంత ఎక్కువగా వసూలు చేసుకోవడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఇక తెలంగాణ ప్రభుత్వం కూడా OG సినిమాను సపోర్ట్ చేస్తూ ప్రీమియర్ షోలకు అనుమతి ఇచ్చింది. సెప్టెంబర్ 24 రాత్రి 9:00గంటలకు షో ప్రారంభం అయ్యేలా జీవో విడుదల చేసింది. టికెట్ ధరల్లో కూడా భారీగా పెంపునకు అనుమతి ఇచ్చింది. OG vs Pulivendula.
ప్రీమియర్ షోలు టికెట్ ధర: రూ.800 (జీఎస్టీతో సహా)
సింగిల్ స్క్రీన్ థియేటర్లు: అదనంగా రూ.100 వరకూ
మల్టీప్లెక్స్‌లలో: అదనంగా రూ.150 వరకూ
ఈ టికెట్ ధరలు సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 4 వరకూ అంటే 10 రోజులు అమల్లో ఉండనున్నాయి.